Posani Krishna Murali : పోసాని ఊపిరి పీల్చుకోవచ్చా..?
ప్రధానాంశాలు:
Posani Krishna Murali : పోసాని ఊపిరి పీల్చుకోవచ్చా..
Posani Krishna Murali : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత పోసాని కృష్ణమురళికి నరసరావుపేట కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఇటీవల పోసాని పై నమోదైన కేసుకు సంబంధించి కోర్టులో వాదనలు కొనసాగగా, న్యాయమూర్తి ఆయన్ను వ్యక్తిగత పూచీకత్తుపై విడుదల చేసే తీర్పును ప్రకటించారు. ఈ కేసులో వైసీపీ లీగల్ టీమ్ తరఫున ప్రముఖ న్యాయవాది రాప్రోలు శ్రీనివాసరావు వాదనలు వినిపించారు. కోర్టు వాదనలు పరిశీలించిన తర్వాత బెయిల్ మంజూరు చేస్తూ నిర్ణయం తీసుకుంది, ఇది పోసాని అనుచరులకు మరియు వైసీపీ వర్గాలకు భారీ ఊరట కలిగించింది.

Posani Krishna Murali : పోసాని ఊపిరి పీల్చుకోవచ్చా..?
వైసీపీ లీగల్ టీమ్ తరఫున న్యాయవాది రాప్రోలు శ్రీనివాసరావు న్యాయస్థానంలో పోసాని నిర్దోషి అని సమర్థంగా వాదనలు వినిపించారు. కేసుకు సంబంధించి సరైన ఆధారాలు లేవని, నిర్దోషులపై రాజకీయ కుట్రలో భాగంగా ఈ కేసు నమోదైనట్టు న్యాయవాది కోర్టుకు వివరించారు. వాదనలు విన్న అనంతరం న్యాయమూర్తి పోసానికి బెయిల్ మంజూరు చేస్తూ నిర్ణయం ప్రకటించారు. అయితే బెయిల్ మంజూరుతో పాటు రూ.10,000 పూచీకత్తు సమర్పించాలని న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు.
పోసానికి న్యాయస్థానం నుండి బెయిల్ మంజూరవడం పట్ల వైసీపీ శ్రేణులు హర్షం వ్యక్తం చేశాయి. అనేక మంది వైసీపీ నేతలు, కార్యకర్తలు పోసానిపై అకారణంగా కేసులు నమోదు చేయడం అన్యాయమని అభిప్రాయపడ్డారు. ఈ కేసు రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగమని విమర్శలు చేశారు. పోసాని బెయిల్‌తో వైసీపీ వర్గాల్లో సంతృప్తి నెలకొంది. ఇప్పటి నుంచి మరింత ధైర్యంగా ముందుకు సాగుతామని, పార్టీ కోసం పోరాడుతూనే ఉంటామని పోసాని అనుచరులు ధీమా వ్యక్తం చేశారు.