Chandrababu : విజయసాయిరెడ్డి వంటి నేత కావలెను.. చంద్రబాబు సెర్చ్ స్టార్ట్..?
Chandrababu : ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్‌రెడ్డి వ్యూహాలను బలపర్చడంతో పాటు ఆయనకు తగిన సమయంలో సలహాలు, సూచనలు ఇస్తూనే.. వైసీపీ ఫైర్ బ్రాండ్ లీడర్‌గా ఇటు ఏపీలోనూ అటు ఢిల్లీలోనూ పెద్దదిక్కుగా ఎంపీ విజయ సాయిరెడ్డి ఉన్నారు. ఢిల్లీలో అనుసరించాల్సిన వ్యూహాలను ఎప్పటికప్పుడు జగన్‌కు విజయసాయిరెడ్డి సూచిస్తారట. కాగా, ఆ మాదిరగా హస్తినలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు ఒక నేత లేరనే టాక్ ఆ పార్టీ వర్గాల్లో వినబడుతోంది.
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఒకప్పుడు ఢిల్లీలో చక్రం తిప్పాడని ఆ పార్టీ వారు చెప్తుంటారు. అయితే, అది ఒకప్పటి పరిస్థితి, ఇప్పుడు ఢిల్లీకి చంద్రబాబు వెళితే కనీసం కేంద్రమంత్రులు అప్పాయింట్‌మెంట్స్ దొరకడం లేని పరిస్థితులు ఉన్నాయి. ఈ విషయమై టీడీపీ అంతర్గత సంభాషణల్లో పలువురు నేతలు తెలిపారట.

chandrababu searching lika vijaya sai reddy
Chandrababu : ప్రభావం చూపే నేతలు కరువు..
ఇప్పుడు టీడీపీకి ఉన్న ముగ్గురు ఎంపీలు ఢిల్లీలో ఉన్నప్పటికీ వారు ప్రభావం చూపడం లేదని సమాచారం. గల్లా జయదేవ్ కాని రామ్మోహన్ నాయుడు కాని కేశినేని నాని కాని ఢిల్లీలో అంత పలుకుబడి ఉన్న వారు కాదని అంటున్నారు. ఇక రాజ్య సభ సభ్యుడు కనక మేడల రవీంద్రకుమార్ కూడా ఢిల్లీలో అంతగా ప్రభావం చూపడం లేదట. ఈ విషయాలన్నీ చంద్రబాబు ఢిల్లీ టూర్‌లో తేటతెల్లమయ్యాయని తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఢిల్లీలో ఓ సమర్థుడైన నాయకుడిని ఉంచాలని చంద్రబాబు అనకుంటున్నట్లు తెలుస్తోంది.
అందుకోసం సెర్చ్ కూడా స్టార్ట్ చేశారట. గతంతో ఢిల్లీలో టీడీపీ తరఫున చంద్రబాబుకు మద్దతుగా ఎర్రన్నాయడు, బాలయోగి వంటి వారు రచించి అమలు చేశారు. ఆ మాదిరిగా మళ్లీ ఒక నేతను ఢిల్లీకి పంపాలని చంద్రబాబు మాస్టర్ ప్లాన్ వేస్తున్నట్లు ఆ పార్టీ వర్గాల ద్వారా తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే భవిష్యత్తులో టీడీపీ పనులను ఢిల్లీలో చక్కబెట్టే చాన్సెస్ ఉంటాయని చంద్రబాబు భావిస్తున్నారట. చూడాలి మరి.. చంద్రబాబు విజయసాయిరెడ్డి మాదిరి నేత టీడీపీలో దొరుకుతాడో లేదో..