Chandrababu : బిఆర్ఎస్ తప్పుడు ప్రచారం పై సీఎం చంద్రబాబు ఆగ్రహం..!
ప్రధానాంశాలు:
Chandrababu : బిఆర్ఎస్ తప్పుడు ప్రచారం పై సీఎం చంద్రబాబు ఆగ్రహం..!
Chandrababu : తెలుగుదేశం పార్టీ మహానాడులో నారా చంద్రబాబు నాయుడు మరోసారి ఏకగ్రీవంగా పార్టీ జాతీయ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా ఆయన పార్టీ శ్రేణులపై తన నమ్మకాన్ని వ్యక్తం చేస్తూ, ఇప్పటివరకు సమర్థంగా పార్టీని నడిపిన తాను ఇకపై కూడా బాధ్యతను మరింత బాధ్యతగా నిర్వహిస్తానని హామీ ఇచ్చారు. తన బలం, బలగం నాయకులూ, కార్యకర్తలేనని పేర్కొంటూ, కడప మహానాడు గత మహానాడులతో పోలిస్తే ప్రత్యేకంగా నిలిచిపోతుందని వ్యాఖ్యానించారు.

Chandrababu : బిఆర్ఎస్ తప్పుడు ప్రచారం పై సీఎం చంద్రబాబు ఆగ్రహం..!
Chandrababu : మహానాడు సభలో బిఆర్ఎస్ ప్రస్తావన
మహానాడు వేదికగా చంద్రబాబు రాష్ట్ర అభివృద్ధిపై స్పష్టమైన దిశను సూచించారు. ముఖ్యంగా నీటి ప్రాజెక్టులపై మాట్లాడుతూ, తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యం బనకచర్ల వరకు నీటిని తెచ్చే కార్యక్రమమని స్పష్టం చేశారు. నదుల అనుసంధానానికి పూర్తి కట్టుబాటుతో పని చేస్తామని, ప్రస్తుతం నదీజలాల వినియోగంలో ఆంధ్రప్రదేశ్‌ను అత్యంత వెనుకబడిన రాష్ట్రంగా పేర్కొన్నారు. నదుల అనుసంధానంతో తెలంగాణకూ లాభమేనని, అయినా బీఆర్ఎస్ పార్టీ దీన్ని తప్పుడు రీతిలో ప్రజలకు వివరించడం బాధాకరమన్నారు.
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలను తాను రెండు కళ్లా చూస్తానని చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. సముద్రంలోకి పోతున్న నీటిని వినియోగించుకోవడం తప్పా? అంటూ ప్రశ్న లేవనెత్తారు. బనకచర్ల ప్రాజెక్టుతో తెలంగాణకు ఎలాంటి నష్టం జరగదని ఆయన వివరించారు.