Balineni Srinivas Reddy : దారి తప్పుతున్న బాలినేని.. జగన్ పైనే విమర్శలు ఎందుకు? అసలు ఒంగోలులో ఏం జరుగుతోంది?
ప్రధానాంశాలు:
బాలినేని శ్రీనివాస్ రెడ్డికి ఏమైంది?
జగన్ పైనే ఎందుకు విమర్శలు చేస్తున్నారు?
జగన్ క్లాస్ పీకినా ఎందుకు మారడం లేదు
Balineni Srinivas Reddy : అయోమయం, జగన్నాథం అన్నట్టుగా ఉంది మాజీ మంత్రి, ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాస్ రెడ్డి తీరు. అవును.. ప్రస్తుతం ఏపీలో ఆయన పరిస్థితి అలాగే ఉన్నట్టుగా అనిపిస్తోంది. ఎందుకంటే.. సొంత పార్టీ నేతలపైనే, ఏకంగా సీఎం జగన్ పైనే విమర్శలు చేస్తూ టాక్ ఆఫ్ ది టౌన్ అవుతున్నారు బాలినేని. అందుకే ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో బాలినేని గురించి ప్రత్యేకంగా చర్చ నడుస్తోంది. బాలినేని అమాయకత్వంతో మాట్లాడుతున్నారా? లేక అయోమయంలో ఉండి మాట్లాడుతున్నారా అనేది తెలియడం లేదు. 5 సార్లు బాలినేని ఎమ్మెల్యేగా, రెండు సార్లు మంత్రిగా పని చేసిన అనుభవం ఉంది బాలినేనికి. కానీ.. ఈ మధ్య ఆయన మాట్లాడే మాటలు ఎవ్వరికీ అర్థం కావడం లేదు. అసలు రాజకీయ నాయకులు మాట్లాడాల్సిన మాటలే కాదు అవి. ఎన్నికలు దగ్గరవుతున్న వేళ బాలినేని ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నారో ఎవ్వరికీ అర్థం కావడం లేదు…
ఆయన ఒక సంవత్సరం నుంచి ఇలాగే మాట్లాడుతున్నారు. దీంతో ఏకంగా సీఎం జగనే తాడెపల్లికి పిలిచి మరీ క్లాస్ పీకారు అయినా కూడా ఆయనలో ఏమాత్రం మార్పు రాలేదు. దారి తప్పుతున్నారు. ఇష్టం ఉన్నట్టుగా మాట్లాడుతున్నారు. ఆయన లూజ్ టంగ్ తో వైసీపీ నేతలకే ఇబ్బంది వస్తోంది. ఆయన రాజకీయాల్లో పరిణతి చెందలేదా? అసలు జగన్ పైనే ఎందుకు అలా మాట్లాడుతున్నారు అనేది అంతుపట్టడం లేదు. నిజానికి జగన్ కుటుంబానికి బాలినేని దగ్గరి వ్యక్తి. అందుకే వైసీపీ నేతలు కూడా ఆయన్ను ఏమైనా అనాలంటే వంద సార్లు ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడింది.
Balineni Srinivas Reddy : తెలంగాణలో కాంగ్రెస్ గెలుస్తుందని 50 లక్షల బెట్టింగ్
మరోవైపు తెలంగాణలో కాంగ్రెస్ గెలుస్తుందని బాలినేని 50 లక్షల బెట్టింగ్ కట్టినట్టు తెలుస్తోంది. అసలు ఒక రాజకీయ నాయకుడు, ఎమ్మెల్యే ఇలా వేరే రాష్ట్ర రాజకీయాల్లో వేలు పెట్టడం ఏంటి.. ఇలా పబ్లిక్ గా బెట్టింగ్ వేయడం ఏంటంటూ ప్రజలు మండిపడుతున్నారు. ఆయన్ను ఏదైనా అంటే.. ఏదేదో మాట్లాడి సర్దిచెప్పే ప్రయత్నం చేస్తారు బాలినేని. ఈ నేపథ్యంలో ఆయన్ను ఎలా ఎదుర్కోవాలో తెలియక వైసీపీ నేతలు కూడా తలలు పట్టుకుంటున్నట్టు తెలుస్తోంది.