Chandrababu : చంద్రబాబు కూడా జగన్ చేసిన తప్పే చేస్తున్నాడా..?
ప్రధానాంశాలు:
భజనలో టీడీపీ నేతలు..ఆ తప్పు చేయొద్దంటున్న రాజకీయ విశ్లేషకులు
Chandrababu : చంద్రబాబు కూడా జగన్ చేసిన తప్పే చేస్తున్నాడా..?
Chandrababu : రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన కూటమి ప్రభుత్వం “సుపరిపాలనలో తొలి అడుగు” అనే కార్యక్రమాన్ని రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభించింది. ఈ సందర్భంగా కూటమిలోని ఎమ్మెల్యేలు, నాయకులు గ్రామాలకి తిరిగి ప్రజలతో సమావేశమవుతూ తమ ప్రభుత్వ పాలన గురించి వివరించడం ప్రారంభించారు. ఇది ఒక మంచి ఆలోచనగా కనిపించినా, ప్రజలలో మాత్రం గతం గుర్తుకు తెచ్చుకుంటున్నారు. ఎందుకంటే గతంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ Ysrcp ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు సీఎం జగన్ Ys Jagan “గడపగడపకు ప్రభుత్వము” అనే కార్యక్రమాన్ని నిర్వహించారు. అప్పట్లో కూడా పార్టీ ఎమ్మెల్యేలు ఇంటింటికి వెళ్లి ప్రభుత్వ కార్యక్రమాలు, సంక్షేమ పథకాల గురించి ప్రజలకు వివరించారు.

Chandrababu : చంద్రబాబు కూడా జగన్ చేసిన తప్పే చేస్తున్నాడా..?
Chandrababu జగన్ను ఎలాగైతే భజన ముంచిందో.. బాబు ను కూడా అదే భజన ముంచబోతుందా..?
ఈ తరహా ప్రచారం విధానమే ఇప్పుడు కూటమి ప్రభుత్వం కూడా చేపట్టినట్లుగా కనిపిస్తోంది. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు Chandrababu Naidu పాలనను పొగిడే విధంగా నాయకులు మాట్లాడుతున్న తీరు చూస్తే, ఇది కూడా గతంలో జగన్ చేసిన భజన విధానమే కాపీ చేసినట్లుగా పలువురు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అప్పట్లో కూడా వైసీపీ నేతలు జగన్ నాయకత్వాన్ని ప్రశంసిస్తూ తిరిగారు. అదే తరహాలో ఇప్పుడూ టీడీపీ TDP నాయకులు చంద్రబాబు పై పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు. ఇది ప్రజల్లో మిశ్రమ స్పందనను కలిగిస్తోంది. గతంలో ఈ తరహా కార్యక్రమాలే వైసీపీకి నష్టం చేశాయన్న భావన కూడా కొందరిలో ఉంది.
ఈ నేపథ్యంలో “సుపరిపాలనలో తొలి అడుగు” అనే కార్యక్రమం ప్రజలకు నిజంగా ఉపయోగపడాలంటే, దాని దృష్టి సీఎం గురించి చెప్పడంలో కాకుండా, ప్రభుత్వ పనితీరు, ప్రజల సమస్యల పరిష్కారంపై ఉండాలి. నాయకులు ప్రజల వద్దకు వెళ్లి వారి సమస్యలు అర్థం చేసుకుని వాటికి పరిష్కారాలు చూపే ప్రయత్నం చేయాలి. లేకపోతే ఇది కూడా మరో ప్రచార స్టంట్‌గా మిగిలిపోయే ప్రమాదం ఉంది. గతంలో చేసిన పొరపాట్లను మరలించి పునరావృతం కాకుండా జాగ్రత్తపడాలి. ప్రజల నమ్మకాన్ని పొందాలంటే, మాటల కంటే కూడా పనిలో నిజాయితీ చూపించాలి అని అంటున్నారు.