Balakrishna : రోజాపై సెటైరికల్ కామెంట్స్ చేసిన బాలకృష్ణ…!
ప్రధానాంశాలు:
Balakrishna : రోజాపై సెటైరికల్ కామెంట్స్ చేసిన బాలకృష్ణ...!
టీడీపీ కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర ముగింపు సభ
Balakrishna : టీడీపీ కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర ముగింపుకు చేరిన సందర్భంగా విజయనగరంలో నవశకం పేరిట భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశారు. ఈ సభలో బాలకృష్ణ మాట్లాడుతూ .. నటులు కేవలం సినిమాలకే పరిమితం కాదని అన్నారు. పవన్ కళ్యాణ్ ను ఇప్పుడు ఎక్కువగా ప్రజల్లో సభల్లో చూస్తున్నాను. సినిమాలతో వచ్చిన ఆదరణ అభిమానాన్ని ప్రజల కు ఉపయోగపడేలా ఉండాలి. నటులుగానే కాదు సమాజంలో పౌరులుగా అది మా బాధ్యత అని అన్నారు. దీంతో అక్కడే ఉన్న పవన్ కళ్యాణ్ బాలకృష్ణ మాటలకు నవ్వుకున్నారు. ఇంకా బాలకృష్ణ మాట్లాడుతూ .. నవ శకం అంతం కాదు ఇది ఆరంభమని తేల్చి చెప్పారు. జగన్ ప్రభుత్వం పై పోరాటానికి సమయం లేదు. విజయమో వీర స్వర్గమో ఇక తెచ్చుకోవాల్సిందేనని బాలకృష్ణ స్పష్టం చేశారు. లోకేష్ యువగళం ప్రజాగణంగా కలం తొక్కిందని తెలిపారు. లోకేష్ పాదయాత్రకు అనేక అడ్డంకులు సృష్టించారని మండిపడ్డారు. వైసీపీ అక్రమాలకు ప్రజలు గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు. ప్రజా సమస్యలపై జనసేన అధినేత పోరాడుతున్నారని స్పష్టం చేశారు.
ఏపీని రాజధాని లేని రాష్ట్రంగా జగన్ మార్చారని పోలవరాన్ని పూర్తి చేయలేని చేతకాని ప్రభుత్వం వైయస్సార్సీపి ప్రభుత్వం అని బాలకృష్ణ అన్నారు. డ్రగ్స్ దందాలో మాత్రం రాష్ట్రాన్ని అగ్రస్థానంలో ఉంచారని విమర్శించారు. ల్యాండ్, స్యాండ్ స్కాములలో కోట్లు దోచుకుంటున్నారని ఆరోపించారు. అమరావతిని అభివృద్ధి చేయకుండా భూములు ఇచ్చిన రైతుల ఉద్యమాలను అణిచివేశారని, రాజధాని కోసం పోరాడుతున్న ప్రజలపై అక్రమ కేసులు పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వైఎస్ఆర్సిపి అరాచకాలు ఇలాగే కొనసాగితే ప్రపంచ పటంలో ఏపీ ఉండదన్నారు. రాష్ట్ర భవిష్యత్తు ప్రజల చేతుల్లోనే ఉంది అన్నారు. ఉచిత పథకాల మాయలో ప్రజలు పడవద్దని బాలకృష్ణ సూచించారు.
రాష్ట్ర భవిష్యత్తును సైకో జగన్ సర్వనాశనం చేశారని మండిపడ్డారు. రాష్ట్రంలో సామాజిక న్యాయం దొరకట్లేదని ప్రజలందరూ ఆత్మ పరిశీలన చేసుకోవాలని కోరారు. ఒక్క ఛాన్స్ పేరుతో వై.యస్.జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని నాశనం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. నూతిలో కప్పలా తాడేపల్లి ప్యాలెస్ తన సర్వస్వం అని జగన్ అనుకుంటున్నాడని అన్నారు. వైఎస్ఆర్ సీపీ అక్రమాలకు గుణపాఠం చెప్పేందుకు ప్రజలు సిద్ధమయ్యారని హెచ్చరించారు. ప్రజా సమస్యలపై పవన్ కళ్యాణ్ పోరాటం అభినందనీయమని బాలయ్య కొనియాడారు. పవన్ కళ్యాణ్ తాను ఇద్దరం ముక్కుసూటి మనుషులమే ఇకపై ఉద్యమం చేస్తామని బాలకృష్ణ వెల్లడించారు. ప్రభుత్వానికి ఇంకా కొన్ని రోజులే ఉందని ప్రజలు సైకో జగన్ కు తగిన బుద్ధి చెబుతారని బాలకృష్ణ అన్నారు.