Early Elections : ముందస్తుకు సిద్ధమవుతున్న మోదీ ప్రభుత్వం?
Early Elections : దేశవ్యాప్తంగా ఇప్పుడు ఒకే ఒక్క విషయం చర్చకు దారి తీస్తోంది. నిజానికి ఇది ఎన్నికల కాలం. తెలంగాణలో ఓవైపు ఇంకో రెండు మూడు నెలల్లో ఎన్నికలు రాబోతున్నాయి. వచ్చే సంవత్సరం మేలో ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు రాబోతున్నాయి. ఇక లోక్ సభ ఎన్నికలు కూడా అదే సమయంలో రాబోతున్నాయి. అందుకే దేశవ్యాప్తంగా ఎన్నికల హడావుడి మొదలైందనే చెప్పుకోవాలి. అయితే.. 2018 లో తెలంగాణలో ముందస్తు ఎన్నికలు వచ్చాయి. అంటే మన దేశంలో ముందస్తు ఎన్నికలు కొత్తేమీ కాదు. తాజాగా కేంద్ర ప్రభుత్వమే ముందస్తు ఎన్నికలకు వెళ్లేందుకు సమాయత్తం అవుతున్నట్టు తెలుస్తోంది.
అసలు ముందస్తు ఎన్నికలకు వెళ్లాల్సిన అవసరం మోదీ ప్రభుత్వానికి ఏముంది అనేది తెలియనప్పటికీ అసలు ముందస్తుకు ఎందుకు వెళ్తోంది అనే దానిపై ప్రజలు తెగ చర్చిస్తున్నారు. జాతీయ స్థాయిలో ముందస్తు ఎన్నికలు అంటే మామూలు విషయం కాదు. నిజానికి ఎన్డీఏ ప్రభుత్వం ముందస్తు ఎన్నికలకు వెళ్లడానికే సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తోంది. దానికి సంబంధించిన పార్లమెంట్ వ్యవహారాల శాఖ మంత్రి చేసిన ట్వీట్ ముందస్తు ఎన్నికలకు సూచన అన్నట్టుగా తెలుస్తోంది.
Early Elections : అందుకే మోదీ ప్రభుత్వం ముందస్తు ఎన్నికలకు వెళ్తోందా?
పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు ఈనెల 18 నుంచి 22 వరకు జరగనున్నాయి. దానికి కారణం మరేదో కాదు ముందస్తు ఎన్నికలకు సిద్ధంగా ఉండటం వల్లనే పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలను బీజేపీ ప్రభుత్వం నిర్వహిస్తున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం వద్ద కొన్ని కీలక బిల్లులు పెండింగ్ లో ఉన్నాయి. ఆ బిల్లులను ఆమోదింప జేసుకునేందుకే మోదీ ప్రభుత్వం పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలను నిర్వహిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ డిసెంబర్ లో ఐదు రాష్ట్రాలకు ఎన్నికలు ఉన్నాయి. ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీకి వ్యతిరేకత ఎదురైతే అది వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లోనూ ప్రభావం చూపిస్తాయని అందుకే ఐదు రాష్ట్రాల ఎన్నికలతో పాటే పార్లమెంట్ ఎన్నికలు కూడా నిర్వహించేందుకు బీజేపీ ప్రభుత్వం ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది.