Byreddy Siddharth : రౌడీలతోనే రౌడీయిజం చంద్రబాబుకు మాస్ వార్నింగ్ బైరెడ్డి అదిరిపోయే కౌంటర్ వీడియో..!!

Advertisement

Byreddy Siddharth : ఏపీ శాప్ చైర్మన్ వైసీపీ యువనేత బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి టీడీపీ అధినేత చంద్రబాబుపై సీరియస్ వ్యాఖ్యలు చేశారు. ఇటీవల సాగునీటి ప్రాజెక్టులపై విధ్వంసం అంటూ నందికొట్కూరు నియోజకవర్గంలో పర్యటించిన చంద్రబాబు పై రెడ్డి పై కీలక వ్యాఖ్యలు చేయడం తెలిసిందే. ఈ బైరెడ్డి ఆకు రౌడీ అన్నట్టు.. వ్యాఖ్యలు చేశారు. దీంతో తనపై చేసిన చంద్రబాబు చేసిన వ్యాఖ్యలకు బైరెడ్డి గట్టి కౌంటర్ ఇచ్చారు. రాయలసీమలో ప్రాజెక్టులకు సంబంధించి చంద్రబాబు చేసింది ఏమీ లేదని వ్యాఖ్యానించారు. రాయలసీమలో నీటి ప్రాజెక్టుల విషయంలో వైయస్సార్ అదే విధంగా ఎన్టీఆర్ హయాలలోనే మేలు జరిగిందని వివరించారు.

Advertisement

శ్రీశైల ప్రాజెక్టు విషయంలో రాయలసీమకు అన్యాయం చేస్తూ డెల్టా మరియు సీమ ప్రజల మధ్య గొడవ పెట్టే ప్రయత్నం మీరు చేయలేదా అని అన్నారు. ఇరిగేషన్ విషయంలో కేవలం నీరు చెట్టు కార్యక్రమాలకు మాత్రమే చంద్రబాబు ఖర్చు పెట్టారని ప్రాజెక్టులకు చేసింది ఏమీ లేదని బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి కౌంటర్లు ఇచ్చారు. నందికొట్కూరులో శివానందరెడ్డి లాంటి వ్యక్తిని పక్కన పెట్టుకుని తనపై చంద్రబాబు ఇష్టానుసారంగా మాట్లాడటం తగదు అని బైరెడ్డి మండిపడ్డారు. నియోజకవర్గంలో కొన్ని వందల ఎకరాలు కబ్జా చేసిన వ్యక్తి శివానందరెడ్డి. నయిం లాంటి నేరస్తులతో అతనికి సంబంధాలు ఉన్నాయని రాష్ట్రంలో ప్రముఖ మీడియా ఛానల్స్ సైతం వార్తలు ప్రచారం చేశాయి.

Advertisement
Byreddy Siddharth
Byreddy Siddharth

ఇక తెలంగాణ చుట్టుపక్కల ప్రాంతాలలో దళితుల వద్ద భూములను లాక్కుంటున్న వ్యక్తి అతను. ఇటువంటి రాక్షసులను పక్కన పెట్టుకుని నా మీద చంద్రబాబు.. వ్యాఖ్యలు చేయడం విడ్డూరం. నేనెప్పుడూ దౌర్జన్యాలు చేయలేదు. సామాన్యుల జోలికి కూడా ఎప్పుడు వెళ్లలేదు. క్రిమినల్స్ తోనే పోరాడాను అని బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి చంద్రబాబు నందికొట్కూరులో తనపై చేసిన వ్యాఖ్యలకు కౌంటర్లు ఇచ్చారు.

Advertisement
Advertisement