Thalliki Vandanam : “తల్లికి వందనం” నిధులు విడుదల చేసిన ఏపీ సర్కార్ | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Thalliki Vandanam : “తల్లికి వందనం” నిధులు విడుదల చేసిన ఏపీ సర్కార్

 Authored By ramu | The Telugu News | Updated on :12 June 2025,4:00 pm

ప్రధానాంశాలు:

  •  Thalliki Vandanam : “తల్లికి వందనం” నిధులు విడుదల చేసిన ఏపీ సర్కార్

Thalliki Vandanam  : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం “తల్లికి వందనం” పథకానికి సంబదించిన నిధులను విడుదల చేసింది. ఈ పథకం కింద రాష్ట్రంలోని 1వ తరగతి నుంచి 12వ తరగతి వరకు చదువుతున్న ప్రతి విద్యార్థికి రూ.15,000 నేరుగా వారి తల్లుల ఖాతాల్లో జమ చేయనుంది. ఈ పథకం ద్వారా తల్లుల పాత్రను గుర్తించి విద్యలో వారి భాగస్వామ్యాన్ని మెరుగుపరచడమే ప్రభుత్వ లక్ష్యంగా ఉంది. విద్యార్థులు పాఠశాలకు తరచుగా హాజరయ్యేలా చేయడంతోపాటు, తల్లులు విద్యపై మరింత దృష్టి పెట్టేందుకు ఈ ఆర్థిక ప్రోత్సాహం దోహదపడనుంది.

Thalliki Vandanam తల్లికి వందనం నిధులు విడుదల చేసిన ఏపీ సర్కార్

Thalliki Vandanam : “తల్లికి వందనం” నిధులు విడుదల చేసిన ఏపీ సర్కార్

ఇక పాఠశాలల నిర్వహణ కోసం రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తెరతీసింది. ప్రతి విద్యార్థికి సంబంధించి పాఠశాల మెయింటెనెన్స్ కోసం సంబంధిత జిల్లా కలెక్టర్ ఖాతాకు రూ.2,000 జమ చేయనున్నట్టు ప్రకటించింది. ఈ నిధులను శుభ్రత, మౌలిక వసతులు, చిన్న మరమ్మత్తుల వంటి అవసరాలకు వినియోగించవచ్చు. పాఠశాలల పరిశుభ్రతను మెరుగుపరచడం, విద్యార్థులకు మంచి వాతావరణాన్ని కల్పించడం ద్వారా విద్యా ప్రమాణాలను పెంచే దిశగా ఈ చర్య ప్రభావం చూపనుంది.

“తల్లికి వందనం” పథకం ఇప్పటికే గత సంవత్సరాల్లో మంచి ఫలితాలను అందించిన నేపథ్యంలో, 2025-26లో మరింత పటిష్టంగా అమలయ్యేందుకు ప్రభుత్వం ముందంజ వేసింది. ఈ పథకం వల్ల తల్లుల ఆర్థిక భద్రత పెరగడమే కాదు, విద్యార్థుల చదువుపై కుటుంబాల దృష్టి మరింతగా పెరుగుతుంది. తల్లులను విద్యాభివృద్ధిలో భాగస్వాములుగా మార్చే ఈ కార్యక్రమం రాష్ట్రానికి ఒక మార్గదర్శకంగా నిలవనుంది.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది