Ys Jagan : తాను తీసిన గోతిలో తానే పడినట్లు చంద్రబాబు అరెస్టు పట్ల జగన్ పై విమర్శలు..!!

Advertisement

Ys Jagan : టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్ట్ కావటం పట్ల చాలామంది రకరకాలుగా స్పందిస్తూ ఉన్నారు. స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు అరెస్టు చేసిన విధానాన్ని జాతీయ నేతలు ఖండిస్తున్నారు. ఇదే సమయంలో తెలుగు చలనచిత్ర రంగానికి సంబంధించిన వాళ్ళు సైతం స్పందిస్తున్నారు. రాజకీయ కక్షతోనే చంద్రబాబుని వైసీపీ ప్రభుత్వం అరెస్టు చేయించిందని విమర్శలు చేయడం జరిగింది. చంద్రబాబు అరెస్ట్ తో ఏపీ రాజకీయాలు ఒక్కసారిగా మారాయి.

Advertisement

అయితే ఈ అరెస్టు పట్ల తెలంగాణ ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి మాట్లాడుతున్న ఆడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. జగన్ ప్రభుత్వం చంద్రబాబుని అరెస్టు చేసి పెద్ద తప్పు చేసిందని ఆ పెద్దమనిషి ఆడియోలో చెప్పుకొచ్చారు. చంద్రబాబు నీతిమంతుడని అభివర్ణించారు. జగన్ దొంగ అని తనపై ఉన్న ముద్రని ఇతరులపై వేయడానికి.. ఈ రకంగా వ్యవహరించి తన పరువు తానే తీసుకున్నాడని చెప్పుకొచ్చారు. చంద్రబాబు అరెస్ట్ వైసీపీకి పెద్ద మైనస్ అని స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీతో పవన్ కళ్యాణ్ కాలవటంతో…వైసీపీ ఓడిపోతుందని చెప్పుకొచ్చారు.

Advertisement
criticism of Ys jagan for chandrababu arrest down fall to ysrcp
criticism of Ys jagan for chandrababu arrest down fall to ysrcp

వైసీపీ నేతల భాష తీరును ఖండించారు. చంద్రబాబును ఏ విధంగా అరెస్టు చేయడం జరిగిందో అదే కర్మ జగన్ కి పడుతుందని స్పష్టం చేయడం జరిగింది. చంద్రబాబుకి ఉన్న కొద్దీ ఆంధ్రప్రదేశ్ ఆదరణ పెరుగుతూ ఉండటంతో పాటు లోకేష్ పాదయాత్రకి జనాలు వస్తూ ఉండటంతో జగన్ తట్టుకోలేక ఈ రకంగా అరెస్టు చేయించాడని ఆడియోలో ఆ పెద్దమనిషి సంచలన వ్యాఖ్యలు చేశారు.

Advertisement
Advertisement