Chandra Babu : తప్పు చేస్తే పవన్ కళ్యాణ్ ని కూడా వదలను.. జనసేన కి వార్నింగ్ ఇచ్చిన చంద్రబాబు నాయుడు..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Chandra Babu : తప్పు చేస్తే పవన్ కళ్యాణ్ ని కూడా వదలను.. జనసేన కి వార్నింగ్ ఇచ్చిన చంద్రబాబు నాయుడు..!

 Authored By anusha | The Telugu News | Updated on :21 December 2023,8:30 pm

ప్రధానాంశాలు:

  •  Chandra Babu : తప్పు చేస్తే పవన్ కళ్యాణ్ ని కూడా వదలను.. జనసేన కి వార్నింగ్ ఇచ్చిన చంద్రబాబు నాయుడు..!

Chandra babu : టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ యువగళం పాదయాత్ర ముగింపుకు చేరిన సందర్భంగా విజయనగరం జిల్లాలో పోలిపల్లిలో నవశకం పేరిట భారీ బహిరంగ సభను ఏర్పాటు చేశారు. ఆ సభలో చంద్రబాబు మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ పై కీలక వ్యాఖ్యలు చేశారు. ఒక్క ఛాన్స్ అని వై.యస్.జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని 30 ఏళ్లు వెనక్కి తీసుకువెళ్లాడని, రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాడను ఐదు సంవత్సరాలలో ఒక్కరికి కూడా ఉద్యోగం ఇవ్వలేదని అన్నారు. పవన్ కళ్యాణ్ ను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఎందుకంటే ఇప్పుడు కానీ మనందరం కలవకపోతే వైసీపీ వ్యతిరేక ఓటు చీలకుండా కాపాడుకోకపోతే ఈ రాష్ట్రాన్ని కాపాడలేమని పవన్ కళ్యాణ్ ముందుకు వచ్చారు. ఆయనను అందుకే మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను అని చంద్రబాబు అన్నారు.

వైసీపీ నుంచి ఆంధ్రప్రదేశ్ విముక్తి పొందాలని పవన్ కళ్యాణ్ కోరాడు. రాజకీయాల్లో పార్టీలు పెట్టే స్వేచ్ఛ ఎవరికైనా ఉంది. ప్రజలు ఎంపిక చేసుకుంటారు. కానీ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసే హక్కు మాత్రం ఎవరికి లేదు. ఐదు సంవత్సరాల వైసీపీ ప్రభుత్వం ఆంధ్రాను అభివృద్ధి చేయలేదు. అమరావతిని రాజధానిగా, విశాఖపట్నం ను ఆర్థిక రాజధాని ఉంచేందుకు మీరు సహకరించారు. కానీ వై.యస్.జగన్మోహన్ రెడ్డి మూడు ముక్కలాటగా చేశాడు. అమరావతిని సర్వనాశనం చేశాడు. అమరావతి పూర్తిగా విధ్వంసం అయిపోయింది అని ముఖ్యమంత్రి వై.యస్.జగన్మోహన్ రెడ్డి పై చంద్రబాబు నాయుడు ఫైర్ అయ్యారు.

పాదయాత్రను ఆపే హక్కు ఎవరికీ లేదు. ఇంతవరకు ఏ పరిపాలన లో పాదయాత్రను ఎవరు అడ్డుకోలేదు. కానీ ఈ సైకో జగన్ అడ్డుకునేందుకు ప్రయత్నించాడు. అవినీతి కేసులు పెట్టి జైల్లో ఉంచాడు. తప్పకుండా అతడికి వడ్డీతో సహా తిరిగి ఇచ్చేస్తాను. యువగళం జనగణంగా మారి ప్రజా గర్జనకు నాంది పలికింది. యువగళానికి సపోర్ట్ చేసిన యువగళం కార్యకర్తలకు జనసేన నాయకులకు ధన్యవాదాలు అని చంద్రబాబు అన్నారు. జాబ్ క్యాలెండర్లు ప్రతి సంవత్సరం ఇస్తామని చెప్పిన వై.యస్.జగన్మోహన్ రెడ్డి ఇంతవరకు జాబ్ క్యాలెండర్ ఇవ్వలేదని, ఉద్యోగాలు ఇవ్వలేదని, పరిశ్రమలను తీసేసాడని, యువత భవిష్యత్తును గందరగోళం చేశారని, ఒక్క పరిశ్రమను కూడా తీసుకురాలేదని, యువతకు జనసేన, టీడీపీ అండగా ఉంటాయని, యువత భవిష్యత్తుకు భరోసా ఇచ్చే బాధ్యత మాది అని చంద్రబాబు అన్నారు.

anusha

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది