TDP Mahanadu : టీడీపీ చరిత్ర చింపేస్తే చిరిగిపోయేది కాదు – చంద్రబాబు
TDP Mahanadu : ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలోకి తిరిగి వచ్చిన తెలుగుదేశం పార్టీ ఎంతో ప్రతిష్టాత్మకంగా కడప లో మహానాడు వేడుకలను ప్రారంభించింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తొలి ప్రసంగంలో పార్టీ గతాన్ని గుర్తు చేస్తూ కార్యకర్తల్లో నూతన ఉత్సాహం నింపేలా ప్రసంగించారు. టీడీపీ పుట్టినప్పటి నుంచే అవినీతికి వ్యతిరేకంగా, అభివృద్ధి లక్ష్యంగా సాగిన పోరాటాన్ని ఆయన వివరించారు. కడపలో మొదటిసారి మహానాడు జరగడమే కాకుండా, ఇది కూటమి ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత జరుగుతున్న తొలి మహానాడని ఆయన గుర్తు చేశారు. రాయలసీమ ప్రజలు ఇచ్చిన మద్దతు ప్రతిగా ఈ ప్రాంతంలో మహానాడు పెట్టామని చెప్పారు.

TDP Mahanadu : టీడీపీ చరిత్ర చింపేస్తే చిరిగిపోయేది కాదు – చంద్రబాబు
TDP Mahanadu : మహానాడు వేడుకలో కార్యకర్తల్లో జోష్ నింపిన చంద్రబాబు
టీడీపీ అధికారంలోకి రావడంలో కార్యకర్తల త్యాగాలే ప్రధాన కారణమని గుర్తుచేశారు. జనసేన, బీజేపీతో కలిసి ఎన్డీఏ కూటమి ఏర్పాటు చేయడం వల్లే ఈ విజయం సాధ్యమైందని తెలిపారు. గత నాలుగు దశాబ్దాలగా దేశంలోని ఏ పార్టీ ఎదుర్కోని సంక్షోభాలను టీడీపీ ఎదుర్కొని నిలబడిందని, పార్టీ పని అయిందనేవారు మాయమయ్యారని విమర్శించారు. వైసీపీ విధ్వంస పాలనకు వ్యతిరేకంగా పోరాడిన కార్యకర్తలను గుర్తు చేస్తూ, వారి త్యాగాలను స్మరించుకున్నారు. “పసుపు సింహం చంద్రయ్య” వంటి నాయకుల దృఢతే పార్టీకి ప్రాణం అని అన్నారు.
టీడీపీ చరిత్ర అనేది చింపేస్తే చిరిగిపోయే కాగితం కాదని, అది ప్రజల గుండెల్లో నలుపుగా నాటుకుపోయిందని చంద్రబాబు స్పష్టం చేశారు. అభివృద్ధి, సంక్షేమం, సంస్కరణలు అనే అంశాల్లో టీడీపీ దేశానికి మార్గదర్శిగా నిలిచిందని వివరించారు. మహిళల ఆస్తి హక్కులు, బీసీ లకు రాజకీయ భాగస్వామ్యం, విద్యుత్ సంస్కరణలు వంటి అనేక రంగాల్లో తమ పార్టీ ఆధునిక మార్గదర్శకత్వం చూపిందన్నారు. పార్టీ విధానాల్లో నూతనత్వాన్ని ఆహ్వానిస్తూ, భవిష్యత్తులోనూ ప్రజల ఆశయాలకు కట్టుబడి పనిచేస్తామని హామీ ఇచ్చారు. మహానాడు వేదికపై చంద్రబాబు చేసిన ఈ ప్రసంగం టీడీపీకి కొత్త ఉత్సాహాన్ని తీసుకువచ్చిందనే చెప్పాలి.