Raghurama Krishnam Raju : మరో బ్లెండర్ మిస్టేక్ చేసిన రఘురాం కృష్ణంరాజు... టికెట్ కావాలంటే బీజేపీ రెండు కండిషన్స్...!
Raghurama Krishnam Raju : రోజుకో ట్విస్ట్ పూటకో పొలిటికల్ అప్డేట్ తో ఏపీ రాజకీయాలు హిట్ పుట్టిస్తున్నాయి.ఇప్పుడు ఏ పార్టీ నుంచి ఎవరు పోటీలో ఉంటారో ఎందుకు ఉంటారో అర్థం కాని పరిస్థితి కనిపిస్తుంది. సుదీర్ఘ చరిత్ర ఉన్న పొలిటికల్ పార్టీలు సైతం అభ్యర్థుల ఎంపిక విషయంలో తడపడం చూస్తుంటే గెలుపు కోసం వాళ్లు పడే థపన చూస్తుంటే వాళ్లని ముంచుతుందా లేదా తేల్చుతుంది అని అనిపిస్తుంది. అయితే పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం పార్లమెంట్ సెగ్మెంట్ లో కూటమి ఎంపీ అభ్యర్థిగా తానే బరిలో ఉంటానని వైసీపీ రెబల్ ఎంపీ రఘురాంరాజు ప్రకటించడం ఇప్పుడు పొలిటికల్ గా హీట్ ని మరింత పెంచుతుంది. అయితే అసలు రఘురామ కిషన్ రాజు వ్యూహం ఏంటి…? ఆల్రెడీ అక్కడ బీజేపీ అభ్యర్థిని ప్రకటించిన ఆయన అంత ధీమా ప్రదర్శిస్తూ ఉండడం వెనకాల లెక్క ఏంటి…? పార్టీ టికెట్ దక్కకపోతే ఆయన ఇండిపెండెంట్ గా రంగంలో దిగుతారా…? అనేవి ప్రస్తుతం రాజకీయ వర్గాలలో వినిపిస్తున్న ప్రశ్నలు.
అయితే నర్సాపురం ఎంపీ రఘురామ రాజు అంటే ప్రస్తుతం తెలియని వారు ఉండరు కాబోలు. ఢిల్లీలో రచ్చబండ పెట్టి జగన్మోహన్ రెడ్డి ప్రజా వ్యతిరేక నిర్ణయాన్ని ఎప్పటికప్పుడు ఎండగడుతూ పొలిటికల్ బాగా పాపులర్ అయ్యారు. అయితే ఆయన వైసీపీ పార్టీ లో గెలిచిన కొంతకాలానే రెబ్బల్ అవతారం ఎత్తి సీఎం జగన్ ను టార్గెట్ చేస్తూ జగన్ పార్టీని ముప్పతిప్పులు పెట్టే ప్రయత్నాలు చేశారు. అయితే ఈ ఎన్నికల్లో రఘురాం రాజు తిరిగి నర్సాపురం పార్లమెంట్ లోనే పోటీ చేస్తారని ప్రచారం జరిగింది. మిత్రపక్షల అభ్యర్థిగానే తాను బరిలో ఉంటానని తాడేపల్లిగూడెం ప్రజాగణం సభలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ సమక్షంలోనేే ధీమాగా ప్రకటించారు. మరోపక్క సీఎం జగన్మోహన్ రెడ్డిని అధికారం నుంచి దింపాలంటే కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీ అయిన టీడీపీ, జనసేన కలిసి పోటీ చేయాలని విపక్ష నేతలు కంటే ఎక్కువగా ఆర్ఆర్ఆర్ స్టేట్ మెంట్స్ ఇచ్చారు. ఇక కూటమి ఏర్పడిన తర్వాత ఆయనకి ఈ సీట్ గ్యారెంటీ అని ఇక్కడ ప్రకటన మాత్రమే తరువాయి అనేటువంటి పరిస్థితులు కూడా వచ్చాయి. అంతేకాక బహిరంగంగా చంద్రబాబు నాయుడుని నాకు సీటు ఇపిస్తే లేని పోలవరం తెప్పిస్తాను కేంద్రాన్ని కన్విన్స్ చేసి అనే లాజిక్ ను ఓ యూట్యూబ్ ఛానల్ లో అడిగినటువంటి రఘురామ రాజు అక్కడ బ్లెండర్ మిస్టేక్ చేశారు. ఆ తర్వాత పరిస్థితులు ఆయనకు అనుకూలంగా మారుతున్నట్టుగా ఏం కనిపించట్లేదు.చంద్రబాబు నాయుడు కి ఈయన పట్ల ఉన్నటువంటి కాస్త పాజిటివ్ కార్నర్ తో ఇప్పుడు కేంద్రంలోని బీజేపీ పార్టీతో కన్విన్స్ ప్రోగ్రాం మొదలెట్టినట్టుగా తెలుస్తోంది.
ఈ నేపథ్యంలో రఘురాం రాజుకి నర్సాపురం టికెట్ ఇవ్వాలంటే కేంద్రంలోని బీజేపీ పార్టీ కూడా రెండు స్ట్రాంగ్ కండిషన్ లు పెట్టింది. వాటిలో ఒకటి ఆయనకి నర్సాపురం టికెట్ ఇవ్వాలంటే బీజేపీ లో జాయిన్ అయ్యి బీజేపీ తరఫున ఇక్కడ పోటీ చేయాలి , రెండోది ఒక ఎంపీ సీట్ కావాల్సిన వారికి ఇచ్చి ఎమ్మెల్యే సీటు నుండి పోటీ చేసేటువంటి కండిషన్ ను బీజేపీ పెట్టడం జరిగింది. ఎందుకంటే బీజేపీ కి ఇక్కడ 10 సీట్లు ఇవ్వడమే చాలా పెద్ద విషయం. ఏపీ లో ఒకటి లేదా ఒకటిన్నర శాతం ఓటు బ్యాంకు ఉన్న బీజేపీ కి 10 సీట్లు ఇవ్వడం అనేది చాలా పెద్ద మేటర్. అది కూడా ఇప్పుడు మరొక సీటు నుండి కూడా ఎసర పెట్టె పరిస్థితి బీజేపీ పార్టీ తీసుకువచ్చింది. అయితే రఘు రామ రాజు ఇన్నాళ్లు జగన్ ని ఎదిరించి పోరాటం చేసినందుకుగాను ఆయనని చాలా జాగ్రత్తగా చంద్రబాబు నాయుడు కాపాడుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఎందుకంటే జగన్ ను ఎదిరించిన అతను చంద్రబాబు నాయుడుని ఎదిరించో లేదా మోడీని ఎదిరించి ఇండివిజువల్ గా పోటీ చేసే ధైర్యం ఉందని అనుకోవచ్చు. మరి రఘురామరాజు విషయంలో ఎలాంటి రాజకీయ పరిణామాలు చోటు చేసుకుంటాయో వేచి చూడాలి.
Ambati Rambabu : జనసేన అధినేత మరియు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై మాజీ మంత్రి అంబటి…
Pawan Kalyan : అమరావతిలో అభివృద్ధి పనుల పునఃప్రారంభ కార్యక్రమం సందర్భంగా జరిగిన సభలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్…
New Ration Cards : ఎన్నో ఏళ్లుగా కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్న ప్రజలకు ఎట్టకేలకు ఊరట…
హైదరాబాద్, మే 2: పవిత్ర సంకల్పాలు బలంగా నెరవేరడానికి మహాగణపతి మంగళానుగ్రహం తప్పని సరిగా ఉండాలని, గణపతి ఆలయ దర్శనం,…
Today Gold Price : భారతీయుల్లో బంగారం ప్రత్యేక స్థానం కలిగి ఉంది. ముఖ్యంగా మహిళలకైతే పసిడిపై అపారమైన ప్రేమ…
Gym Workout Warning : ఈ రోజుల్లో, ముఖ్యంగా చెప్పాలంటే కొవిడ్ అనంతరం చాలా మంది ఫిట్నెస్పై అవగాహన పెంచుకుంటున్నారు.…
Babu Mohan : జబర్దస్త్ వర్ష కిస్సిక్ jabardasth varsha టాక్ షోకి Talk SHow బాబు మోహన్ హాజరు…
Removing Facial Hair : అమ్మాయిలు, మహిళలకు ముఖంపై అవాంఛిత రోమాలు, ముఖ్యంగా అవి తిరిగి వస్తూనే ఉన్నప్పుడు చికాకు…
This website uses cookies.