Ys Jagan : వైసీపీ అధినేత జ‌గ‌న్ భ‌య‌ప‌డుతున్నాడా.. ఇందులో నిజ‌మెంత‌ ? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Ys Jagan : వైసీపీ అధినేత జ‌గ‌న్ భ‌య‌ప‌డుతున్నాడా.. ఇందులో నిజ‌మెంత‌ ?

 Authored By ramu | The Telugu News | Updated on :26 February 2025,3:00 pm

ప్రధానాంశాలు:

  •  Ys Jagan : వైసీపీ అధినేత జ‌గ‌న్ భ‌య‌ప‌డుతున్నాడా.. ఇందులో నిజ‌మెంత‌ ?

Ys Jagan : ఏపీ రాష్ట్రానికి ఐదేళ్లు ముఖ్య‌మంత్రిగా ప‌ని చేసిన వైసీపీ అధినేత జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి Ys Jagan mohan Reddyస‌భ్య‌త్వం ర‌ద్ద‌యిపోతుంద‌ని, ఆయ‌న అందుకే స‌భ‌కి వ‌చ్చార‌నే ప్ర‌చారం న‌డుస్తుంది. ఒక్క రోజు వచ్చి వెళితే కాదు త‌ర్వాత రోజుల్లో కూడా వ‌స్తేనే స‌భ్య‌త్వా నికి భ‌ద్ర‌త ఉంటుంద‌ని కూడా ప‌లు మీడియా సంస్థ‌లు.. నాయ‌కులు కూడా వ్యాఖ్యానిస్తున్నారు. మ‌రి ఈ విష‌యంలో జ‌గన్ భ‌య‌ప‌డుతున్నారా..!

Ys Jagan వైసీపీ అధినేత జ‌గ‌న్ భ‌య‌ప‌డుతున్నాడా ఇందులో నిజ‌మెంత‌

Ys Jagan : వైసీపీ అధినేత జ‌గ‌న్ భ‌య‌ప‌డుతున్నాడా.. ఇందులో నిజ‌మెంత‌ ?

Ys Jagan : జ‌గ‌న్‌కి భ‌య‌మా?

ఆనాడు కేంద్రంలో బ‌లంగా ఉన్న కాంగ్రెస్ Congress పార్టీ ప్ర‌బుత్వాన్ని ఎదిరించిన జ‌గ‌న్‌కు.. ఇప్పుడు రాష్ట్రంలో స‌భ్య‌త్వం పోతుంద‌న్న భ‌యం అనేది ఉంటుందా? సభ్య‌త్వం పోతుంద‌న్న భ‌యం అయన‌కి ఉంటుందంటే అంత తెలివి త‌క్కువ మాట మ‌రొక‌టి ఉండ‌దు. పూర్తిగా స‌భ‌కు రానని జ‌గ‌న్ Ys Jagan ఎక్క‌డా చెప్ప‌లేదు. పైగా.. స‌భ ప్రారంభంలో వ‌చ్చి వెళ్లిపోయినా.. అది స‌భ‌కు వ‌చ్చిన‌ట్టేన‌ని లెక్క‌లు చెబుతున్నాయి.

గ‌వ‌ర్న‌ర్ Governor ప్ర‌సంగం రోజు ప్ర‌జ‌ల ఫోక‌స్ స‌భ‌పై ఎక్కువ‌గా ఉంటుంది కాబ‌ట్టి.. ఆ రోజు వ‌చ్చి.. త‌న వాద‌న‌ను వినిపించి జ‌గ‌న్ వెళ్లార‌ని, అది ఆయ‌న‌లో ఉన్న భ‌యం కాద‌ని, ఆయ‌న ఏనాడు జంక‌లేద‌ని, ఇప్పుడు కూడా ఏ మాత్రం జంక‌డ‌ని చెప్పుకొస్తున్నారు.

Advertisement
WhatsApp Group Join Now

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది