Chandra Babu : చంద్రబాబు ఇంత కామ్‌గా ఉంటే ఏ పని వర్కవుట్ కాదు.. స్పీడ్ పెంచు..!
Chandra Babu : ఒకప్పుడు చంద్రబాబు పని తీరు చూస్తే ప్రత్యర్ధుల గుండెల్లో దడ పుట్టేది. ఆయన ఆలోచనలు, ప్లానింగ్ అంతా కూడా కాస్త డిఫరెంట్‌గా ఉండేవి. అయితే ఇప్పుడు చంద్రబాబు కాస్త మెతకగా ఉంటున్నాడేమో అనిపిస్తుంది. పెద్దల దగ్గర అలా ఉండడం తప్పేమి కాదు కాని పరిస్థితులు చేయి దాటిపోతున్నా కూడా చంద్రబాబు వ్యవహరిస్తున్న తీరు ఎవరికి మింగుడు పడడం లేదు. కేంద్రంలోని కూటమి సర్కారులో భాగస్వామిగా ఉన్న చంద్రబాబు అక్కడ నుంచి నిధులు తెచ్చుకునే […]
ప్రధానాంశాలు:
Chandra Babu : చంద్రబాబు ఇంత కామ్‌గా ఉంటే ఏ పని వర్కవుట్ కాదు.. స్పీడ్ పెంచు..!
Chandra Babu : ఒకప్పుడు చంద్రబాబు పని తీరు చూస్తే ప్రత్యర్ధుల గుండెల్లో దడ పుట్టేది. ఆయన ఆలోచనలు, ప్లానింగ్ అంతా కూడా కాస్త డిఫరెంట్‌గా ఉండేవి. అయితే ఇప్పుడు చంద్రబాబు కాస్త మెతకగా ఉంటున్నాడేమో అనిపిస్తుంది. పెద్దల దగ్గర అలా ఉండడం తప్పేమి కాదు కాని పరిస్థితులు చేయి దాటిపోతున్నా కూడా చంద్రబాబు వ్యవహరిస్తున్న తీరు ఎవరికి మింగుడు పడడం లేదు. కేంద్రంలోని కూటమి సర్కారులో భాగస్వామిగా ఉన్న చంద్రబాబు అక్కడ నుంచి నిధులు తెచ్చుకునే విషయంలో చాలా అలసత్వం ప్రదర్శిస్తున్నారనే టాక్ నడుస్తుంది. బిహార్ పాలిత జేడీయూ నిధులు తెచ్చుకోవడంలో కాస్త దుందుడుకు వైఖరి ప్రదర్శిస్తుంటే చంద్రబాబు మాత్రం మరింత ఆలస్యం చేస్తున్నాడనే టాక్ వినిపిస్తుంది.
Chandra Babu మెతకతనం వద్దు..
విజయవాడ వరదలు, కాకినాడ వరదలు. దీనికి సంబంధించి కేంద్రానికి రూ.6880 కోట్ల ప్రాథమిక పరిహారం కోరుతూ.. చంద్రబాబు లేఖ పంపించారు. నివ దిక కూడా ఇచ్చారు. బాధితులకు.. పరిహారం అందించాల్సి ఉందని, బుడమేరును పటిష్టం చేయాల్సి ఉందని చెప్పిన ఇంత వరకు ఒక్క రూపాయి కూడా రాలేదు. వేలాది మంది తమకు పరిహారం రాలేదని.. ప్రభుత్వంపై నిప్పులు చెరుగుతున్నారు. కేంద్ర బడ్జట్‌లోనే ప్రతిపాదించిన 12 వేల కోట్లరూపాయలను ఇప్పటి వరకు రూపాయి కూడా కేంద్రం విడుదల చేయలేదు. సరే.. నిన్న మొన్నటి వరకు ఎలా ఉన్నా.. ఇప్పుడైనా ఇవ్వాలి కదా! అంటే దానికి కూడా సమాధానం లేదు. మంత్రులు నేరుగా కేంద్రానికి విన్నవిస్తున్నా స్పందించడం లేదు. తాజాగా మరోసారి 7 వేల కోట్లు ఇవ్వాలంటూ.. మంత్రి లేఖ రాశారు.
చంద్రబాబు ఎన్ని లేఖలు రాసిన కూడా కేంద్రం స్పందించలేదు. ఈ పరిణామాలను గట్టిగా నిలదీసి.. కేంద్రం నుంచి డబ్బులు తీసుకువస్తే తప్ప.. ఆయా పనులు ముందుకు సాగే పరిస్థితి కనిపించే పరిస్థితి లేదు. సీఎం చంద్రబాబు మెతకవైఖరి వల్లనే ఏ పనులు కావడం లేదని విమర్శలు వస్తున్నాయి. ఇప్పటికైన కాస్త తేరుకొని పనుల విషయంలో స్పీడ్ పెంచాలని కోరుతున్నారు.