Atchannaidu : చంద్రబాబు అరెస్ట్.. జూనియర్ ఎన్టీఆర్ మౌనం? అచ్చెన్నాయుడు షాకింగ్ రియాక్షన్?

Advertisement

Atchannaidu : ప్రస్తుతం ఏపీలో ఎక్కడ చూసినా చంద్రబాబు అరెస్ట్ గురించే చర్చ నడుస్తోంది. చంద్రబాబు అరెస్ట్ అనేది పక్కన పెడితే జూనియర్ ఎన్టీఆర్ సైలెంట్ మోడ్ లోకి వెళ్లారు. కేవలం పవన్ కళ్యాణ్ మాత్రమే నోరు మెదిపారు. పవన్ కళ్యాణ్ కూడా ఒక రాజకీయ వేత్తగా రెస్పాండ్ అయ్యారు. బాలకృష్ణ ఎలాగూ ఆయన వియ్యంకుడు. ఇక మిగిలిన వాళ్ల పరిస్థితి ఏంటి? చంద్రబాబు అరెస్ట్ పై టాలీవుడ్ ఎందుకు కనీసం రెస్పాండ్ కాలేదు అంటూ ప్రస్తుతం టాలీవుడ్ హీరోలపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

Advertisement
atchannaidu shocking reaction on chandrababu arrest
cbn

ఏ స్టార్ హీరో కూడా నోరు తెరవలేదు. ఖండించలేదు. చివరకు జూనియర్ ఎన్టీఆర్ కూడా మాట కూడా మాట్లాడలేదు. జూనియర్ ఎన్టీఆర్ ఎందుకు మౌనంగా ఉన్నారు అంటే దానికి సమాధానం ఎవరు చెప్పాలి? బాలకృష్ణ చెబుతారా? చంద్రబాబు చెబుతారా? అనేది పక్కన పెడితే ప్రస్తుతం అచ్చెన్నాయుడు చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Advertisement

Atchannaidu : ఆయన ఎందుకు స్పందించలేదో ఆయన్నే అడగాలి

జూనియర్ ఎన్టీఆర్ ఎందుకు స్పందించలేదో ఆయన్నే అడగాలి.. అంటూ చంద్రబాబు అరెస్ట్ పై అచ్చెన్నాయుడు మీడియా అడిగిన ప్రశ్నకు సమాధానంగా చెప్పుకొచ్చారు. జూనియర్ ఎన్టీఆర్ మౌనంపై తాము ఎలా చెబుతాం. మేము ఎవ్వరినీ స్పందించాలని కోరడం లేదు. స్వచ్ఛందంగా చంద్రబాబు అరెస్ట్ పై స్పందిస్తూ నిరసనలు తెలుపుతున్నారు. వారెవరినీ తాము స్పందించమని కోరలేదు అని అచ్చెన్నాయుడు వెల్లడించారు. స్పందించడం, స్పందించకపోవడం వాళ్ల ఇష్టం అన్నారు. చంద్రబాబు అరెస్ట్ అయి ఇన్ని రోజులు అయినా జూనియర్ ఎన్టీఆర్ స్పందించకపోవడం చర్చనీయాంశంగా మారింది. పలు భిన్నాభిప్రాయ అనుమానాలకు ఆయన మౌనం తెరలేపుతోంది.

Advertisement
Advertisement