Botsa Satyanarayana : ఏపీ అసెంబ్లీ లో మద్యం పై రగడ… బొత్స vs TDP
ప్రధానాంశాలు:
Botsa Satyanarayana : ఏపీ అసెంబ్లీ లో మద్యం పై రగడ... బొత్స vs TDP
Botsa Satyanarayana : ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో మద్యం నిషేధం అంశంపై తీవ్ర చర్చ చోటు చేసుకుంది. టీడీపీ ప్రభుత్వం మద్యం నియంత్రణలో పూర్తిగా విఫలమైందని వైసీపీ ఆరోపించగా, దీనిపై టీడీపీ తీవ్రంగా ప్రతిస్పందించింది. బొత్స సత్యనారాయణ అసెంబ్లీలో మాట్లాడుతూ.. రాష్ట్రంలో మద్యం నియంత్రణ లక్ష్యంగా తమ ప్రభుత్వం పని చేసింది, కానీ టీడీపీ పాలనలో బెల్ట్ షాపులు అనధికారికంగా పెరిగిపోయాయని విమర్శించారు..

Botsa Satyanarayana : ఏపీ అసెంబ్లీ లో మద్యం పై రగడ… బొత్స vs TDP
Botsa Satyanarayana 50 లక్షలు తీసుకోని బెల్ట్ షాపులకు పర్మిషన్ ఇస్తున్నారు – బొత్స
ముఖ్యంగా విజయనగరం జిల్లాలో బెల్ట్ షాపులకు వేలం పాటలు జరిగాయని, ఒక్కో ఊరిలో రాత్రి 9 గంటల నుంచి ఉదయం 9 గంటల వరకు మద్యం అమ్ముకునేందుకు రూ. 50 లక్షలు వరకు తీసుకున్న విషయాన్ని బహిరంగంగా వెల్లడించారు.
మద్యం అమ్మకాలపై చర్చ కొనసాగుతుండగా, టీడీపీ నేత అచ్చెన్నాయుడు వైసీపీ విధానాలపై విమర్శలు గుప్పించారు. అయితే దీనిపై బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. మద్యం అమ్మకాల పెరుగుదలకు పునాదులు వేసిందే మీరు మళ్లీ మీరు మాట్లాడుతున్నారా ” అంటూ అచ్చెన్నాయుడిపై మండిపడ్డారు. స్వర్గీయ ఎన్టీఆర్ ప్రవేశపెట్టిన మద్యపాన నిషేధ విధానాన్ని టీడీపీ ప్రభుత్వమే పూర్తిగా నిర్వీర్యం చేసిందని ఆరోపించారు. తమ ప్రభుత్వం అధికారంలో మద్యం దుకాణాలను తగ్గించమని, కానీ మీ ప్రభుత్వ అనుమతులతోనే అనేక అక్రమ బెల్ట్ షాపులు నడుస్తున్నాయన్నారు.