TDP, Janasena alliance : పవన్ కళ్యాణ్ కొంపముంచిన ప్రశాంత్ కిషోర్.. జనసేనతో పొత్తు క్యాన్సిల్ చేసుకోబోతున్న చంద్రబాబు నాయుడు..!!
ప్రధానాంశాలు:
TDP, Janasena alliance : పవన్ కళ్యాణ్ కొంపముంచిన ప్రశాంత్ కిషోర్.. జనసేనతో పొత్తు క్యాన్సిల్ చేసుకోబోతున్న చంద్రబాబు నాయుడు..!!
ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ టీడీపీలోకి రావడం వై.యస్.జగన్మోహన్ రెడ్డికి షాక్ ఇచ్చింది. జగన్ తో ఎంతో అనుబంధం ఉన్న ప్రశాంత్ కిషోర్ ఆయనను వదిలేసి టీడీపీలోకి చేరారు.
TDP, Janasena alliance : ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ టీడీపీలోకి రావడం వై.యస్.జగన్మోహన్ రెడ్డికి షాక్ ఇచ్చింది. జగన్ తో ఎంతో అనుబంధం ఉన్న ప్రశాంత్ కిషోర్ ఆయనను వదిలేసి టీడీపీలోకి చేరారు. వై.యస్.జగన్మోహన్ రెడ్డి గురించి పూర్తిగా తెలిసిన ప్రశాంత్ కిషోర్ చంద్రబాబు తో కలిసి జగన్ ను ఓడిస్తారా అనేదానిపై ఏపీ ఎన్నికల్లో చర్చనీయాంశంగా మారింది. ప్రశాంత్ కిషోర్ మోడీని ప్రధాని చేశారు. అలాగే మమతా బెనర్జీ, ఉదయనిది స్టాలిన్, వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి ని సీఎం చేసింది ఆయనే. అయితే ఏ రాజకీయ నాయకుడైన పొత్తులతో ముందుకు వెళ్లకూడదని ప్రశాంత్ కిషోర్ నమ్ముతారు. ఒంటరిగా వస్తున్నాడని ప్రజలు గెలిపిస్తారని ప్రశాంత్ కిషోర్ నమ్ముతారు. అందుకే టీడీపీ, జనసేనతో పొత్తును కూడా ప్రశాంత్ కిషోర్ యాక్సెప్ట్ చేయడం లేదు అని తెలుస్తుంది. పొత్తు పెట్టుకోవాలి అనుకున్నామని ప్రజలలో హైప్ ఇస్తున్నారు.
ఇద్దరు గెలిచి తీరుతారు అని ప్రజలలో బిల్డప్ ఇచ్చుకోవడం తప్ప నిజంగా మీ ఇద్దరు కలిసి గెలవాలనుకుంటే కావాల్సింది అధికారం చేపట్టాక ఇద్దరు కలిసి ఏం చేస్తారు అనే విషయాన్ని ప్రజల్లోకి తీసుకు వెళ్ల కుండా, మేమిద్దరం పొత్తు పెట్టుకున్నాం, జగన్ కి వ్యతిరేకంగా పోరాటం చేస్తాం, గత ఎన్నికల్లో కలిసి పోటీ చేయలేక ఓడిపోయాం, అందుకే ఇప్పుడు కలిసి పోరాడుతాం అని చెబుతున్నారు తప్ప అధికారంలోకి వస్తే ఏం చేస్తారు.. రాష్ట్రం కోసం ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటారు..వాటి వలన ప్రజలకు ఎలాంటి మేలు జరుగుతుంది అని చెప్పకుండా..కేవలం పొత్తు గురించి మాత్రమే చెప్పుకుంటున్నారు అని ఇన్ డైరెక్ట్ గా ప్రశాంత్ కిషోర్ చంద్రబాబుకు చెప్పారట. టీడీపీ, జనసేన కలిసి ఎన్నికల్లో పోటీ చేయండి కానీ బీజేపీ దగ్గరికి రానివ్వవద్దు అని, దానివలన ఇంకా డ్యామేజ్ అవుతుందని ప్రశాంత్ కిషోర్ తెలిపారట.
అలాగే జనసేనకి ఇన్ని సీట్ల కంటే ఎక్కువగా ఇవ్వవద్దని, టీడీపీ జనసేన తో కలిసి పోటీ చేస్తే ఎన్ని సీట్లు గెలుస్తుంది..జనసేన, టీడీపీ తో కలిసి పోటీ చేస్తే ఎన్ని సీట్లు గెలుస్తుందో అని నియోజకవర్గాల వారీగా సర్వేను ప్రశాంత్ కిషోర్ చంద్రబాబుకు ఇచ్చారని టాక్. అయితే ఆ సర్వే లిస్ట్ ఇవ్వడం వలన టీడీపీకి జనసేనతో వెళ్లకుండా ఉంటేనే ఎక్కువ సీట్లు వస్తాయని కొత్త సందీగ్థత చంద్రబాబులో నెలకొందట. మొత్తానికి ప్రశాంత్ కిషోర్ చెప్పినట్లుగా చంద్రబాబు వింటే జనసేనకు ఎక్కువ సీట్లు రావు. ముఖ్యంగా ఎంపీ సీట్లు అసలు రావు. ఇప్పటికి రెండో మూడు అనుకున్నారు. ఇక 25 ఎమ్మెల్యే సీట్లు ఇవ్వాలనుకున్నారు కానీ ఇప్పుడు 15 , 20 సీట్లు వరకు ఇస్తారని టాక్. ఎన్నికల ముందు ప్రశాంత్ కిషోర్ మాటలు విని చంద్రబాబు పవన్ కళ్యాణ్ పక్కన పెట్టడం తధ్యం అని విశ్లేషకులు అంటున్నారు.