Bhuvaneswari – Brahmani : ఇన్నర్ రింగ్ రోడ్ స్కామ్‌లో భువనేశ్వరి, బ్రాహ్మణికి ఉచ్చు.. చంద్రబాబు తర్వాత అత్తాకోడళ్ల అరెస్ట్ ఖాయమేనా? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Bhuvaneswari – Brahmani : ఇన్నర్ రింగ్ రోడ్ స్కామ్‌లో భువనేశ్వరి, బ్రాహ్మణికి ఉచ్చు.. చంద్రబాబు తర్వాత అత్తాకోడళ్ల అరెస్ట్ ఖాయమేనా?

 Authored By kranthi | The Telugu News | Updated on :28 September 2023,6:00 pm

Bhuvaneswari – Brahmani : టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్ తర్వాత చాలామంది నారా లోకేష్ ను అరెస్ట్ చేస్తారని అనుకున్నారు. నిజానికి.. స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ స్కామ్, ఇన్నర్ రింగ్ రోడ్ స్కామ్ లో నారా లోకేష్ కూడా నిందితుడిగా ఉన్నాడు. దీంతో నారా లోకేష్ అరెస్ట్ కూడా ఖాయం అని అంతా అనుకున్నారు. ఆ తర్వాత టీడీపీ ముఖ్యనేతలను కూడా సీఐడీ అధికారులు అరెస్ట్ చేసే అవకాశం ఉందని అనుకున్నారు. కానీ.. ఇక్కడ సీన్ రివర్స్ అయింది. ఎందుకంటే.. చంద్రబాబు అరెస్ట్ తర్వాత నారా లోకేష్ కంటే కూడా ఆ ఉచ్చు భువనేశ్వరి, బ్రాహ్మణిలకు చుట్టుకుంటోంది. అసలు ఇన్నర్ రింగ్ రోడ్ స్కామ్ లో భువనేశ్వరి, బ్రాహ్మణికి ఏంటి సంబంధం. ఈ అత్తాకోడళ్లు ఈ స్కామ్ లో ఎలా ఇరుక్కున్నారు అంటారా? పదండి వివరంగా తెలుసుకుందాం.

ఇన్నర్ రింగ్ రోడ్ స్కామ్ లో హెరిటేజ్ సంస్థ పేరును అధికారులు యాడ్ చేశారు. అంటే.. ఇన్నర్ రింగ్ రోడ్ స్కామ్ లో హెరిటేజ్ సంస్థకు లబ్ధి చేకూరిందనే వాదన ప్రస్తుతం వినిపిస్తోంది. ప్రస్తుతం ఈ విషయం టీడీపీ నేతల్లోనూ తీవ్ర చర్చనీయాంశం అయింది. సీఐడీ అధికారులు కూడా ఆ దిశగా దర్యాప్తు చేస్తున్నారు. ఒకవేళ దర్యాప్తులో హెరిటేజ్ సంస్థకు లబ్ధి చేకూరినట్టు తేలితే మాత్రం ఖచ్చితంగా ఆ సంస్థలో కీలక బాధ్యతలు నిర్వర్తిస్తున్న నారా భువనేశ్వరి, నారా బ్రాహ్మణి ఇద్దరూ విచారణ ఎదుర్కోవాల్సి వస్తుంది. హెరిటేజ్ సంస్థకు వైస్ చైర్ పర్సన్, ఎండీగా నారా భువనేశ్వరి ఉన్నారు. ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ హోదాలో బ్రాహ్మణి ఉన్నారు. ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో ఏ6గా హెరిటేజ్ సంస్థను అధికారులు చేర్చారు. రాజకీయంగా చంద్రబాబు, లోకేష్ తో పాటు టీడీపీ నేతలను అరెస్ట్ చేస్తారని అంతా ఊహించారు కానీ.. ఇప్పుడు నారా ఫ్యామిలీ మొత్తం కేసులోకి వస్తారని ఎవ్వరూ ఊహించలేకపోయారు. మరోవైపు లోకేష్ యువగళం పాదయాత్రను మళ్లీ ప్రారంభించాలని అనుకుంటున్నారు. చంద్రబాబు అరెస్ట్ తో తన యువగళం పాదయాత్రకు బ్రేక్ ఇచ్చిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆయన ఢిల్లీలో ఉన్నారు.

bhuvaneswari and brahmani are in inner ring road scam

#image_title

Bhuvaneswari – Brahmani : రాజమండ్రి ఎయిర్ పోర్ట్ లోనే అరెస్ట్ చేస్తారా?

ఈనెల 29న యువగళం పాదయాత్రను మళ్లీ ప్రారంభించాలని నారా లోకేష్ భావిస్తున్నారు. కానీ.. ఆయన ఢిల్లీ నుంచి ఇక్కడికి వచ్చాక.. రాజమండ్రి ఎయిర్ పోర్ట్ లోనే ఆయన్ను అరెస్ట్ చేసేందుకు అధికారులు ప్లాన్ చేస్తున్నారు. ఇన్నర్ రింగ్ రోడ్డు స్కామ్ లో చంద్రబాబుతో పాటు నారా లోకేష్ కు నిందితుడిగా ఉన్నాడు. అలాగే హెరిటేజ్ సంస్థ కూడా ఇందులోకి రావడంతో ఈ కేసు రకరకాల మలుపులు తీసుకుంది. మరి.. లోకేష్ ను ముందు అరెస్ట్ చేస్తారా? లేక భువనేశ్వరి, బ్రాహ్మణిని కూడా విచారణకు పిలుస్తారా? అనేది తెలియాలంటే ఇంకొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.

kranthi

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది