AP Govt Good News : వాళ్లకు గుడ్ న్యూస్.. అకౌంట్లలో రూ.15 వేలు పడుతున్నాయి.. వెంటనే మీ బ్యాంక్ ఖాతా చెక్ చేసుకోండి..!
AP Govt Good News : ఏపీ ప్రభుత్వం బడుగు, బలహీన వర్గాల కోసం ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టింది. పేద ప్రజల కోసం తీసుకొచ్చిన చాలా సంక్షేమ పథకాలను చూసి దేశమే మెచ్చుకుంటోంది. బడుగు, బలహీన వర్గాలను ఆదుకునేందుకు సీఎం జగన్ తన శాయశక్తులా ప్రయత్నిస్తున్నారు. అందుకే.. దేశంలోనే ఎక్కడా లేని విధంగా అన్ని వర్గాల సంక్షేమం కోసం సీఎం జగన్ పథకాలను తీసుకొస్తున్నారు. మహిళల కోసం, రైతుల కోసం, బడుగు, బలహీన వర్గాల కోసమే కాదు.. విద్యార్థుల కోసం కూడా పలు పథకాలను తీసుకొచ్చారు సీఎం జగన్.
ఇటీవలే విద్యార్థుల కోసం జగనన్న అమ్మ ఒడి పథకాన్ని సీఎం జగన్ ప్రవేశపెట్టారు. అది తెల్ల రేషన్ కార్డు ఉన్న విద్యార్థుల కోసం. ప్రభుత్వ, ప్రైవేటు స్కూళ్లలో చదివే విద్యార్థుల కోసం ఈ పథకాన్ని తీసుకొచ్చారు. తాజాగా విద్యార్థులకు గుడ్ న్యూస్ చెప్పింది ఏపీ ప్రభుత్వం. జగనన్న అమ్మ ఒడి పథకానికి సంబంధించిన నిధులను విడుదల చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ పథకం నిధులను ఈనెల 28నే విద్యార్థుల తల్లుల బ్యాంక్ ఖాతాల్లోకి పంపిణీ చేయనున్నారు.ఏపీలో ఒకటో తరగతి నుంచి ఇంటర్ వరకు చదివే విద్యార్థుల తల్లుల అకౌంట్లలో నగదు జమ చేయనున్నారు. తెల్ల రేషన్ కార్డు ఉండి, ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో చదివే విద్యార్థులు, కుటుంబ ఆదాయం పట్టణాల్లో అయితే నెలకు రూ.12 వేలు, గ్రామీణ ప్రాంతాల్లో అయితే రూ.10 వేలలోపు సంపాదించే వాళ్లకే ఈ పథకం వర్తిస్తుంది.
AP Govt Good News : ఒకటో తరగతి నుంచి ఇంటర్ చదివే విద్యార్థుల తల్లుల ఖాతాల్లో డబ్బులు జమ
అలాగే.. విద్యార్థులకు పాఠశాలల్లో 75 శాతం హాజరు ఉండాలి. నెలకు 300 లోపు యూనిట్ల కరెంట్ బిల్ కాల్చేవాళ్లు, టాక్సీ, ట్రాక్టర్, ఆటో కాకుండా వేరే నాలుగు చక్రాల బండి ఉంటే వాళ్లకు ఈ పథకం వర్తించదు. ఈ పథకం కింద విద్యార్థుల తల్లి ఖాతాలో రూ.15 వేలు జమ అవుతాయి. అంటే.. అందులో రెండు వేలు పాఠశాల మౌలిక వసతులు, మరుగు దొడ్ల నిర్వహణ కోసం కట్ చేసుకొని ఖాతాలో రూ.13 వేలు జమ చేస్తారు.