Balakrishna : రెయ్ కొడాలి నాని కొడకా.. గుడ్డలు ఊడదీసి గునపం దింపుతా.. బాలకృష్ణ సినిమా స్టైల్ వార్నింగ్ అదుర్స్ | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Balakrishna : రెయ్ కొడాలి నాని కొడకా.. గుడ్డలు ఊడదీసి గునపం దింపుతా.. బాలకృష్ణ సినిమా స్టైల్ వార్నింగ్ అదుర్స్

 Authored By kranthi | The Telugu News | Updated on :13 September 2023,3:25 pm

Balakrishna : ప్రస్తుతం ఏపీ, తెలంగాణలో ఒకటే అంశం చర్చనీయాంశంగా మారింది. అదే.. చంద్రబాబు అరెస్ట్. ఆయన్ను అరెస్ట్ చేయడానికి టీడీపీ నేతలు, శ్రేణులు, అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. చంద్రబాబును అక్రమంగా అరెస్ట్ చేశారని, అసలు ఏ కేసు మీద అరెస్ట్ చేశారో కూడా స్పష్టంగా చెప్పడం లేదని, ఎలాంటి ఆధారాలు లేకుండా కావాలని సీఎం జగన్ ఆడుతున్న నాటకం అంటూ టీడీపీ నేతలు చెప్పుకొస్తున్న విషయం తెలిసిందే. తాజాగా చంద్రబాబు అరెస్ట్ పై నందమూరి బాలకృష్ణ స్పందించారు.

ఇవాళ రాష్ట్రం కుంటుపడిపోయింది. ఇంత అప్పు ఎవరు తీర్చాలి. పోలవరం ఊసు లేదు. రాజధాని లేని దిక్కులేని పరిస్థితుల్లో ఉన్నాం. ట్యాక్సులు మాత్రం భారీగా కడుతున్నాం.. ఇదంతా జగన్నాటకం. జగన్ ఆడుతున్న నాటకం.. దీన్ని ఎలా ఎదుర్కోవాలి. ఎలాంటి ఆధారాలు లేని కేసులు పెట్టారు. ఇంకా చాలా కేసులు పెడతారు. అన్నింటికీ ప్రిపేర్ అవుతున్నాం. చట్టాలను కూడా అతిక్రమిస్తారా? ఎన్ని కేసులు పెట్టారు. 24 గంటలు ప్రజల గురించి ఆలోచించే వ్యక్తికి ఇలాంటి పరిస్థితిని తీసుకొచ్చారు. ప్రతి ఒక్క పౌరుడు కూడా మీ హక్కులను కాపాడుకోవాలి అంటే మీరు ఉద్యమించాల్సిన అవసరం ఉంది. ఆనాడు 84 లో రామారావును బర్తరఫ్ చేస్తే ఎలా బయటికి వచ్చారో ఇప్పుడు ప్రజలంతా ఉద్యమించాలి అని బాలకృష్ణ చెప్పుకొచ్చారు.

balakrishna mass warning to kodali nani

balakrishna mass warning to kodali nani

Balakrishna : మన పౌరుషం వీళ్లకు చూపించాల్సిందే

మన పౌరుషం ఏంటో వీళ్లకు చూపించాలి. మన హక్కుల కోసం మనం పోరాడి తీరాలి. పిచ్చికుక్కలు మొరుగుతుంటే పట్టించుకోం. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గురించి ఎంత చెప్పినా తక్కువే. ఆయన చేయని తప్పులు లేవు. ఆయన మీద ఎన్ని కేసులు ఉన్నాయి. ఎందుకు బెయిల్ తీసుకొని బయట తిరుగుతున్నాడు.. జగన్ ను ఉద్దేశిస్తూ బాలకృష్ణ సీరియస్ అయ్యారు. మీ రాష్ట్రాన్ని మీరు కాపాడుకోవాల్సిన బాధ్యత. వచ్చే తరాలను మనమే కాపాడుకోవాలి. ఇలాంటి వైసీపీ నేతలను బట్టలు ఊడదీసి రాష్ట్రం నుంచి బయటికి గెంటేయాలని బాలకృష్ణ ఫైర్ అయ్యారు.

kranthi

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది