Chandrababu : నీ చెల్లి షర్మిల కాంగ్రెస్ కి పోతే మా మీద ఏడుస్తావేంటి .. జగన్ పై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు..!! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Chandrababu : నీ చెల్లి షర్మిల కాంగ్రెస్ కి పోతే మా మీద ఏడుస్తావేంటి .. జగన్ పై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు..!!

 Authored By aruna | The Telugu News | Updated on :5 January 2024,4:00 pm

Chandrababu : ఏపీలో ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్ది రాజకీయాలలో ఆసక్తికర మార్పులు జరుగుతున్నాయి. వై.యస్.షర్మిల ఏపీ కాంగ్రెస్ లోకి చేరి సెన్సేషనల్ గా మారారు. ఇక ఇటీవల సీఎం వై.యస్.జగన్మోహన్ రెడ్డి షర్మిల కాంగ్రెస్ చేరికపై ఇన్ డైరెక్టుగా వ్యాఖ్యలు చేశారు. కుటుంబాల మధ్య చిచ్చులు పెడుతున్నారని, కుట్రలు, కుతంత్రాలు జరగబోతున్నాయని, ప్రజలు వీటన్నింటినీ గమనించి జాగ్రత్తగా ఉండాలని అన్నారు. అయితే తాజాగా జగన్ చేసిన వ్యాఖ్యలకు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు రీకౌంటర్ ఇచ్చారు. తాజాగా రాష్ట్రస్థాయి పంచాయతీరాజ్ సదస్సులో ముఖ్యఅతిథిగా పాల్గొన్న చంద్రబాబు జగన్ తన ఇంట్లో తానే చిచ్చు పెట్టుకున్నారని, ఇప్పుడు మాపై పడుతున్నారని అన్నారు. వాళ్ల కుటుంబ విషయాలు మాకు ఎందుకు అని ఉన్నారు.

జగనన్న వదిలిన బాణం అని షర్మిల అప్పుడు రాష్ట్రమంతా తిరిగారు. ఇప్పుడు రివర్స్ లో తిరుగుతున్నారని అన్నారు. మరోవైపు తెలంగాణ మాదిరి ఏపీలో కూడా కాంగ్రెస్ పుంజుకునే అవకాశాలు లేకపోలేదని చెప్పారు. కాంగ్రెస్ ప్రభావం వైసీపీ పై పడుతుందని అన్నారు. చెల్లి నిర్ణయంతో జగన్ సీఎం సీటుకే ఎసర వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పారు. తల్లి, చెల్లి వ్యవహారాన్ని జగన్ చూసుకోవాలని అన్నారు. వై.యస్.జగన్మోహన్ రెడ్డి ఎక్కడికో పోతాడని, కానీ రాజధాని అమరావతి ఇక్కడే ఉంటుందని చంద్రబాబు అన్నారు. రాజధాని అమరావతి కేసులను సుప్రీంకోర్టు ఏప్రిల్ నెలకు వాయిదా వేసింది అని ఈ సందర్భంగా గుర్తు చేశారు. స్థానిక సుపరిపాలన ఆత్మ గౌరవం, ఆత్మవిశ్వాసం డిక్లరేషన్ టీడీపీ, జనసేన కలిసి ప్రకటన చేస్తుందని అధికారంలోకి వచ్చిన తర్వాత

టీడీపీ, జనసేన దీనిని అమలు చేస్తుందని స్పష్టం చేశారు. పంచాయతీరాజ్ వ్యవస్థను ప్రభుత్వం పూర్తిగా విధ్వంసం చేసిందని, తన పాలన కాలంలో పంచాయితీలకు ఒక్క రూపాయి కూడా నిధులు కేటాయించలేదని చంద్రబాబు ఆరోపించారు. పంచాయతీల ఖజానాలో ఒక్క రూపాయి లేకుండా ప్రజా ఉపయోగ పనులు చేసేందుకు సర్పంచులు అప్పులు చేసి పనులు చేయాల్సిన దుస్థితి వచ్చింది అని చంద్రబాబు అన్నారు. తమకు సేవ చేయడానికి ప్రజలు సర్పంచులను ఎందుకంటే తనకు సేవ చేయడానికి జగన్ వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చారని అన్నారు. ప్రజాస్వామ్యంలో స్థానిక పాలన గౌరవాన్ని జగన్ తగ్గించాలని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ అధికారంలోకి వస్తే ఎలాంటి పరిస్థితి ఉండదని ఆయన హామీ ఇచ్చారు.

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది