Chandrababu : చంద్రబాబు జన్మదిన వేడుకలు .. వేలిముద్రలతో చంద్రబాబు చిత్రం.. కుప్పం మహిళల మజాకా..!
Chandrababu : 75వ పుట్టినరోజు సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి సొంత నియోజకవర్గమైన కుప్పంలో అభిమానులు వినూత్నంగా శుభాకాంక్షలు తెలిపారు. కుప్పంలో ముఖ్యంగా మహిళలు నేతృత్వం వహించి, చంద్రబాబుపై తమకు ఉన్న అభిమానాన్ని వేలిముద్రల రూపంలో తెలియజేశారు. ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ ఆధ్వర్యంలో పూరి ఆర్ట్స్‌కు చెందిన కళాకారుడు పురుషోత్తం ఆధ్వర్యంలో మహిళలు కలిసి వేలిముద్రలతో చంద్రబాబు చిత్రాన్ని రూపొందించారు. ఇది కేవలం కళాకృతి మాత్రమే కాకుండా, వారి అభిమానానికి ప్రతిరూపంగా నిలిచింది.
Chandrababu : చంద్రబాబు జన్మదిన వేడుకలు .. వేలిముద్రలతో చంద్రబాబు చిత్రం.. కుప్పం మహిళల మజాకా..!
ఈ సందర్భంగా కంచర్ల శ్రీకాంత్ మాట్లాడుతూ.. చంద్రబాబు కుప్పం ప్రజలకు విలువైన ఆస్తి అని, ఆయన పుట్టినరోజు వారికి పండుగలా అనిపిస్తుందని పేర్కొన్నారు. చంద్రబాబు నేతృత్వంలో రాష్ట్రానికి మంచి రోజులు వచ్చాయని, కుప్పం ప్రజలు ఆయన్ను దేవుడిగా భావిస్తున్నారన్నమాటకు ఇది నిదర్శనమని వివరించారు. ఈ అరుదైన చిత్రాన్ని గ్రామాల్లో ఊరేగించి ప్రజల దృష్టికి తీసుకువచ్చారు. మహిళలు తమ చేతి వేలిముద్రలతో రూపొందించిన ఈ కళా చిత్రానికి గ్రామస్థుల నుంచి పెద్ద ఎత్తున స్పందన లభించింది.
రాష్ట్రవ్యాప్తంగా చంద్రబాబు పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి. ఏపీ దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి మాట్లాడుతూ.. ఈ పండుగ సందర్భంగా టీడీపీ శ్రేణులు రాష్ట్రవ్యాప్తంగా దేవాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించాలని పిలుపునిచ్చారు. చంద్రబాబు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని ప్రజలు ప్రార్థనలు చేయాలని కోరారు. చంద్రబాబు సేవలు, ఆయన సాధించిన విజయాలను పలువురు నేతలు సోషల్ మీడియా వేదికగా గుర్తుచేసుకుంటూ శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
Zodiac Signs : జ్యోతిష్య శాస్త్రంలో ప్రతి గ్రహం ఒక ప్రత్యేక స్థానం కలిగి ఉంటుంది. వాటిలో సూర్యుడు అతి…
Coconut Oil : కొబ్బరి నూనె... మన వంటగదిలో అందుబాటులో ఉండే అత్యంత సాధారణమైన వస్తువు. కానీ దీని ఉపయోగాలు…
Gym : ఇప్పుడు ఆరోగ్యంపై శ్రద్ధ పెరిగిన తరుణంలో వ్యాయామం ప్రతి ఒక్కరి జీవనశైలిలో భాగమవుతోంది. కానీ, వర్కౌట్ చేస్తూ…
Onions Black Spots : ఉల్లిపాయలపై కనిపించే నల్లటి మచ్చలు చాలామందిని ఆందోళనకు గురి చేస్తుంటాయి. అయితే ఈ మచ్చలు…
Smartphone : దేశీయ మొబైల్ తయారీ సంస్థ లావా తాజాగా మరో అద్భుతమైన స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్లోకి తీసుకురావడానికి సిద్ధమవుతోంది. ఇప్పటికే…
Tea BP : టీ అంటే చాలా మందికి ఎంతో ఇష్టం. రోజులో ఒక్క కప్పు టీ లేకుండా చాలామందికి…
Varalakshmi Vratham : వరలక్ష్మీ వ్రతం .. సౌభాగ్యదాయినీ లక్ష్మీదేవిని LAkshmi Devi పూజించే పవిత్రమైన రోజు. ఈ రోజు…
Pragya Jaiswal : అందాల ముద్దుగుమ్మ.. ప్రగ్యా జైస్వాల్ గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. కంచె సినిమాతో తెలుగు ఆడియన్స్…
This website uses cookies.