Pawan Kalyan : జగన్ ప్రతిపక్ష హోదాపై సంచలన వ్యాఖ్యలు చేసిన పవన్ కళ్యాణ్
ప్రధానాంశాలు:
Pawan Kalyan : జగన్ ప్రతిపక్ష హోదాపై సంచలన వ్యాఖ్యలు చేసిన పవన్ కళ్యాణ్
Pawan Kalyan : గత కొద్ది రోజులుగా ప్రతిపక్ష హోదా గురించి వైసీపీ YCP తెగ ఫైట్ చేస్తుంది. ఈ రోజు అసెంబ్లీకి వచ్చి కూడా వారు నానా రచ్చ చేశారు. అయితే ఎక్కువ మెజారిటీ ఉన్న వాళ్ళు ప్రభుత్వం ఏర్పాటు చేస్తారు..తరువాత మెజారిటీ ఉన్న వాళ్లకి ప్రతిపక్ష హోదా ఇస్తారు కానీ.. గతంలో పరిపాలించాం మాకు ప్రతిపక్ష హోదా ఇవ్వమంటే ఎవరికి ఇవ్వరని పవన్ కళ్యాణ్ అన్నారు.

Pawan Kalyan : జగన్ ప్రతిపక్ష హోదాపై సంచలన వ్యాఖ్యలు చేసిన పవన్ కళ్యాణ్
Pawan Kalyan పవన్ చురకలు..
వైసీపీకి ప్రతిపక్ష హోదా చంద్రబాబో లేక తానో ఇచ్చిది కాదని డిప్యూటీ సీఎం పవన్ సెటైర్లు వేశారు. ప్రజలే ఆ పార్టీకి ప్రతిపక్ష హోదా ఇవ్వలేదన్నారు. వైసీపీకి 11 సీట్లు వస్తే జనసేనకు 21 వచ్చాయన్నారు. అసెంబ్లీలో రెండవ అతిపెద్ద పార్టీ జనసేన అని అన్నారు. ఓట్లు ఎక్కువ శాతం వస్తే వాళ్ళకు ఎక్కువ అవకాశం ఇచ్చే అవకాశం జర్మనీలో ఉంటుందన్నారు. అలా కావాలంటే వైసీపీ జర్మనీకి వెళ్ళవచ్చన్నారు.
గవర్నర్ నెలరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఈ రోజు అసెంబ్లీ ని ఉద్దేశించి ప్రసంగించారన్నారు. వైసీపీ నాయకులు హుందాగా ప్రవర్తించాల్సిందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.ప్రజలు ఇచ్చిన 11 సీట్లను గౌరవించి అసెంబ్లీకి రావాలని.. ప్రజా సమస్యలు, ప్రభుత్వ లోటుపాట్లు ప్రభుత్వానికి తెలియజేయాలన్నారు. ప్రతిపక్ష హోదా ఇవ్వాలంటే నిబంధనలు ఉన్నాయని.. వాళ్లను అవమాన పరచాలని కాదన్నారు