Ys jagan : అందరూ NO NO లు చెప్తుంటే గవర్నర్ వైఎస్ జగన్ కి గుడ్ న్యూస్ చెప్పాడు
Ys jagan వైఎస్ జగన్ : ఏపీలో రిపబ్లిక్ వేడుకలు వైభవంగా జరిగాయి. పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహించారు. విజయవాడ ఇందిరా గాంధీ స్టేడియోంలో జరిగిన రిపబ్లిక్ వేడుకల్లో సీఎం వైఎస్ జగన్ మరియు గవర్నర్ లతో పాటు ఎస్‌ఈసీ మరియు మంత్రులు ఎమ్మెల్యేలు పోలీసు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్బంగా పోలీసుల గౌరవ వందనంను స్వీకరించిన గవర్నర్ ఆ తర్వాత ప్రజలను ఉద్దేశించి మాట్లాడటం జరిగింది. ఈమద్య కాలంలో జగన్ ఎక్కడకు వెళ్లినా ఎవరు మాట్లాడినా విమర్శలే గుప్పిస్తున్నారు. బీజేపీ మరియు టీడీపీ నాయకులతో పాటు సొంత పార్టీ నాయకులు కూడా కొందరు విమర్శలు గుప్పిస్తున్నారు. ఇలాంటి సమయంలో గవర్నర్ మాట్లాడుతూ జగన్ పై ప్రశంసలు కురిపించడం ప్రస్తుతం హాట్ టాపిక్ అయ్యింది.
దేవాలయాలపై దాడిలో వైఎస్ జగన్‌కు క్లీక్ చీట్.. : Ys jagan
టీడీపీతో పాటు బీజేపీలు గత కొంత కాలంగా జరుగుతున్న దేవాలయ దాడులకు వైకాపా కారణం అంటూ ఆరోపిస్తున్న విషయం తెల్సిందే. ఈ నేపథ్యంలో వైకాపా ఒకాకొన సమయంలో ఢీలా పడిపోయింది. జనాలు అంతా కూడా వైకాపా పైనే అనుమానాలు వ్యక్తం చేయడం జరిగింది. దాంతో ఆ చెడ్డ పేరును తూడ్చి వేసేందుకు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీవ్రంగా ప్రయత్నాలు చేశాడు. తాజాగా గవర్నర్ భూషన్ కూడా ఆ విషయంలో జగన్ కు క్లీన్ చీట్ ఇచ్చాడు. కొందరు మతం పేరు చెప్పి ప్రజలను రెండు వర్గాలుగా విభజించేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రభుత్వం దాన్ని సమర్థవంతంగా తిప్పి కొట్టిందని ఈ సందర్బంగా గవర్నర్ అన్నారు.
రాసిచ్చిన స్క్రిప్ట్ ను గవర్నర్ చదివారు.. : Ys jagan
ఏపీలో వైఎస్ జగన్ పాలన ఆహా ఓహో అంటూ రిపబ్లిక్ డే సందర్బంగా బిశ్వ భూషన్ హరి చందన్ చేసిన ప్రసంగంపై తెలుగు దేశం పార్టీ నాయకులు పెదవి విరిచారు. ప్రభుత్వం రాసి ఇచ్చిన స్క్రిప్ట్ ను గవర్నర్ చదివారు అంటూ ఎద్దేవ చేశారు. ప్రభుత్వం తప్పు ఒప్పులను ఎత్తి చూపించాల్సిన గవర్నర్ ఇలా ఆయనకు జై కోట్టడం ఏంటీ అంటూ టీడీపీ విమర్శలు చేస్తున్నాడు. రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నో సమస్యలు ఉన్నాయి. వాటిలో ఏ ఒక్కటి కూడా గవర్నర్ దృష్టికి రాకపోవడం దురదృష్టకరం అంటూ తెలుగు తమ్ముళ్లు ఆరోపిస్తున్నారు. రిపబ్లిక్ డే సందర్బంగా ఏ ప్రభుత్వం అయినా తమకు అనుకూలంగా గవర్నర్ తో మాట్లాడించడం పరిపాటే.