Chandrababu Naidu : 2024లో సీఎం పవన్ కళ్యాణ్ నే.. చంద్రబాబు మాటలకి లోకేష్ రియాక్షన్ ఇదే..!
ప్రధానాంశాలు:
Chandrababu Naidu : 2024లో సీఎం పవన్ కళ్యాణ్ నే.. చంద్రబాబు మాటలకి లోకేష్ రియాక్షన్ ఇదే..!
Chandrababu Naidu : వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని టీడీపీ, జనసేన తమ వ్యూహాలకు పదును పెడుతున్నాయి. తాజాగా జయహో బీసీ అంటూ డిక్లరేషన్ విడుదల చేశాయి. ఈ సభకు నారా చంద్రబాబు నాయుడు, నారా లోకేష్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తదితరులు పాల్గొన్నారు. ఇరు పార్టీలు కలిసి జయహో బీసీ డిక్లరేషన్ ను విడుదల చేశాయి. అసెంబ్లీ ఎన్నికల గెలుపు లక్ష్యంగా టీడీపీ, జనసేన పార్టీలు డిక్లరేషన్ ప్రకటించారు. మంగళగిరిలో జరిగిన జయహో బీసీ సభలో డిక్లరేషన్ విడుదల చేశారు. పది పాయింట్లతో డిక్లరేషన్ తీసుకువచ్చిన టీడీపీ, జనసేన తాము అధికారంలోకి వస్తే బీసీలకు 50 ఏళ్లకే పింఛన్ అందిస్తామని ప్రకటించారు. అలాగే పింఛన్ మొత్తాన్ని నాలుగు వేలకు పెంచుతామని చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు. పెళ్లి కానుక చంద్రన్న బీమా మొత్తాన్ని పెంచి ఆ పథకాలను పునరుద్ధరిస్తామని ప్రకటించారు .
అలాగే బీసీల అభివృద్ధి కోసం ఐదేళ్లలో బిసి సబ్ ప్లాన్ కింద 1.50 లక్షల కోట్లు ఖర్చు చేస్తామని చంద్రబాబు నాయుడు వెల్లడించారు. స్థానిక సంస్థల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు పునరుద్ధరిస్తామన్న చంద్రబాబు నాయుడు చట్టసభల్లో బీసీలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఇదే సమయంలో 5000 కోట్లతో ఆదరణ పేరిట పనిముట్లు పరికరాలు పంపిణీ చేస్తామని టీడీపీ, జనసేన బీసీ డిక్లరేషన్ లో పేర్కొన్నారు. చట్టబద్ధంగా కులగణన చేపడతామని హామీ ఇచ్చారు. ఇప్పటివరకు ఇద్దరు పిల్లలు దాటితే స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసేందుకు అనర్హులు. అయితే తాము అధికారంలోకి వస్తే ఆ చట్టానికి సవరణ చేస్తామని చంద్రబాబు నాయుడు ప్రకటించారు. ఎంతమంది పిల్లలు ఉన్నా స్థానిక సంస్థల్లో పోటీ చేసే అవకాశం కల్పిస్తామని తెలిపారు.
బీసీలకు పెళ్లి కానుక కింద ఇచ్చే మొత్తాన్ని లక్ష పెంచుతామని డిక్లరేషన్ ను తెలిపారు. విద్యాపథకాలని పునరుద్ధరిస్తామని షరతులు లేకుండా విదేశీ విద్య అమలు చేస్తామని చంద్రబాబు నాయుడు ప్రకటించారు. జనాభా ప్రాతిపదికన కార్పొరేషన్ లు ఏర్పాటు చేస్తామని దామాషా ప్రకారం నిధులు కేటాయిస్తామని తెలిపారు. సామాజిక న్యాయ పరిశీలన కమిటీ ఏర్పాటుతో సహా స్వయం ఉపాధి అయిదేళ్లలో పదివేల కోట్లు ఖర్చు చేస్తామని చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు. అలాగే శాశ్వత కుల ధ్రువీకరణ పత్రాలు అందజేస్తామని, గురుకులాలను జూనియర్ కాలేజీలుగా చేస్తామని టీడీపీ, జనసేన హామీ ఇచ్చాయి. అలాగే ఏడాదిలో బీసీ భవనాలు కమ్యూనిటీ హాల్ లు నిర్మిస్తామని టీడీపీ, జనసేన ప్రకటించాయి.