Balakrishna : మరోసారి అభిమానిని చాచి పెట్టి కొట్టిన బాలయ్య.. వైరల్ వీడియో
Balakrishna : నందమూరి బాలకృష్ణ ఎంత సౌమ్యుడో కోపం వస్తే అంత ఆవేశంతో ఊగిపోతారు అనే విషయం ప్రతి ఒక్కరికి తెల్సిందే. ఆయన గతంలో పలు సందర్బాల్లో తన చుట్టు ఉన్న వారిపై బూతులు పలకడం కొన్ని సార్లు చేతులు కూడా చేసుకోవడం మనం చూస్తూ ఉంటాం. ఆఫ్ ది రికార్డు కుప్పలు తెప్పలుగా ఉన్నా ఆన్ ది రికార్డ్ మాత్రం కొన్ని వీడియోలు నెట్టింట ఎప్పుడు వైరల్ అవుతూనే ఉంటాయి. ఆమద్య ఒక సినిమా షూటింగ్ సందర్బంగా తన అసిస్టెంట్ ను బూతులు తిట్టడంతో పాటు చేయి కూడా చేసుకున్నాడు. ఆ తర్వాత ఒకటి రెండు సార్లు తన అనుమతి లేకుండా ఫొటోలు వీడియోను తీసేందుకు ప్రయత్నించడంతో వైరల్ అయ్యాడు. బాలకృష్ణ మరోసారి తన అనుమతి లేకుండా ఫొటోలు వీడియో తీసినందుకు గాను తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు.
Balakrishna : పార్టీ కార్యకర్త ను పరామర్శించే సమయంలో…
బాలకృష్ణ హిందూపురంలో పర్యటిస్తున్నారు. తన నియోజక వర్గంలోని టీడీపీ కార్యకర్తలతో ఆయన సమావేశం అయ్యారు. ఆ సమయంలో ఒక కార్యకర్త ఇంటికి వెళ్లి అక్కడ పరామర్శిస్తున్న సమయంలో ఒక వ్యక్తి అనుమతి లేకుండా వీడియో తీయడం జరిగింది. వీడియో తీసిన సమయంలో బాలయ్య కు కోపం వచ్చింది. దాంతో వెంటనే అతడిపైకి దాడి చేసేందుకు ఆవేశంగా ముందుకు వెళ్లాడు. ఆ సమయంలో ఇతర నాయకులు మరియు కార్యకర్తలు అడ్డు చెప్పడంతో కాస్త ఆగాడు. వెంటనే అందులో ఉన్నదాన్ని మొత్తం డిలీట్ చేయమని చెప్పండి అంటూ ఊగి పోయాడు.

Balakrishna fire on fan Viral video
Balakrishna : కొట్టించుకున్నోడి సమాధానం..
బాలయ్య మళ్లీ అభిమాని ని కొట్టాడు అంటూ కొందరు ప్రచారం చేస్తున్న నేపథ్యంలో దెబ్బలు తిన్న ఆ అభిమాని వెంటనే స్పందించాడు. మెడలో తెలుగు దేశం పార్టీ టవల్ ను వేసుకుని మరీ నేను బాలయ్య అభిమానిని. ఆయన చేయి తగలడమే అదృష్టంగా భావిస్తున్నాను. నన్ను ఆయన కొట్టినందుకు నేనేం బాధ పడటం లేదు అంటూ క్లారిటీ ఇచ్చాడు. మొత్తానికి బాలయ్య హిందూ పురం పర్యటన రసాబాసగా మారడం జరిగింది. కొద్ది సమయం తర్వాత మళ్లీ బాలయ్య యథావిథిగా తన పర్యటను కొనసాగించాడు.
మరోసారి రెచ్చిపోయిన బాలయ్య#TDP నేత, హిందూపురం ఎమ్మెల్యే #NandamuriBalakrishna మరోసారి తన దురుసు ప్రవర్తనతో వార్తల్లో నిలిచారు. తన అనుమతి లేకుండా వీడియో తీసినందుకు టీడీపీ కార్యకర్తపై చేయి చేసుకున్నారు #YSRCP #Janasena #BJP @YSRCParty @JaiTDP @JanaSenaParty @YSRCPDMO @YSRCPUSA pic.twitter.com/j77qqSyZjP
— The Telugu News (@TheTeluguNews1) March 6, 2021