Posani Krishna Murali : పోసాని 10 రోజుల రిమాండ్ విధించిన కోర్ట్..!
ప్రధానాంశాలు:
Posani Krishna Murali : పోసాని 10 రోజుల రిమాండ్ విధించిన కోర్ట్
Posani Krishna Murali : ప్రముఖ సినీ నటుడు, రచయిత పోసాని కృష్ణమురళికి నరసరావుపేట కోర్టు 10 రోజుల రిమాండ్ విధించింది. ఇటీవల ఆయనపై అనుచిత వ్యాఖ్యల కేసులు నమోదవడంతో పోలీసులు హైదరాబాద్‌లో అదుపులోకి తీసుకున్నారు. అనంతరం రాయచోటి పోలీసులు పోసానిని ఆంధ్రప్రదేశ్‌కు తరలించారు. తెలుగుదేశం పార్టీ నేత కిరణ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన నరసరావుపేట పోలీసులు పీటీ వారెంట్‌పై పోసానిని అదుపులోకి తీసుకుని కోర్టులో హాజరుపరిచారు.

Posani Krishna Murali : పోసాని 10 రోజుల రిమాండ్ విధించిన కోర్ట్
సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌పై పోసాని అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆరోపణలు వెల్లువెత్తాయి. దీంతో ఆయనపై రాష్ట్రవ్యాప్తంగా వివిధ పోలీస్ స్టేషన్లలో 17కి పైగా కేసులు నమోదయ్యాయి.వీటిలో ఓబులవారిపల్లి పోలీస్ స్టేషన్‌లో నమోదైన కేసుకు సంబంధించి రాజంపేట జైలులో ఉన్న పోసానిపై, నరసరావుపేట టూటౌన్ పోలీస్ స్టేషన్‌లో కూడా కొత్త కేసు నమోదు చేశారు. ఈరోజు సోమవారం సాయంత్రం నరసరావుపేట కోర్టులో పోసానిని హాజరుపరిచారు. విచారణ అనంతరం కోర్టు ఆయనకు ఈ నెల 13వ తేదీ వరకు రిమాండ్ విధించింది.
రిమాండ్ అనంతరం పోసానిని గుంటూరు జైలుకు తరలించారు. కోర్టులో హాజరుపరిచే ముందు వైద్య పరీక్షలు నిర్వహించినట్టు పోలీసులు తెలిపారు. పోసానిపై నమోదైన కేసులపై త్వరలో మరింత దర్యాప్తు చేపట్టాలని అధికారులు భావిస్తున్నారు. ఆయనపై ఆరోపణలు, భవిష్యత్తులో తీసుకునే చట్టపరమైన చర్యల గురించి మరింత స్పష్టత రావాల్సి ఉంది.