Chandrababu : ఎమ్మెల్యేలను వణికిస్తున్న చంద్రబాబు సర్వే..!
ప్రధానాంశాలు:
Chandrababu : ఎమ్మెల్యేలను వణికిస్తున్న చంద్రబాబు సర్వే..!
కీలక సమావేశానికి డుమ్మా కొట్టిన ఎమ్మెల్యేలు..అసలు ఏంచేయబోతున్నారు..?
Chandrababu : ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి ఏడాది పూర్తి అయింది. ఈ ఏడాది పాలనపై పలు సర్వేలు జరగగా, చాలా చోట్ల ప్రజాప్రతినిధుల పనితీరు ఆశించినంత స్థాయిలో లేదన్న అంశం ప్రాధాన్యత పొందింది. ముఖ్యంగా ఎమ్మెల్యేల పనితీరు బలహీనంగా ఉందని రిపోర్టులు చెబుతున్నాయి. ఈ విషయాన్ని ఇప్పటికే పలుమార్లు కేబినెట్ సమావేశాల్లో చర్చించిన సీఎం చంద్రబాబు, ఇప్పుడు మరింత కఠినంగా వ్యవహరించేందుకు సిద్ధమయ్యారు. తాజాగా ఆయన ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీలు తదితరులతో విస్తృతంగా భేటీ ఏర్పాటు చేశారు.

Chandrababu : ఎమ్మెల్యేలను వణికిస్తున్న చంద్రబాబు సర్వే..!
Chandrababu : బాబు వార్నింగ్ తో అలర్ట్ అవుతున్న ఎమ్మెల్యేలు
ఈ సమావేశానికి 15 మంది ఎమ్మెల్యేలు డుమ్మా కొట్టడంతో మొత్తం 60 మందికి పైగా హాజరుకాలేదు. దీనిపై తీవ్రంగా అసహనం వ్యక్తం చేసిన చంద్రబాబు, ఇటువంటి నిర్లక్ష్యంపై ఇకపై సహనం ఉండదని హెచ్చరించారు. మరోవైపు, ఇప్పటికే కొందరితో వన్ టు వన్ చర్చలు ప్రారంభించానని చెప్పడంతో రాజకీయ వర్గాల్లో చర్చ మొదలైంది. వీరిలో మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి, గిద్దలూరు ఎమ్మెల్యే అశోక్ రెడ్డి, శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి, రంపచోడవరం ఎమ్మెల్యే మిరియాల శిరీష ఉన్నారు. వీరిని ఎంపికచేసిన విధానం వెనుక చంద్రబాబు సొంత సర్వేలు ఉన్నాయని వార్తలు వెలువడుతున్నాయి.
చంద్రబాబు తాజా చర్యలు సర్వేలకు సంబంధించిన విశ్వసనీయతపై పార్టీ నమ్మకాన్ని చూపిస్తున్నాయి. బయట సంస్థల సర్వేలను కాకుండా పార్టీ చేపట్టిన అంతర్గత సర్వేల ఆధారంగానే చర్యలు తీసుకుంటున్నట్లు సంకేతాలిచ్చారు. ముఖ్యంగా సీనియర్ ఎమ్మెల్యేలైన కందుల, అశోక్, బుడ్డా రాజశేఖర్ లాంటి వారితో మొదట చర్చలు జరిపిన చంద్రబాబు, ఇకపై ఫస్ట్ టైం ఎమ్మెల్యేల వైపు కూడా దృష్టిసారించనున్నారు. తగిన విధంగా మారకపోతే టికెట్ల నుంచి తొలగించే అవకాశం ఉందని చెప్పిన చంద్రబాబు, పార్టీ పరిపాలనలో నిబద్ధత కలిగిన నాయకులను మాత్రమే ముందుకు తీసుకురావాలన్న సంకేతాలు ఇచ్చారు.