Ap Inter Results : ఏపీ ఇంటర్ విద్యార్థులకు అలెర్ట్…. ఈనెల 15న ఫలితాలు…!
ప్రధానాంశాలు:
Ap Inter Results : ఏపీ ఇంటర్ విద్యార్థులకు అలెర్ట్....ఈనెల 15న ఫలితాలు...!
Ap Inter Results : ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాలలో ఎన్నికల కోడ్ అమలులో ఉండడం వలన విద్యార్థుల పరీక్ష ఫలితాలపై సందిగ్ధత నెలకొంది. ఎన్నికల కోడ్ అమలులో ఉండటం వలన ఫలితాల విడుదలకు ఎలక్షన్ కమిషన్ ఆమోదం తప్పనిసరిగా ఉండాలి. ఈ నేపథ్యంలోనే ఫలితాలను విడుదల చేసేందుకు విద్యాశాఖ అనుమతి కోరగా దానిని ఎన్నికల సంఘం కూడా మంజూరు చేస్తుందనే భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్ ఇంటర్ విద్యార్థుల పరీక్ష ఫలితాలు ఏప్రిల్ 15న విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. రాబోయే అసెంబ్లీ ఎన్నికలు మరియు లోక్ సభ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని విద్యార్థులకు భరోసా కల్పించే దిశగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. కావున ఎన్నికల ప్రభావం పరీక్షా ఫలితాలపై ఉండదు కాబోలు…
Ap Inter Results : విడుదల ప్రక్రియ..
అయితే గతంలో పరీక్ష ఫలితాలు విడుదల ప్రక్రియలలో రాజకీయ నాయకులు ఖచ్చితంగా పాల్గొనేవారు. కానీ ఈసారి ఫలితాలను ఇంటర్ బోర్డు అధికారులు మాత్రమే వేళాడించనున్నట్లు తెలుస్తోంది. గత సంవత్సరం ఏపీ ఇంటర్ పరీక్ష ఫలితాలు ఏప్రిల్ 26న అలాగే 10వ తరగతి ఫలితాలను మే 6న విడుదల చేశారు. ఈ నేపథ్యంలోనే ఈసారి ఇంటర్ ఫలితాలను ఏప్రిల్ 15న విడుదల చేయనున్నట్లు సమాచారం. అయితే ఇప్పటికే ఇంటర్ ఒకటవ సంవత్సరం మరియు రెండవ సంవత్సరం పరీక్షలకు సంబంధించి జవాబు పత్రాల మూల్యాంకనం పూర్తయింది. దీనికోసం ఇంటర్ బోర్డు దాదాపు 23,000 మంది ఉపాధ్యాయులను వినియోగించుకున్నారు.
Ap Inter Results : ఫలితాలు ఎలా చూసుకోవాలి…
ఫలితాలు విడుదల చేసిన తర్వాత ఏపీ ఇంటర్ విద్యార్థులు bike.ap.gov.in అధికారిక వెబ్ సైట్ లో మీ యొక్క ఫలితాలను తనిఖీ చేసుకోవచ్చు. ఫలితాలను చూసుకోవడానికి మీ హాల్ టికెట్ నెంబర్ మరియు పుట్టిన తేదీ తప్పనిసరిగా అవసరం అవుతుంది.

Ap Inter Results : ఏపీ ఇంటర్ విద్యార్థులకు అలెర్ట్….ఈనెల 15న ఫలితాలు…!
Ap Inter Results : 10వ తరగతి ఫలితాలు…
ఆంధ్రప్రదేశ్ లో SSC పరీక్షలకు దాదాపు 63,0633 మంది విద్యార్థులు హాజరవ్వగా , ప్రస్తుతం జవాబు పత్రాల మూల్యాంకనం జరుగుతుంది. ఇక ఈ మూల్యాంకనం ప్రక్రియ ముగిసిన తర్వాత 10వ తరగతి ఫలితాలను ఏప్రిల్ చివరి వారంలో లేదా మే మొదటి వారంలో విడుదల చేసే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. ఇక ఈ 10వ తరగతి ఫలితాలను తెలుసుకోవడానికి విద్యార్థులు ఏపీ బోర్డ్ వెబ్ సైట్ https://www.bse.ap.gov.in/ లో తనిఖీ చేసుకోవచ్చు.