Flood Victims : వరద బాధితులకు సర్కారు రూ.10 వేలు సాయం
Flood Victims : బంగాళాఖాతంలో అల్ప పీడనం వల్ల తెలుగు రాష్ట్రాల్లో కుండపోత వర్షం కురిసింది. కాస్త నిన్న, ఇవాళ వర్షం గ్యాప్ ఇచ్చింది కానీ.. మొన్నటి వరకు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ చూసినా కుండపోత వర్షం కురిసింది. తెలంగాణ, ఏపీ రెండు రాష్ట్రాల్లో వర్షాల బీభత్సానికి రోడ్లన్నీ చెరువులుగా మారాయి. పంట పొలాలు నాశనం అయ్యాయి. లోతట్టు ప్రాంతాల ప్రజలు చాలా ఇబ్బందులు పడ్డాయి. కొన్ని ఊళ్లే మునిగిపోయాయి. చెరువులు, ప్రాజెక్టులు, వాగులు, వంకలు అన్నీ నిండిపోయాయి. భారీ వరదల వల్ల కొన్ని ప్రధాన రహదారులు కూడా కొట్టుకుపోయాయి. దీంతో ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోయాయి.
వరద ప్రభావిత ప్రాంతాల్లో ఏపీ ప్రభుత్వం కూడా సహాయక చర్యలను ప్రారంభించింది. సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. వెంటనే పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేయాలని వరద బాధితులకు అన్ని సౌకర్యాలు కల్పించాలని సీఎం జగన్ అధికారులకు ఆదేశించారు. హైవేలపై నీళ్లు నిలిచిపోవడం, ఎక్కడ చూసినా నీళ్లే ఉండటంతో సహాయక చర్యలకు కూడా ఇబ్బందులు కలిగాయి. చాలామంది వరద ఉద్ధృతికి కొట్టుకుపోయారు.ఏపీలో వరద ప్రవాహం తగ్గుముఖం పడుతోంది. సహాయక చర్యలు కూడా ముమ్మరం అయ్యాయి. శిబిరాల్లో తలదాచుకునే బాధితుల్లో ప్రతి కుటుంబానికి రూ.2000 చొప్పున ఇచ్చేలా ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఒక వ్యక్తికి రూ.1000 చొప్పున ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది.
Flood Victims : వరద బాధితులకు సాయం ప్రకటించిన ఏపీ ప్రభుత్వం
అలాగే.. వర్షాలకు దెబ్బతిన్న ఇండ్లకు రూ.10 వేలు నష్టపరిహారం అందించాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. ఆ డబ్బుతో ఇండ్లకు మరమ్మతులు చేయించుకోవాలని సీఎం తెలిపారు. 10 వేల నష్టపరిహారంతో పాటు బాధిత కుటుంబానికి 25 కిలోల బియ్యం, కేజీ ఉల్లిగడ్డలు, కిలో ఆలుగడ్డలు, ఒక కిలో పామాయిల్ ప్యాకెట్ ను ప్రభుత్వం అందించనుంది. దీంతో వరద బాధితులు ఏపీ సీఎం జగన్ కు, ఏపీ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు.