Chandrababu Naidu : ఆ కుర్చీని మడత పెట్టి… వైయస్ జగన్ కు చంద్రబాబు మాస్ వార్నింగ్…! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Chandrababu Naidu : ఆ కుర్చీని మడత పెట్టి… వైయస్ జగన్ కు చంద్రబాబు మాస్ వార్నింగ్…!

 Authored By aruna | The Telugu News | Updated on :16 February 2024,3:00 pm

ప్రధానాంశాలు:

  •  Chandrababu Naidu : ఆ కుర్చీని మడత పెట్టి... వైయస్ జగన్ కు చంద్రబాబు మాస్ వార్నింగ్...!

Chandrababu Naidu : ఆంధ్ర రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ పలు రకాల కార్యక్రమాలు సభలలో పాల్గొంటూ ప్రజలకు దగ్గరగా ప్రజలలో ఉంటూ వస్తున్నారు రాజకీయ నాయకులు. ఈ క్రమంలోనే ప్రతిపక్ష పార్టీల గురించి ఒకరికొకరు దీటుగా ఘాటు వ్యాఖ్యలు చేస్తూ వస్తున్నారు. అయితే వాస్తవానికి జాతీయ పాలిటిక్స్ కంటే కూడా ప్రస్తుతం ఆంధ్ర రాష్ట్ర పాలిటిక్స్ అందర్నీ ఆకర్షిస్తున్నాయని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఇలాంటి తరుణంలో రాజకీయ నాయకులు ఎలాంటి మాటలు మాట్లాడిన ఇట్టే వైరల్ అవుతున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా ఓ కార్యక్రమంలో పాల్గొన్న నారా చంద్రబాబు నాయుడు ఈ సందర్భంగా మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి పై విమర్శలు చేశారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ… ఇప్పుడే నేను ఒకటి చూశానని మా వాళ్ళు కూడా నాకు చెప్పడం జరిగిందన, ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ఒక సభలో మాట్లాడుతూ చొక్కా చేతులు మడత పెట్టే సమయం వచ్చిందని అన్నారు.

నువ్వు నీ వైసిపి కార్యకర్తలు చొక్కా మడత పెడితే మా టిడిపి కార్యకర్తలు జనసైనికులు, ప్రజలు కుర్చీలు మడత పెడతారు అంటూ చంద్రబాబు నాయుడు వ్యాఖ్యలు చేశారు.మేమందరం కలిసి కుర్చీ మడత పెడితే ఏమవుతుందో తెలుసా జగన్మోహన్ రెడ్డి నీ కుర్చీ లేకుండా పోతుంది అంటూ చంద్రబాబు నాయుడు ఘాటు వ్యాఖ్యలు చేశాడు. దీంతో ఒక్కసారిగా సభ మొత్తం గోలతో నిండిపోయింది. ఇక ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ ఎన్నికలు అంటే దొంగ యుద్ధం , చేతులు మడత పెట్టడం , కుర్చీలు మడత పెట్టడం కాదని ఆ విషయాన్ని గుర్తుంచుకుంటే బాగుంటుందని ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు తెలియజేశారు. మంచికి కూడా హద్దులు ఉంటాయని వాటిని దాటితే తీవ్ర పరిస్థితులు ఎదుర్కోవాల్సిందే అంటూ హెచ్చరించారు. దీంతో చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం రాజకీయపరంగా మరియు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారాయి.

అయితే సోషల్ మీడియాలో గత కొంతకాలంగా కూర్చి మడతపెట్టి అనే మాట ఎంతగా వైరల్ అయిందో అందరికీ తెలిసిందే. ఇక ఈ మాటను సినిమా వాళ్లు కూడా వాడుకుని గుంటూరు కారం సినిమాలో పాటగా రూపొందించడం జరిగింది. ఇక ఇప్పుడు రాజకీయ నాయకులు కూడా ఈ మాటను ఉపయోగించి ప్రతిపక్ష పార్టీలపై ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు. దీంతో ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎలాంటి ట్రెండ్ వచ్చిన సరే సినిమా వాళ్లతో పాటు రాజకీయ నాయకులు కూడా వాడుకుంటున్నారని పలువురు కామెంట్స్ చేస్తున్నారు. మరి చంద్రబాబు నాయుడు వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది