New Pensioners : ఏపీలో కొత్త పెన్షన్లు ఇస్తున్నారోచ్ ..!
ప్రధానాంశాలు:
New Pensioners : ఏపీలో కొత్త పెన్షన్లు ఇస్తున్నారోచ్ ..!
New Pensioners : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పేద ప్రజల కోసం మరో సంక్షేమ నిర్ణయం తీసుకుంది. కొత్తగా అర్హులైన వారికి పింఛన్లు మంజూరు చేయాలని డిసైడ్ అయ్యింది. ఇప్పటికే పింఛన్ కోసం ఎదురు చూస్తున్నవారికి ఇది గొప్ప శుభవార్త గా చెప్పొచ్చు. ప్రస్తుతం ఎన్టీఆర్ భరోసా పథకం కింద ఇప్పటికే 63.32 లక్షల మందికి పింఛన్లు అందుతున్నాయి. ఈ కొత్త నిర్ణయం ద్వారా దాదాపు 6 లక్షల మంది కొత్త దరఖాస్తుదారులు లబ్ధిపొందే అవకాశముందని అంచనా. ప్రభుత్వం నెలకు రూ.250 కోట్ల అదనపు భారం ఎదుర్కొనాల్సి వచ్చినా, పేదల సంక్షేమమే లక్ష్యంగా ముందడుగు వేస్తోంది.

New Pensioners : ఏపీలో కొత్త పెన్షన్లు ఇస్తున్నారోచ్ ..!
New Pensioners కొత్త పెన్షన్ దారులకు చంద్రన్న గుడ్ న్యూస్
గత ప్రభుత్వ హయాంలో అనేక మంది అర్హులు పింఛన్ పొందలేకపోయారు. పలు ఆరోపణలు వెలుగుచూశాయి. దివ్యాంగుల కోటాలో బోగస్ సర్టిఫికెట్లు ఉపయోగించి దుర్వినియోగం జరిగినట్లు వెలుగు చూసిన నేపథ్యంలో, ఈసారి ప్రభుత్వం మరింత జాగ్రత్తలు తీసుకుంటోంది. ప్రత్యేక వైద్య బృందాల ద్వారా ధృవీకరణ ప్రక్రియ చేపట్టి, నిజమైన అర్హులను గుర్తించనుంది. ఇలా డేటా ఆధారిత విధానంతో పింఛన్ల పంపిణీని నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు రంగం సిద్ధమవుతోంది.
ఈ కొత్త పింఛన్ల విధానం అమలులో భాగంగా మేలో పింఛన్లకు దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం కానుంది. జూన్ నుంచి పంపిణీ ప్రారంభమయ్యే అవకాశముంది. జులైలో కొత్త దరఖాస్తులు స్వీకరించి, ఆగస్టు నుంచి ఎంపికైన వారికి పింఛన్లు ఇవ్వనున్నారు. ప్రభుత్వం పాలసీ ప్రకటనను త్వరలోనే అధికారికంగా వెలువరించనుంది. ఇది పింఛన్ కోసం నిరీక్షణలో ఉన్న లక్షలాది ప్రజలకు ఊరట కలిగించే వార్తగా నిలుస్తోంది.