Roja – Chandrababu : ఈసారి వాళ్లను కూడా జైలులో పెట్టిస్తా.. దమ్ముంటే ఆపుకో బాబు.. మంత్రి రోజా సవాల్ | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Roja – Chandrababu : ఈసారి వాళ్లను కూడా జైలులో పెట్టిస్తా.. దమ్ముంటే ఆపుకో బాబు.. మంత్రి రోజా సవాల్

 Authored By kranthi | The Telugu News | Updated on :23 November 2023,5:00 pm

ప్రధానాంశాలు:

  •  రోజాపై అసభ్యకర వ్యాఖ్యలు చేసిన బండారును కోర్టుకు లాగిన రోజా

  •  భానుప్రకాష్ పైనా కేసు

  •  వాళ్లను ఎవ్వరినీ వదలను అన్న రోజా

Roja – Chandrababu : ఏపీ మంత్రి రోజా గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఆమెను వైసీపీ ఫైర్ బ్రాండ్ అంటారు. దానికి కారణం.. ఆమె మాట్లాడే తీరు. ఏపీ సీఎం వైఎస్ జగన్ ను ఎవరైనా ఏమైనా అంటే చాలు.. ఇక మామూలుగా ఉండదు. రెచ్చిపోతారు రోజా. ఎదుటి వాళ్లు ఎంతటి వాళ్లు అయినా సరే ఏమాత్రం భయపడరు రోజా. అందుకే తనను ఫైర్ బ్రాండ్ అంటారు. తాజాగా మంత్రి రోజా.. బండారు సత్యనారాయణపై మండిపడ్డారు. ఆయన తనపై చేసిన వ్యాఖ్యలపై మరోసారి స్పందించారు రోజా. తన పరువుకు భంగం కలిగేలా ప్రవర్తించినందుకు ఆయనపై కోర్టులో డిఫమేషన్ సూట్ వేశారు రోజా.

అనంతరం మీడియాతో రోజా మాట్లాడుతూ.. మహిళ అంటే ఏదైనా అనొచ్చు అనుకునే మగవాడికి బుద్ధి చెప్పాలి. ఒక ఫేమస్ నటిని, ఫ్యామిలీ మహిళను ఈరోజు ఎదుర్కోలేక పిచ్చిపిచ్చిగా వాగుతున్న బండారు కానీ, భానుప్రకాష్ కానీ.. టీవీ5 రాజేందర్ కానీ ఎవ్వరైనా సరే వాళ్లను వదలను అని చెప్పాను. అదే విధంగా ఈరోజు నగరి కోర్టులో వాళ్ల మీద కేసు పెట్టడం జరిగిందన్నారు. క్రిమినల్ మోటివ్ తో నేను నా కుటుంబం సొసైటీలో తలెత్తుకొని తిరగకుండా సూసైడ్ చేసుకోవాలి.. లేదా మేము కనిపించకుండా పోవాలి అనే ఒక మోటివ్ తో ఒక ప్లాన్ గా ప్రెస్ మీట్లు పెట్టి నా క్యారెక్టర్ ను అసాసినేట్ చేసి నా గౌరవాన్ని భంగం కలిగించే విధంగా, నేను సొసైటీలో తిరగలేకుండా వాళ్లు మాట్లాడే మాటలు చాలా బాధాకరం. వీటిని ఎలాగైనా అరికట్టాలన్నారు.

Roja – Chandrababu : నాలాంటి వాళ్లకే ఇలా జరిగితే.. మామూలు మహిళలు ఇంకెంత భయపడాలి

నాలాంటి వాళ్లకే ఇలా జరిగితే.. మామూలు మహిళ ఎంత భయపడిపోతుంది. బెంబేలెత్తుతుంది. బయటికి రాకుండా ఏవిధంగా మహిళా సాధికారతకు భంగం కలుగుతుందో అర్థం చేసుకున్నాను కాబట్టే ఈరోజు నేను ఖచ్చితంగా న్యాయాన్ని నమ్ముతాను కాబట్టి న్యాయ పరంగా వాళ్ల మీద చర్యలు చేపట్టాను. ఖచ్చితంగా కోర్టు విచారణ జరిపి వారికి శిక్ష వేస్తుందని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను అని మంత్రి రోజా ఆశాభావం వ్యక్తం చేశారు.

Advertisement
WhatsApp Group Join Now

kranthi

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది