Brahmamudi Feb 24th 2026 Episode : చావు అంచుల్లో రాజ్ కుటుంబం.. దారి మధ్యలో వ్యాన్ దిగిన కావ్య, అప్పు

 Authored By jagadesh | The Telugu News | Updated on :24 February 2026,9:04 am

Brahmamudi Feb 24th 2026 Episode : స్టార్ మా ఛానెల్‌లో అత్యధిక టీఆర్పీ రేటింగ్‌తో దూసుకుపోతున్న ‘బ్రహ్మముడి’ Brahmamudi సీరియల్ ఉత్కంఠభరితమైన మలుపులతో ప్రేక్షకులను మునివేళ్లపై నిలబెడుతోంది. దుగ్గిరాల కుటుంబాన్ని నాశనం చేయడానికి రుద్రాణి, రాహుల్, రేఖలు పన్నిన మహా కుట్ర ఈరోజు ఫిబ్రవరి 24 ఎపిసోడ్‌లో తారాస్థాయికి చేరుకుంది. ఏకంగా కుటుంబం మొత్తం ప్రయాణిస్తున్న వ్యాన్‌కు బాంబ్ పెట్టి ప్రాణాలు తీయాలని నిర్ణయించుకున్నారు. శ్రీశైలం ట్రిప్, నామకరణం, బాంబ్ బ్లాస్ట్ టెన్షన్.. ఇలా ఎన్నో ఊహించని ట్విస్టులతో సాగిన ఈ ఎపిసోడ్ పూర్తి వివరాలు ఇక్కడ చూద్దాం.

Brahmamudi Feb 24th 2026 Episode : చావు అంచుల్లో రాజ్ కుటుంబం.. దారి మధ్యలో వ్యాన్ దిగిన కావ్య, అప్పు

Brahmamudi Feb 24th 2026 Episode : చావు అంచుల్లో రాజ్ కుటుంబం.. దారి మధ్యలో వ్యాన్ దిగిన కావ్య, అప్పు

Brahmamudi Feb 24th 2026 Episode వ్యాన్‌కు బాంబ్ ఫిక్స్ చేసిన రౌడీ

దుగ్గిరాల కుటుంబం అంతా కలిసి శ్రీశైలం వెళ్లేందుకు రెడీ అవుతారు. దీని కోసం ఒక పెద్ద వ్యాన్ వస్తుంది. ఈ అవకాశాన్ని వాడుకుని ఆ కుటుంబాన్ని మొత్తం మట్టుబెట్టాలని రుద్రాణి ప్లాన్ వేస్తుంది. వ్యాన్ డ్రైవర్ సూరిని భోజనం చేసి రమ్మని రాహుల్ అక్కడి నుంచి పంపించేస్తాడు. వెంటనే ఈ విషయాన్ని రుద్రాణికి ఫోన్ చేసి చెబుతాడు. అప్పటికే రుద్రాణి పంపిన రౌడీ అక్కడికి వచ్చి వ్యాన్ కింద బాంబ్ ఫిక్స్ చేస్తుంటాడు. ఈ టైమ్ లో ఎక్కడ తమ ప్లాన్ ఫ్లాప్ అవుతుందోనని రాహుల్, రేఖలు టెన్షన్ పడుతుంటారు. సరిగ్గా అదే సమయానికి స్వప్న తన పాపతో అక్కడికి రావడంతో రాహుల్ గుండె ఆగినంత పని అవుతుంది.

Brahmamudi Feb 24th 2026 Episode స్వప్నను డైవర్ట్ చేసిన రాహుల్

వ్యాన్ దగ్గర టెన్షన్ పడుతున్న రాహుల్‌ను చూసి ఏమైందని స్వప్న అడుగుతుంది. వ్యాన్ కండిషన్ ఎలా ఉందో చెక్ చేస్తున్నానని రాహుల్ కవర్ చేస్తాడు. “విజయవాడ ప్రాపర్టీ మేనేజర్ కాల్ చేశాడు, రేపే వెళ్లి మున్సిపాలిటీ వాళ్లతో ట్యాక్స్ ప్రాబ్లమ్ గురించి మాట్లాడాలి” అని స్వప్న చెబుతుంది. ఇదే అదనుగా భావించిన రాహుల్.. “అయితే మనం ఈ వ్యాన్‌లో కాకుండా, సెపరేట్ గా కారు తీసుకుని ముందు శ్రీశైలం వెళ్లి, దేవుడి దర్శనం చేసుకుని అటు నుంచి అటే విజయవాడ వెళ్లిపోదాం” అని స్వప్నను ఒప్పిస్తాడు. భార్యను, తన బిడ్డను ఆ మృత్యు వ్యాన్ ఎక్కకుండా రాహుల్ చాలా తెలివిగా కాపాడాడని రేఖ అతన్ని మెచ్చుకుంటుంది. సూర్యుడు అస్తమించేలోపు దుగ్గిరాల కుటుంబం అస్తమిస్తుందని రేఖ అంటుంది. రౌడీ బాంబ్ ఫిక్స్ చేసి, శ్రీశైలం ఘాట్ రోడ్ దగ్గరకు రాగానే పేలిపోయేలా టైమర్ సెట్ చేసి వెళ్ళిపోతాడు.

సందడిగా పాపల నామకరణం – స్వరాజ్ అల్లరి

ఒకవైపు చావు పొంచి ఉంటే.. ఇంట్లో మాత్రం కావ్య, అప్పుల బిడ్డల నామకరణం వేడుక సందడిగా జరుగుతుంది. కావ్య కూతురిని ఊయలలో వేసేందుకు అపర్ణ రాగా.. రేవతి కొడుకు స్వరాజ్ వచ్చి అడ్డుకుంటాడు. తన మరదలిని తానే ఊయలలో వేస్తానని అల్లరి చేస్తాడు. ఇందిరా దేవి తన పేరునే ఆ పాపకు పెట్టిందని తెలిసి స్వరాజ్ “ఛీ.. ఇంత పాత పేరా” అని కామెంట్ చేయడం నవ్వులు పూయిస్తుంది. చివరకు కావ్య కలుగజేసుకుని.. ఇందిరాదేవి పేరును ‘ఇందు’ అని షార్ట్ కట్ లో పిలుద్దామని అనడంతో అంతా ఒప్పుకుంటారు. అలాగే అప్పు కూతురుకు ‘నందన’ (నందు) అని పేరు ఖరారు చేస్తారు.

శ్రీశైలం ట్రిప్ షురూ.. దారి మధ్యలో దిగిన కావ్య

నామకరణం పూర్తయ్యాక 9 గంటల లోపు ఫారెస్ట్ చెక్ పోస్ట్ దాటాలని రాహుల్ కంగారు పెడతాడు. రాజ్, కావ్యలతో సహా కుటుంబం అంతా వ్యాన్ ఎక్కుతారు. రాహుల్, స్వప్న, రేఖలు మాత్రం సెపరేట్ కారులో బయలుదేరుతారు. ఈ విషయం రుద్రాణికి తెలుస్తుంది. తను ఘాట్ రోడ్ దగ్గర ఉన్న ఒక గెస్ట్ హౌస్ పైనుంచి దుగ్గిరాల కుటుంబం కాలి బూడిద అవ్వడం చూడటానికి ఎదురుచూస్తుంటానని రుద్రాణి విలనిజం పండిస్తుంది.

వ్యాన్‌లో బోర్ కొట్టకుండా ఉండేందుకు కపుల్స్ అందరూ పాటలు పాడుతూ, డ్యాన్స్ చేస్తూ ఎంజాయ్ చేస్తుంటారు. ప్రకాశం-ధాన్యం, కనకం-కృష్ణమూర్తి, అప్పు-కళ్యాణ్ ఇలా అందరూ ఉత్సాహంగా డ్యాన్స్ చేస్తారు. అంతా ఆనందంగా ఉన్న సమయంలో సడెన్ గా దారి మధ్యలో వ్యాన్ ఆపమంటుంది కావ్య. కావ్యతో పాటు అప్పు కూడా వ్యాన్ దిగి కిందకు వెళ్తుంది. వెనుకనే కారులో వస్తున్న రాహుల్, రేఖలు ఇది చూసి షాక్ అవుతారు. కాసేపటికి మళ్ళీ వాళ్ళు వ్యాన్ ఎక్కుతారు.

వ్యాన్‌కు అంటుకున్న మంటలు

వ్యాన్ శ్రీశైలం ఘాట్ రోడ్డుకు చేరుకోగానే.. దూరం నుంచి చూస్తున్న రుద్రాణి రిమోట్ నొక్కి బాంబ్ పేలుస్తుంది. వెంటనే వ్యాన్ కింద నుంచి మంటలు అంటుకుంటాయి. మంటల్లో చిక్కుకున్న దుగ్గిరాల కుటుంబం ఏమవుతుంది? కావ్య, రాజ్‌లు ఈ ప్రమాదం నుంచి కుటుంబాన్ని ఎలా కాపాడుకుంటారు? అనేది రేపటి ఎపిసోడ్ లో తేలనుంది.

Advertisement

jagadesh

Jagadish Gatla Sr Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 13 years. Worked in Eenadu, Namasthe Telangana, Dailyhunt as a telugu content writer. I wrote various articles on politics, interesting stories, local news, business, health, technology, entertainment etc. He is also expert in analysing news, proof reading. He is present content writer of thetelugunews.com website. Contact details: jagadish2039@gmail.com

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి