Hyderabad Biryani : 10 రూపాయలకే హైదరాబాద్ బిర్యానీ... ఏడాది పొడవునా ఇదే రేటు... ఎక్కడంటే...?
Hyderabad Biryani : హైదరాబాదులో బిర్యాని అంటే ఇష్టపడని వారే ఉండరు. అయితే ఈ బిర్యానీని పూర్వం ఏదైనా ముఖ్యమైన సందర్భంలో మాత్రమే తినేవారు. ఎందుకంటే బిర్యానీ తయారు చేయడానికి చాలా సమయం పడుతుంది కాబట్టి. అందుకే ఆనాటి కాలంలో వీటిని ప్రత్యేకమైన పండుగలలో , ఫంక్షన్లలో మాత్రమే తినేవారు. కానీ ఈ మధ్యకాలంలో మనం గమనించినట్లయితే బిర్యానీ చేయడం కూడా చాలా సులభం అయిపోయింది. దీంతో ప్రతి ఒక్కరు బిర్యానీని రోజు తినడం మొదలుపెట్టారు. దీంతో ప్రస్తుతం హైదరాబాదులోని ప్రతి వీధిలో కచ్చితంగా ఒక బిరియాని పాయింట్ ఉంటుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇక బిర్యానీ స్టాల్స్ లో నగరవాసులకు అతి తక్కువ ధరలో బిర్యానీని అందిస్తూ ఉంటారు. కానీ కేవలం 10 రూపాయలకు బిరియాని దొరకడం ఎప్పుడైనా చూశారా… 10 రూపాయలకు బిర్యానీ ఏంటా అని చూస్తున్నారా…అవును మీరు వింటున్నది నిజమే.. హైదరాబాదులోని ఉస్మానియా హాస్పిటల్ కు ఎదురుగా ఉన్న ఆక్సా బిర్యానీ పాయింట్ లో కేవలం 10 రూపాయలకే బిర్యానీ అందిస్తున్నారు. ఇక ఈ బిర్యానీని తినడానికి కూడా ప్రజలు చాలామంది వస్తున్నారు.
అయితే ఎక్కడ దొరకని విధంగా అత్యంత తక్కువ ధరకే వెజ్ బిర్యానీ దొరకడం ఇక్కడ విశేషం. ఇక ఈ వెజ్ బిర్యానీని క్యారెట్ బటాని ,ఆలు , వంటి కూరగాయలతో పాటు స్వచ్ఛమైన నెయ్యిని ఉపయోగించి తయారు చేస్తున్నారు. ఇక ఈ ఆక్సా బిర్యానీ పాయింట్ వారు దాదాపు 18 సంవత్సరాల నుండి హైదరాబాద్ మహానగరంలో కేవలం 10 రూపాయలకే ఈ బిర్యానీని అందజేస్తున్నారట. అంతేకాదు హైదరాబాద్ మహానగరంలో పలు ప్రముఖ ప్రదేశాలలో వీరి బిర్యాని పాయింట్స్ ఉన్నాయని వారు తెలిపారు. అక్కడ కూడా కేవలం 10 రూపాయలకే వెజ్ బిర్యానీ లభిస్తుంది. అంతేకాక మరింత ఆకలితో ఉన్నవారికి వివిధ రేట్ల తో బిర్యాని అందిస్తున్నారు. ఇక ఈ వెజ్ బిర్యానీని 20, 30, 60 రూపాయల్లో కూడా కొనుక్కోవచ్చు. అయితే వాటిలో 10 రూపాయలు బిర్యానీ కంటే కాస్త ఎక్కువ బిర్యాని వస్తుంది.
అంతేకాదు వీరి స్టాల్స్ లో తీసుకున్న బిర్యానీని ప్రశాంతంగా కూర్చొని తినడానికి వీలుగా కుర్చీలు ఫ్యాన్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఉస్మానియా హాస్పిటల్ కి వచ్చిన చాలామంది ప్రజలు పర్యటకులు ఈ స్టాల్ వద్ద బిర్యాని టేస్ట్ చేసి వెళ్తుంటారని స్టాప్ యాజమాన్యం తెలుపుతోంది. ఒక ఈ బిర్యాని తింటున్న చాలామంది బిర్యాని ప్రేమికులు కేవలం 10 రూపాయలకే బిర్యానీ దొరకడం చాలా అదృష్టం అని , ఈ బిర్యాని అతి తక్కువ ధరకు అందిస్తున్న వారికి కృతజ్ఞతలు తెలుపుతున్నారు. కేవలం 10 రూపాయలు అయినప్పటికీ ఈ వెజ్ బిర్యానీ టేస్ట్ చాలా బాగుంటుందని పలువురు అభిప్రాయ వ్యక్తం చేస్తున్నారు. మరి ఇంకెందుకు ఆలస్యం మీరు ఈ ప్రాంతానికి సమీపంలో ఉంటే ఒకసారి ట్రై చేయండి.
Garlic : వెల్లుల్లి అనేది అనేక ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉన్న ఒక సాధారణ వంట పదార్థం. కొలెస్ట్రాల్‌ను నిర్వహించడం,…
Constipation : మలబద్ధకం అనేది జీవితంలో ఏదో ఒక సమయంలో దాదాపు ప్రతి ఒక్కరినీ ప్రభావితం చేసే ఒక సాధారణ…
Venus : జాతకంలో శుక్రుడు శుభ స్థానంలో ఉంటే ఆ జాతకానికి తిరుగుండదు. సంపదకు, శ్రేయస్సుకు, ఐశ్వర్యానికి, కీర్తికి ప్రతీక…
Wife : ఇప్పుడు ప్రభుత్వ స్కీంలు చాలా మందికి చాలా రకాలుగా ఉపయోగపడుతున్నాయి. పదవీ విరమణ కోసం స్మార్ట్ ఫండ్…
Jr Ntr : ఈ రోజు యంగ్ టైగర్ ఎన్టీఆర్ బర్త్ డే Happy Birthday కావడంతో సోషల్ మీడియా…
Free Gas Cylinder : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉచిత గ్యాస్ సిలిండర్ పథకంపై కీలక నిర్ణయం తీసుకుంది. గతంలో ముఖ్యమంత్రి…
PMAY-U : సొంతింటి కలను నెరవేర్చుకునే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రధాన మంత్రి ఆవాస్ యోజన-అర్బన్ (PMAY-U) పథకం…
Raashi Khanna : అందాల ముద్దుగుమ్మ రాశీ ఖన్నా గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. ఈ చిన్నది ఊహలు గుసగుసలాడే…
This website uses cookies.