Chandrababu : మహానాడు వేదికపై రైతులకు గొప్ప శుభవార్త తెలిపిన సీఎం చంద్రబాబు
ప్రధానాంశాలు:
Chandrababu : మహానాడు వేదికపై రైతులకు గొప్ప శుభవార్త తెలిపిన సీఎం చంద్రబాబు
Chandrababu : ఆంధ్రప్రదేశ్ Andhra pradesh CM ముఖ్యమంత్రి Nara Chandrababu Naidu నారా చంద్రబాబు నాయుడు మహానాడు సభలో Mahanadu Meeting రైతులకు శుభవార్త తెలిపారు. “అన్నదాత సుఖీభవ పథకం” annadata sukhibhava ద్వారా రైతులకు సంవత్సరానికి రూ.20,000 ఆర్థిక సహాయం అందించనున్నట్లు ప్రకటించారు. ఈ పథకాన్ని ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (పీఎం కిసాన్) పథకంతో సమన్వయం చేస్తూ అమలు చేయనున్నట్లు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే రూ.6,000తో పాటు రాష్ట్ర ప్రభుత్వం అదనంగా రూ.14,000 మంజూరు చేస్తుందని తెలిపారు.

Chandrababu : మహానాడు వేదికపై రైతులకు గొప్ప శుభవార్త తెలిపిన సీఎం చంద్రబాబు
Chandrababu : రైతుల అకౌంట్లో రూ.20 వేలు..శుభవార్త తెలిపిన చంద్రన్న
ఈ పథకం అమలులో ప్రతి విడతలో రైతులకు రూ.2,000 (కేంద్రం) + రూ.5,000 (రాష్ట్రం) చొప్పున మొత్తం రూ.7,000 అందుతుందని, ఈ విధంగా మూడు విడతల ద్వారా సంవత్సరానికి రూ.20,000 లబ్ధి పొందుతారని సీఎం వివరించారు. వ్యవసాయ అవసరాలు, ఎరువులు, విత్తనాలు కొనుగోలు, సహజ విపత్తుల నుంచి రక్షణ వంటి ఖర్చుల కోసం ఈ ఆర్థిక సహాయం రైతులకు ఉపయుక్తంగా ఉంటుందని , దీనివల్ల రైతులు ఆర్థికంగా స్వావలంబిగా మారతారని తెలిపారు.
ఈ పథకం కోసం రాష్ట్ర బడ్జెట్‌లో రూ.6,300 కోట్లు కేటాయించామని సీఎం వెల్లడించారు. పీఎం కిసాన్ లేదా రైతు భరోసా పథకాల్లో ఇప్పటికే నమోదు అయిన రైతులు ఈ పథకానికి కొత్తగా దరఖాస్తు చేయాల్సిన అవసరం లేదని సూచించారు. అర్హత కలిగిన రైతులు, కౌలు రైతులు కూడా ఈ పథకం ప్రయోజనాలను పొందవచ్చని తెలిపారు. వ్యవసాయ శాఖ అర్హుల జాబితాను సిద్ధం చేస్తోందని చెప్పారు. రైతుల జీవన ప్రమాణాలు మెరుగుపరచడమే తమ ప్రభుత్వ ధ్యేయమని చంద్రబాబు స్పష్టంగా చెప్పారు.