New Pensioners : ఏపీలో కొత్త పెన్షన్లు ఇస్తున్నారోచ్ ..!
New Pensioners : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పేద ప్రజల కోసం మరో సంక్షేమ నిర్ణయం తీసుకుంది. కొత్తగా అర్హులైన వారికి పింఛన్లు మంజూరు చేయాలని డిసైడ్ అయ్యింది. ఇప్పటికే పింఛన్ కోసం ఎదురు చూస్తున్నవారికి ఇది గొప్ప శుభవార్త గా చెప్పొచ్చు. ప్రస్తుతం ఎన్టీఆర్ భరోసా పథకం కింద ఇప్పటికే 63.32 లక్షల మందికి పింఛన్లు అందుతున్నాయి. ఈ కొత్త నిర్ణయం ద్వారా దాదాపు 6 లక్షల మంది కొత్త దరఖాస్తుదారులు లబ్ధిపొందే అవకాశముందని అంచనా. ప్రభుత్వం నెలకు రూ.250 కోట్ల అదనపు భారం ఎదుర్కొనాల్సి వచ్చినా, పేదల సంక్షేమమే లక్ష్యంగా ముందడుగు వేస్తోంది.
New Pensioners : ఏపీలో కొత్త పెన్షన్లు ఇస్తున్నారోచ్ ..!
గత ప్రభుత్వ హయాంలో అనేక మంది అర్హులు పింఛన్ పొందలేకపోయారు. పలు ఆరోపణలు వెలుగుచూశాయి. దివ్యాంగుల కోటాలో బోగస్ సర్టిఫికెట్లు ఉపయోగించి దుర్వినియోగం జరిగినట్లు వెలుగు చూసిన నేపథ్యంలో, ఈసారి ప్రభుత్వం మరింత జాగ్రత్తలు తీసుకుంటోంది. ప్రత్యేక వైద్య బృందాల ద్వారా ధృవీకరణ ప్రక్రియ చేపట్టి, నిజమైన అర్హులను గుర్తించనుంది. ఇలా డేటా ఆధారిత విధానంతో పింఛన్ల పంపిణీని నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు రంగం సిద్ధమవుతోంది.
ఈ కొత్త పింఛన్ల విధానం అమలులో భాగంగా మేలో పింఛన్లకు దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం కానుంది. జూన్ నుంచి పంపిణీ ప్రారంభమయ్యే అవకాశముంది. జులైలో కొత్త దరఖాస్తులు స్వీకరించి, ఆగస్టు నుంచి ఎంపికైన వారికి పింఛన్లు ఇవ్వనున్నారు. ప్రభుత్వం పాలసీ ప్రకటనను త్వరలోనే అధికారికంగా వెలువరించనుంది. ఇది పింఛన్ కోసం నిరీక్షణలో ఉన్న లక్షలాది ప్రజలకు ఊరట కలిగించే వార్తగా నిలుస్తోంది.
Apply Oil Benefits Of Belly : వైద్యశాస్త్రం ప్రకారం మానవ శరీరంలో ఏడు ప్రధాన బిందువులలో ఒకటిగా పేర్కొనబడిందే…
Redmi A5 : ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ అయిన షియోమీ తాజాగా భారత మార్కెట్‌లో బడ్జెట్ ఫోన్ Redmi A5ను…
AP 10th Class Results : ఆంధ్రప్రదేశ్‌లో పదో తరగతి పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా…
Capsicum : క్యాప్సికం ప్రియులకు చేదు కబురు. క్యాప్సికం తినేవారు తప్పక ఈ విషయాలు తీసుకోవాల్సిందే... సుఖం తినడం వల్ల…
Numerology : పెళ్లి చేసేటప్పుడు అమ్మాయి జాతకం, అబ్బాయి జాతకం రెండు కలిస్తేనే వారి జీవితం బాగుంటుంది అని జ్యోతిష్యులు…
Today Gold Price : ప్రపంచ ఆర్థిక పరిస్థితుల్లో నెలకొన్న అనిశ్చితి, స్టాక్ మార్కెట్లలో ఒడిదుడుకులు, అమెరికా-చైనా వాణిజ్య యుద్ధం…
Sade Sati Shani 2025 : జీవితంలో చేసిన కర్మ ఫలాలకు శని భగవానుడు శిక్షణలో పెట్టుటకు కాశి చక్రంలో…
RBI Good News : రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) తాజాగా తీసుకున్న నిర్ణయం చిన్న పిల్లల కోసం…
This website uses cookies.