Chandrababu : రోజా నా శిష్యురాలే కానీ.. రోజా లాంటి దరిద్రమైన నాలుకను నేనెక్కడా చూడలేదు.. చంద్రబాబు ఫైర్ | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Chandrababu : రోజా నా శిష్యురాలే కానీ.. రోజా లాంటి దరిద్రమైన నాలుకను నేనెక్కడా చూడలేదు.. చంద్రబాబు ఫైర్

Chandrababu : స్కిల్ డెవలప్ మెంట్ కేసులో చంద్రబాబును సీఐడీ అధికారులు అరెస్ట్ చేయగా.. 52 రోజుల తర్వాత చంద్రబాబుకు ఏపీ హైకోర్టు మధ్యంతర బెయిల్ ఇచ్చిన విషయం తెలిసిందే. జైలు నుంచి బయటికి వచ్చినప్పటి నుంచి ఒక్క క్షణం కూడా చంద్రబాబు తీరికతో ఉండలేదు. వెంటనే పార్టీ కార్యక్రమాల్లో, ప్రెస్ మీట్స్ పెట్టి బిజీ అయిపోయారు. రాజమండ్రి జైలు నుంచి బయటికి వచ్చి తన మద్దతు ఇచ్చిన వాళ్లకు చంద్రబాబు ధన్యవాదాలు తెలిపిన విషయం తెలిసిందే. […]

 Authored By kranthi | The Telugu News | Updated on :6 November 2023,10:00 am

ప్రధానాంశాలు:

  •  అది నాలుకేనా?

  •  నువ్వు సీఎంగానే పనికిరావు జగన్

  •  వైసీపీకి రాజకీయ పార్టీగా ఉండే అర్హత లేదు

Chandrababu : స్కిల్ డెవలప్ మెంట్ కేసులో చంద్రబాబును సీఐడీ అధికారులు అరెస్ట్ చేయగా.. 52 రోజుల తర్వాత చంద్రబాబుకు ఏపీ హైకోర్టు మధ్యంతర బెయిల్ ఇచ్చిన విషయం తెలిసిందే. జైలు నుంచి బయటికి వచ్చినప్పటి నుంచి ఒక్క క్షణం కూడా చంద్రబాబు తీరికతో ఉండలేదు. వెంటనే పార్టీ కార్యక్రమాల్లో, ప్రెస్ మీట్స్ పెట్టి బిజీ అయిపోయారు. రాజమండ్రి జైలు నుంచి బయటికి వచ్చి తన మద్దతు ఇచ్చిన వాళ్లకు చంద్రబాబు ధన్యవాదాలు తెలిపిన విషయం తెలిసిందే. అక్కడ ఎవ్వరిపై విరుచుకుపడలేదు. ఎవ్వరినీ పల్లెత్తు మాట అనలేదు. కానీ.. ఆ తర్వాత మళ్లీ మీడియా సమావేశం నిర్వహించి వైసీపీ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో రెచ్చిపోయారు చంద్రబాబు. ఒక బాధ్యతలేని విధంగా ప్రవర్తిస్తారు. అన్నీ మ్యానుపులేట్ చేస్తారు. డబ్బులతో రాజకీయాలు చేస్తారు. బెదిరించడం, కేసులు పెట్టడం తప్ప ఇంకేం చేయలేరు వీళ్లు. ఏదైనా మాట్లాడుతారు వాళ్లు. అది నాలుకో.. ఇంకోటో తెలియదు కానీ.. దరిద్రంగా తయారయ్యారు. రాజకీయ పార్టీగా ఉండటానికి అర్హత లేదు వాళ్లకు. వైఎస్సార్సీపీ పార్టీకి అర్హత లేదు. రాజకీయాలకు పనికిరాని వ్యక్తి వైఎస్ జగన్.

చట్ట ప్రకారం ఎవరైనా సరే పాదయాత్ర చేయొచ్చు. మీటింగ్ పెట్టొచ్చు. కానీ.. ఈ రాష్ట్రంలో మీటింగ్ పెట్టడానికి వీలు లేదు అంటారా? మీడియాకు స్వేచ్ఛగా రాసే హక్కు ఉందా? బ్లూ మీడియాకు స్వేచ్ఛ ఉంది. ఈ ప్రభుత్వాన్ని విమర్శించాలంటే వారికి మాత్రం ఎక్కడా స్వేచ్ఛ లేని పరిస్థితి. నీ ఇష్టం ఉన్నట్టు జరుగుతుందనుకుంటున్నావా? నేను చాలామంది ముఖ్యమంత్రులను చూశా. నీకు ఏవీ లేవు. వివేకా మర్డర్ విషయంలోనూ మీరు ఎన్ని నాటకాలు ఆడుతున్నారు. అమరావతిలో ఎన్ని కుప్పిగంతులు వేశారు అంటూ చంద్రబాబు మండిపడ్డారు. ఒక్క వ్యక్తి కూడా మీకు ఓటు వేసే అర్హత లేదు మీకు.. అంటూ చంద్రబాబు మండిపడ్డారు.

Chandrababu : నువ్వు సీఎంగా అన్ ఫిట్

నువ్వు సీఎంగా అన్ ఫిట్ జగన్. నేను 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉన్నా. మీరు పాదయాత్రలు చేయలేదా? రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తారా? ఇష్టానుసారంగా బిహేవ్ చేస్తారా? లా అండ్ ఆర్డర్ మెయిన్ టెన్ చేయరా? ఎవ్వరికీ మాట్లాడే స్వేచ్ఛ లేదా? ఎన్ని ఇబ్బందులు పెడతారో నేను చూస్తాను. ఈ రాష్ట్రంలో రోడ్డు మీదికి కూడా రాలేరు. ప్రజలే మిమ్మల్ని చూసుకుంటారు అంటూ చంద్రబాబు… జగన్ పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

kranthi

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది