Butchaiah Chowdary : పరాకాష్ఠకు చేరిన జగన్ పిచ్చి : బుచ్చయ్యచౌదరి
ప్రధానాంశాలు:
Butchaiah Chowdhury : పరాకాష్ఠకు చేరిన జగన్ పిచ్చి : బుచ్చయ్యచౌదరి
Butchaiah Chowdary : వైఎస్ జగన్ పిచ్చి పరాకాష్ఠకు చేరిందని ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరి అన్నారు. అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా రేషన్ బియ్యం పంపిణీపై బుచ్చయ్య చౌదరి సభలో మాట్లాడారు. వైఎస్ జగన్ పాలనలో ఇంటింటికి బియ్యం సరఫరా చేస్తామన్నారు. అందుకు రూ.1600 కోట్లు ఖర్చు పెట్టి అయ్యగారి సుందర ముఖారవిందం బొమ్మలు వేశారే తప్పా ఒరిగిందేమి లేదన్నారు. పిచ్చి పరాకాష్ఠకు చేరి గత ముఖ్యమంత్రి గారు చేసిన నిర్వాకం ఏంటంటే.. చివరికి చిన్న పిల్లలు క్రికెట్ ఆడేప్పుడు పెట్టుకునే గార్డ్ లకు కూడా ఆయన బొమ్మలు వేసుకోవడమే అన్నారు.

Butchaiah Chowdary : పరాకాష్ఠకు చేరిన జగన్ పిచ్చి : బుచ్చయ్యచౌదరి
కేవలం ఆయన ప్రచార ఆర్భారం కోసం ఇంటింటికి, ఇంటింటికి బియ్యం అందజేత అన్నారు ఇచ్చారా? అని ఆయన ప్రశ్నించారు. గతంలో ఏదో ఒక రోజు వెళ్లి బియ్యం తెచ్చుకునేవారు. పొలం పనికి వెళ్లేటప్పుడే, ఇతర వృత్తులకు వెళ్లేటప్పుడే, వాళ్లకు అనుకూల సమయం చూసి వెళ్లి బియ్యం తెచ్చుకునేవాళ్లు అని తెలిపారు. ఇవాళ వాహనాలు అన్నారు. ఆ వాహనాలు నడవడం లేదు. ఇంటింటికి ఇవ్వడం లేదు. కేవలం ఒక సెంటర్‌లో పెడుతున్నారు. పర్యవసానంగా ఏమైతుంది, కేంద్రీకృతమైన వ్యవస్థను ఏర్పాటు చేసి దోపిడికి పాల్పడినట్లు ఆయన దుయ్యబట్టారు.
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు 6వ రోజు కొనసాగుతున్నాయి. టీడీపీ, వైసీపీ సభ్యుల మధ్య మాటల యుద్ధంతో శాసనసభ, శాసనమండలి సమావేశాలు వాడివేడిగా కొనసాగుతున్నాయి. ఏపీఎస్పీడీసీఎల్ 24వ వార్షిక నివేదిక ప్రతి, 2020-2021 సంవత్సరానికి ఏపీ వాణిజ్య ప్రోత్సాహక సంస్థ లిమిటెడ్ 52వ వార్షిక నివేదిక ప్రతిని సంబంధిత మంత్రులు సభలో ప్రవేశ పెట్టనున్నారు.