Chandra Babu Naidu : వైయస్సార్ చావు వెనుక వై.యస్.షర్మిల.. చంద్రబాబునాయుడు షాకింగ్ కామెంట్స్ ..!
ప్రధానాంశాలు:
Chandra Babu Naidu : వైయస్సార్ చావు వెనుక వై.యస్.షర్మిల.. చంద్రబాబునాయుడు షాకింగ్ కామెంట్స్ ..!
Chandra Babu Naidu : తాజాగా టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు రా కదలిరా అంటూ బహిరంగ సభను నంద్యాలలో ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి పై తీవ్ర విమర్శలు చేశారు. జగన్ ఇంట్లో గొడవలకు మాకు ఏంటి సంబంధం అని, జగన్ వదిలిన బాణం తిరిగి ఆయనకే రివర్స్ అయిందని, అప్పుడు రాష్ట్రమంతా తిరిగిన షర్మిల ఇప్పుడు రివర్స్లో తిరుగుతున్నారని అన్నారు. జగన్ తన ఇంట్లో తానే చిచ్చు పెట్టుకున్నాడని, ఇప్పుడు మాపై పడుతున్నారని అన్నారు. గతంలో వై.యస్.జగన్మోహన్ రెడ్డి జైల్లో ఉన్నప్పుడు జగనన్న అంటూ షర్మిల రాష్ట్రమంతా తిరిగారు. కానీ ఇప్పుడు ఆయనకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ లోకి చేరారు. ఏ కుటుంబంలో అయినా ఆడబిడ్డను అన్ని విధాల ఆదుకుంటారు. ఆస్తి పంపకాల విషయంలో ఆడపిల్లకు ఎటువంటి లోటు ఉండకూడదని అనుకుంటారు. అది మన సాంప్రదాయం కూడా.
కానీ జగన్ షర్మిలకు వచ్చే ఆస్తులను ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నారు. అందుకే ఆమె వ్యతిరేకంగా పోటీ చేస్తున్నారు. అయిన అది వాళ్ళ ఇంట్లో సమస్య. మాకేంటి సంబంధం అని, మాపై పడి ఏడవటం ఏంటి అని అన్నారు. వై.యస్.రాజశేఖర్ రెడ్డి నేను చాలా సన్నిహితంగా ఉండేవారం. రాజకీయ విరోధులు అయినప్పటికీ ఆయన కాంగ్రెస్ లో ఉన్నారు, నేను టీడీపీలో ఉన్నా ఇద్దరం సన్నిహితంగా ఉండేవారం. ఇక ఆయన తమ్ముడు వివేకానంద వై.యస్.రాజశేఖర్ రెడ్డి మాటను అసలు జవదాటే వారు కాదు. అలాంటి ఆయనను వై.యస్.జగన్మోహన్ రెడ్డి హత్య చేశాడు అని వై.యస్.జగన్మోహన్ రెడ్డి పై చంద్రబాబు తీవ్ర విమర్శలు చేశారు. సైకో జగన్ పోవాలని అందుకు ప్రజలంతా కదలి రావాలని పిలుపునిచ్చారు. అన్ని విధాల నష్టపోయిన ఏపీని కాపాడుకునేందుకు ప్రజలందరూ కదలిరావాలని చంద్రబాబునాయుడు పిలుపునిచ్చారు.
జగన్ పాలనలో ఆంధ్రప్రదేశ్ 30 ఏళ్ళు వెనక్కి వెళ్లిందని విమర్శించారు. మహిళలు అన్ని రకాలుగా ఇబ్బందులు పడుతున్నారని, నిత్యవసర ధరలు పెరిగిపోయాయి అని, టమాటాకు పొటాటోకు తేడా తెలియని ముఖ్యమంత్రి అని ఎద్దేవా చేశారు. మూడు రాజధానులను మూడు ముక్కలు చేసి సర్వనాశనం చేశారన్నారు. ఒకప్పుడు సైబరాబాద్ ను డెవలప్ చేయకుంటే ఇప్పుడు హైదరాబాద్ అలా అభివృద్ధి అయ్యేది కాదని అన్నారు. రాజధాని లేకుండా ఐదేళ్లు పాలించాడని అన్నారు. తాము అధికారంలోకి రాగానే రాజధాని అమరావతి చేస్తామని చెప్పారు. భవిష్యత్తు గ్యారెంటీతో సూపర్ సిక్స్ అందిస్తామని హామీ ఇచ్చారు. ఐదేళ్లలో 20 లక్షలు మంది యువతకు ఉద్యోగాలు ఇస్తామన్నారుష జయహో బీసీ కింద ప్రత్యేక చట్టం తీసుకొస్తామని చంద్రబాబు వెల్లడించారు. వై.ఎస్.జగన్మోహన్ రెడ్డిని గద్దె దింపడానికి ప్రజలంతా సిద్ధం కావాలని చంద్రబాబు పిలుపునిచ్చారు.