YS Jagan Mohan Reddy : జగన్ ను కేసీఆర్ తూ అని అంటున్నాడు.. నువ్వు సీఎంగా ఉండి ఏంటి లాభం.. బాలకృష్ణ ఫైర్
ప్రధానాంశాలు:
కేసీఆర్ కూడా ఏపీ పరువు తీశారు
నువ్వు సీఎంగా ఉండి ఏంటి ఉపయోగం జగన్
జగన్ పై బాలకృష్ణ ఫైర్
YS Jagan Mohan Reddy : ఏపీలో ప్రస్తుతం ఎలాంటి పరిస్థితులు నెలకొన్నాయో అందరికీ తెలిసిందే. ఏపీలో టీడీపీ అధినేత చంద్రబాబును అరెస్ట్ చేయడం, ఆ తర్వాత మళ్లీ మధ్యంతర బెయిల్ ఇవ్వడం, కావాలని వైసీపీ ప్రభుత్వం, సీఎం జగన్ చంద్రబాబుపై కక్ష కట్టి మరీ జైలుకు పంపించారని అంటున్నారు. ప్రస్తుతం చంద్రబాబు ఆరోగ్యం కూడా బాగోలేదు. మరోవైపు వచ్చే ఎన్నికల్లో చంద్రబాబుతో కలిసి జనసేన పార్టీ పని చేయబోతోంది. జనసేన, టీడీపీ రెండు పార్టీలు కలిసి ఏపీలో పనిచేయబోతున్న నేపథ్యంలో టీడీపీ, జనసేన నేతలు కలిసి మరీ రెండు పార్టీల కార్యాచరణ ప్రకటిస్తున్నారు. తాజాగా హిందూపురంలో నిర్వహించిన టీడీపీ కార్యక్రమంలో బాలకృష్ణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన టీడీపీతో పాటు జనసేన కండువా కూడా కప్పుకున్నారు. ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ.. ప్రస్తుతం రాష్ట్రం దారుణ పరిస్థితుల్లో ఉందన్నారు. ఇప్పుడు ఆరోగ్యశ్రీ కూడా వర్తించడం లేదు. ఎంతో మంది వైద్యం అందక ప్రాణాలు కోల్పోతున్నారు. అలాంటి దౌర్బాగ్య పరిస్థితుల్లో ఉంది అని బాలకృష్ణ అన్నారు.
ఇటీవల తెలంగాణ సీఎం కేసీఆర్ గారు ఒక మాట అన్నారు. ఎక్కడైనా డబుల్ లైన్ రోడ్లు చూస్తే అది తెలంగాణ, సింగిల్ లైన్ రోడ్లు చూస్తే అది ఆంధ్రా అని అన్నారు. అలా ఉంది ఇవాళ మన రాష్ట్ర పరిస్థితి. ఎటువంటి మేధావులు.. ఎలాంటి పరిస్థితి ఉంది ఇప్పుడు. ప్రత్యక్షంగా మన కళ్ల ముందు జరిగినవి చూసుకున్నా కూడా అప్పుడు ఎలా ఉండేది ఇప్పుడు ఎలా ఉంది. మనం చూసింది.. మనకు ఊహ తెలిసిన తర్వాత రామారావు గారు పార్టీ పెట్టడం.. రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడం చూశాం. కానీ.. ఇప్పుడు రాష్ట్రాన్ని జగన్ ఎలాంటి పరిస్థితుల్లోకి తీసుకెళ్లారు అంటూ బాలకృష్ణ ఫైర్ అయ్యారు.
YS Jagan Mohan Reddy : ప్రపంచంలోనే ఏపీకి గుర్తింపు తీసుకొచ్చారు రామారావు గారు
ఎన్టీఆర్ గారు ప్రపంచంలోనే ఏపీకి గుర్తింపు తీసుకొచ్చారు. అభినవ భగీరథుడిగా ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు తీసుకొచ్చారు. వెనుకబడిన తరగతుల వారికోసం, మైనార్టీల వారి కోసం ఎన్నో విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చారు. అసలు సంక్షేమ పథకాలనే స్టార్ట్ చేసింది సీనియర్ ఎన్టీఆర్ గారు. ఇవాళ్టికీ ఆ పథకాలనే ఏ పార్టీ అయినా చెప్పుకొని బతికి బట్టకట్టాల్సిందే అంటూ బాలకృష్ణ స్పష్టం చేశారు.