Chandrababu : చంద్రబాబు కుట్ర పూరిత రాజకీయాలు… పవన్ కు చెప్పకుండానే అభ్యర్థుల ప్రకటన….! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Chandrababu : చంద్రబాబు కుట్ర పూరిత రాజకీయాలు… పవన్ కు చెప్పకుండానే అభ్యర్థుల ప్రకటన….!

 Authored By aruna | The Telugu News | Updated on :21 January 2024,9:00 pm

ప్రధానాంశాలు:

  •  Chandrababu : చంద్రబాబు కుట్ర పూరిత రాజకీయాలు... పవన్ కు చెప్పకుండానే అభ్యర్థుల ప్రకటన....!

Chandrababu : ఆంధ్ర రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ వైసీపీ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున అభ్యర్థులను మార్చుతూ వస్తుంది. ఈ క్రమంలోనే ముఖ్యమంత్రి జగన్ 68 చోట్ల సిట్టింగ్ లను మార్చడం జరిగింది. ఇక అదే సమయంలో టిడిపి మరియు జనసేన మధ్య సీట్లు సర్దుబాటు ,అలాగే బిజెపి కూటమిలోకి చేరడం వంటివి సరిగ్గా జరగడం లేదని చెప్పాలి. ఎందుకంటే ఎన్నికల షెడ్యూల్ విడుదలైన తర్వాతే అభ్యర్థులను ప్రకటించాలనే ఆలోచనలో చంద్రబాబు మరియు పవన్ కళ్యాణ్ ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇక ఈ నెల ఆఖరిలోపు బిజెపి నుంచి కూడా స్పష్టత లభించనుంది.ఎన్నికల సమీపిస్తున్న నేపథ్యంలో చంద్రబాబు రాష్ట్రమంతా ” రా కదలిరా ” అనే నినాదంతో పెద్ద ఎత్తున బహిరంగ సభలు ఏర్పాటు చేస్తున్నారు. పార్లమెంటు నియోజకవర్గం లో అసెంబ్లీ స్థానంలో ఈ బహిరంగ సభలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే సగం సభలు పూర్తికాగా అభ్యర్థులు ఖరారు అయినచోట ఈ సభలు ఏర్పాటు చేయనున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ సభలకు హాజరవుతున్న చంద్రబాబు వేదికపై నుంచి టిడిపి అభ్యర్థుల విషయంలో ఫుల్ క్లారిటీ ఇస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు పోటీ చేస్తారని బహిరంగంగా సంకేతాలు కూడా పంపుతున్నారు.

అయితే జనసేన సీట్లతో సర్దుబాటు రాకముందే చంద్రబాబు ఇలా ప్రకటనలు చేయడం పై అభ్యంతరాల నుండి అసంతృప్తి వ్యక్తం అవుతున్నాయని చెప్పాలి. అయితే తాజాగా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో మండపేట అభ్యర్థిగా వేగుళ్ళ జోగేశ్వరరావును చంద్రబాబు ప్రకటించడం జరిగింది. అంతేకాక వచ్చే ఎన్నికల్లో టిడిపి అభ్యర్థిగా వేగేళ్ల జోగేశ్వరరావును గెలిపించాల్సిందిగా చంద్రబాబు విజ్ఞప్తి చేశారు. అయితే ఆయన సిట్టింగ్ ఎమ్మెల్యే. కానీ చంద్రబాబు వచ్చే ఎన్నికలలో ఆయనకు టికెట్ ఖరారు చేశారు. ఇక మండపేట నుండి పోటీ చేసేందుకు జనసేన పార్టీ సైతం సిద్ధంగా ఉంది. కానీ అవేవీ పరిగినలోకి తీసుకోకుండా చంద్రబాబు తన పార్టీ అభ్యర్థిని ప్రకటించడంపై జనసేన అభ్యర్థుల నుండి అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అయితే గత ఎన్నికల్లో మండపేట నుండి జనసేన నేత లీల కృష్ణ పోటీ చేయడం జరిగింది.

దాదాపు 35 వేలకు పైగా సీట్లు సాధించి జనసేన పార్టీ అక్కడ బలమైన స్థాయిలో ఉంది. అయితే టిడిపి తో పొత్తు పెట్టుకున్న తర్వాత ఆ సీటును కచ్చితంగా జనసేనకు కేటాయిస్తారని ప్రతి ఒక్కరు అనుకున్నారు. కానీ చంద్రబాబు నాయుడు జనసేన నాయకుడికి కనీసం ఒక మాట కూడా చెప్పకుండా టిడిపి అభ్యర్థిని ప్రకటించడం సమంజసం కాదని జన సైనికులు ప్రశ్నిస్తున్నారు. ఈ క్రమంలోనే లీలా కృష్ణ కూడా పార్టీ నేతలతో ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేశారు. చంద్రబాబు ఏకపక్ష ప్రకటనలను వారు ఖండించారు. ఇక ఈ విషయంపై హై కమాండ్ కు ఫిర్యాదు చేయనున్నట్లు వారు చెప్పుకొచ్చారు. అయితే ఒక మండపేట మాత్రమే కాకుండా చాలా నియోజకవర్గాలలో ఇదే తంతు కనిపిస్తుంది. మరి ఈ సరిచేసుకుని రెండు పార్టీలు ఎలా ముందుకు సాగుతాయో ఎదురుచూడాల్సిందే.

Advertisement
WhatsApp Group Join Now

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది