Nara bhuvaneswari : జగన్ ప్రభుత్వం పై నారా భువనేశ్వరి సంచలన వ్యాఖ్యలు..
ప్రధానాంశాలు:
Nara bhuvaneswari : జగన్ ప్రభుత్వం పై నారా భువనేశ్వరి సంచలన వ్యాఖ్యలు..
Nara bhuvaneswari : ఆంధ్ర రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాజకీయాలు రసవత్రంగా మారుతూ వస్తున్నాయి...
Nara bhuvaneswari : గత ఐదేళ్లుగా జగన్ ప్రభుత్వంలో ప్రజలకు మేలు జరిగింది ఏమీ లేదని భువనేశ్వరి సంచలన వ్యాఖ్యలు..
Nara bhuvaneswari : ఆంధ్ర రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాజకీయాలు రసవత్రంగా మారుతూ వస్తున్నాయి. ఈ క్రమంలోనే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు భార్య నారా భువనేశ్వరి కూడా పలు రకాల కార్యక్రమాలలో పాల్గొంటూ ప్రజలను ఉత్తేజపరుస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా ఓ కార్యక్రమంలో పాల్గొన్న నారా భువనేశ్వరి జగన్ పాలనపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గత ఐదేళ్లుగా జగన్ ప్రభుత్వంలో ప్రజలకు మేలు జరిగింది ఏమీ లేదని స్వయం ఉపాధి పొందే అవకాశాలు లేకుండా అందర్నీ ఈ ప్రభుత్వం రోడ్డు మీదకు తీసుకువచ్చిందని ఆమె తెలియజేశారు…
అంతేకాక చంద్రబాబు నాయుడు హయాంలో ఎంతోమందికి ఎన్నో రకాల పథకాల ద్వారా పలు రకాల సంక్షేమ కార్యక్రమాలు నిర్వహించారు కానీ జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అలాంటి కార్యక్రమాలు ఏమి చేపట్టలేదు అంటూ ఆమె చెప్పుకొచ్చారు. అలాగే ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో హైదరాబాద్ మహానగరానికి చంద్రబాబు నాయుడు ఐటీ రంగాన్ని తీసుకురావడం జరిగింది. దాని కారణంగానే ఇప్పుడు అక్కడ లక్షల్లో కోట్లలో నిరుద్యోగులు ఉద్యోగాలను పొందుతున్నారు.ఇప్పటికీ ఎన్ని రాజకీయ పార్టీలు వచ్చినా సరే చంద్రబాబు లాగా ఎవరూ చేయలేదంటూ నారా భువనేశ్వరి తెలియజేశారు.

Naralokesh
జగన్ ప్రభుత్వ హయాంలో మద్యం , ఇసుక దందా , దోపిడి తప్ప మరేమీ లేదంటూ నారా భువనేశ్వరి కొనియాడారు. అందుకే ఆంధ్ర రాష్ట్రంలో ప్రతి ఒక్కరి భవిష్యత్తు మారాలంటే కచ్చితంగా ప్రభుత్వం మారాలని దానికి మీరంతా తోడుగా నిలబడాలని నారా భువనేశ్వరి పిలుపునిచ్చారు. దీంతో ప్రస్తుతం నారా భువనేశ్వరి చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతూన్నాయి. ఇక రారా భువనేశ్వరి వ్యాఖ్యలపై వైసీపీ కార్యకర్తలు ఏ విధంగా స్పందిస్తారో వేచి చూడాలి.