AP Inter Results : ఏపీ ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాలు విడుదల..!
ప్రధానాంశాలు:
AP Inter Results : ఏపీ ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాలు విడుదల..!
AP Inter Results : ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల ఫలితాలు andhra pradesh intermediate results 2025 శనివారం విడుదలయ్యాయి. ఈ ఫలితాలను రాష్ట్ర ఐటీ మరియు విద్య శాఖల మంత్రి నారా లోకేష్ విడుదల చేశారు. ఉదయం 11 గంటలకు ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ ఫలితాలు అధికారికంగా ప్రకటించబడ్డాయి. విద్యార్థులు resultsbie.ap.gov.in అనే వెబ్‌సైట్ ద్వారా ఫలితాలను తెలుసుకోవచ్చు. అలాగే మనమిత్ర వాట్సాప్ నంబర్ 9552300009 కు ‘hi’ అని మెసేజ్ చేయడం ద్వారా కూడా ఫలితాలు తెలుసుకోవచ్చు. ఫోన్‌లోనే కేవలం రెండు నిమిషాల్లో ఫలితాలు చూసుకునే అవకాశం ఉందని మంత్రి తెలిపారు.

AP Inter Results : ఏపీ ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాలు విడుదల..!
నారా లోకేష్ చేతులమీదుగ AP Inter Results 2025
ఈసారి ఫలితాల విడుదల విధానం ఓ కొత్త ప్రయోగంగా మారింది. సాధారణంగా గతంలో మీడియా సమావేశం ద్వారా ఫలితాలు ప్రకటిస్తూ, ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ విధానాల్లో వాటిని అందుబాటులో ఉంచేవారు. కానీ ఈసారి ప్రభుత్వం వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా ఫలితాలను అందించడంలో ముందడుగు వేసింది. మనమిత్ర అనే చాట్‌బాట్‌ను ఉపయోగించి విద్యార్థులు ఫలితాలను చాలా వేగంగా తెలుసుకునే విధంగా ఏర్పాట్లు చేశారు. హాల్ టికెట్ నంబర్ మరియు పుట్టిన తేది తెలియజేస్తే చాలు, ఫలితాలు క్షణాల్లో తేలుతాయి.
విద్యార్థులకు బెస్ట్ విషెస్ చెబుతూ.. ఫలితాలే వారి భవిష్యత్తుకు మార్గదర్శకమవుతాయని మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. విద్యార్థుల కోసం ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ సాంకేతిక ఆధారిత విధానం ఎంతో ప్రాముఖ్యతను సంతరించుకుంది. యువతకు మరింత చేరువగా ఉండేందుకు, సాంకేతికతను వినియోగించేందుకు ఇది మంచి ప్రారంభంగా మారింది. ఫలితాల్లో విజయవంతమైన విద్యార్థులకు అభినందనలు తెలుపుతూ, భవిష్యత్తులో మరిన్ని విజయాలను సాధించాలని ఆశించారు.ఇక ఫలితాల్లో ఫస్ట్ ఇయర్ లో 70%, సెకండియర్లో 83% మంది విద్యార్థులు పాసైనట్లు మంత్రి లోకేశ్ వెల్లడించారు. 2014 నుంచి ఇదే అత్యధిక పాస్ పర్సెంటేజ్ అని తెలిపారు. GOVT జూనియర్ కాలేజీల్లో సెకండియర్లో 69 శాతం మంది ఉత్తీర్ణత సాధించడం పదేళ్లలో అత్యధికమన్నారు. ఫస్టియర్లోనూ 47 శాతం మంది పాసయ్యారని, ఇది దశాబ్దంలో రెండో అత్యధికమని తెలిపారు.