AP Volunteer : కేబినేట్ మీటింగ్ త‌ర్వాత వాలంటీర్ల గుండెల్లో గుబులు.. వారి ప‌ని ఖ‌త‌మైన‌ట్టేనా? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

AP Volunteer : కేబినేట్ మీటింగ్ త‌ర్వాత వాలంటీర్ల గుండెల్లో గుబులు.. వారి ప‌ని ఖ‌త‌మైన‌ట్టేనా?

AP volunteer : ఏపీలో గత వైసీపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన వాలంటీర్ల వ్యవస్థ ఎన్ని ప్ర‌కంప‌న‌లు పుట్టించిందో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్కర్లేదు. ఎన్నిక‌ల ప్ర‌చార స‌మ‌యంలో ఒక‌రిపై ఒక‌రు తీవ్ర ఆరోప‌ణ‌లు చేసారు. అయితే ఎన్నిక‌ల‌కి ముందు వాలంటీర్ల వ్యవస్థ కొనసాగిస్తామని, వారికి జీతాలను కూడా రెట్టింపు చేస్తామని చెప్పిన కూటమి నేతలు ఇప్పుడు ప్రభుత్వంలోకి రాగానే వారిని పెన్షన్ల పంపిణీ నుంచి తప్పించడం చర్చనీయాంశంగా మారింది.అధికారంలోకి వ‌చ్చాక తెలుగుదేశం- జనసేన- భారతీయ జనతా పార్టీ సంకీర్ణ […]

 Authored By ramu | The Telugu News | Updated on :25 June 2024,3:00 pm

ప్రధానాంశాలు:

  •  AP Volunteer : కేబినేట్ మీటింగ్ త‌ర్వాత వాలంటీర్ల గుండెల్లో గుబులు.. వారి ప‌ని ఖ‌త‌మైన‌ట్టేనా?

AP volunteer : ఏపీలో గత వైసీపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన వాలంటీర్ల వ్యవస్థ ఎన్ని ప్ర‌కంప‌న‌లు పుట్టించిందో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్కర్లేదు. ఎన్నిక‌ల ప్ర‌చార స‌మ‌యంలో ఒక‌రిపై ఒక‌రు తీవ్ర ఆరోప‌ణ‌లు చేసారు. అయితే ఎన్నిక‌ల‌కి ముందు వాలంటీర్ల వ్యవస్థ కొనసాగిస్తామని, వారికి జీతాలను కూడా రెట్టింపు చేస్తామని చెప్పిన కూటమి నేతలు ఇప్పుడు ప్రభుత్వంలోకి రాగానే వారిని పెన్షన్ల పంపిణీ నుంచి తప్పించడం చర్చనీయాంశంగా మారింది.అధికారంలోకి వ‌చ్చాక తెలుగుదేశం- జనసేన- భారతీయ జనతా పార్టీ సంకీర్ణ కూటమి ప్రభుత్వం.. అనూహ్య నిర్ణయాలను తీసుకుంటోంది. తాము అధికారంలోకి వస్తే వాలంటీర్ల వ్యవస్థను కొనసాగిస్తామంటూ పదేపదే హామీలను ఇచ్చిన కూటమి- ఇప్పుడు యూటర్న్ తీసుకుంటోంది.

AP volunteer వాలంటీర్ వ్య‌వ‌స్థ‌పై క్లారిటీ వ‌చ్చిన‌ట్టేనా..

లబ్దిదారులకు ప్రతి నెలా ఇంటి వద్దే పింఛన్ మొత్తాన్ని చెల్లించే విధానం నుంచి వలంటీర్లను దాదాపుగా తప్పించింది. ఈ బాధ్యతలను గ్రామ/వార్డు సచివాలయ ఉద్యోగులకు అప్పగించింది. జులై 1వ తేదీ నుంచే ఈ మార్పు అమలులోకి రానుంది. ఈ మేరకు మంత్రివర్గంలో నిర్ణయం తీసుకుంది. ప్రతీ నెలా సచివాలయ సిబ్బందే పెన్షన్ ఇంటింటికీ పంపిణీ చేస్తారని మంత్రి పార్థసారథి తెలిపారు. కేబినెట్ మీటింగ్ అనంతరం మీడియాతో మాట్లాడిన సమాచార మంత్రి పార్థసారథి… వాలంటీర్లను ఎలా ఉపయోగించాలనే విషయంపై ప్రభుత్వం ఆలోచనలు చేస్తుందని తెలిపారు. జూలై 1 న పెన్షన్ల పంపిణీ బాధ్యతలు మాత్రం వారికి ఇవ్వడం లేదని స్పష్టం చేశారు. దీంతో వాలంటీర్లను ఈ సర్కార్ పక్కన పెడుతున్నట్లేనా అనే అనుమానాలు తెరపైకి వస్తున్నాయి.

AP Volunteer కేబినేట్ మీటింగ్ త‌ర్వాత వాలంటీర్ల గుండెల్లో గుబులు వారి ప‌ని ఖ‌త‌మైన‌ట్టేనా

AP Volunteer : కేబినేట్ మీటింగ్ త‌ర్వాత వాలంటీర్ల గుండెల్లో గుబులు.. వారి ప‌ని ఖ‌త‌మైన‌ట్టేనా?

రాష్ట్రంలో గత ప్రభుత్వం నియమించిన వాలంటీర్లలో దాదాపు 60 వేల మందికి పైగా ఎన్నికల నోటిఫికేషన్ తర్వాత రాజీనామాలు చేసి అధికార వైసీపీకి మద్దతుగా ప్రచారంలోకి వచ్చేశారు. వైసీపీ నేతల ఒత్తిడితోనే ఆ రాజీనామాలు చేశామని ఇప్పుడు వారు చెప్తున్నారు. గతంలో ఎన్నికల పోలింగ్ సమయానికి దాదాపు లక్ష మంది వాలంటీర్లు ఇలా రాజీనామాలు చేశారు. దీంతో వాలంటీర్ల మూకుమ్మడి రాజీనామాలు ఆమోదించవద్దంటూ హైకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. దీనిపై అప్పట్లో విచారణ జరిపిన హైకోర్టు.. ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. మరోవైపు చంద్రబాబు వెన్నుపోటు రాజకీయాలకు ఏపీ మొట్టమొదట బలైంది వాలంటీర్లేనంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి కారుమూరు వెంకటరెడ్డి విమర్శించారు.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది