Devineni Uma : దేవినేని ఉమాకి చంద్రబాబు వెన్నుపోటు పొడిచాడా.. థర్డ్ లిస్ట్‌లో కనిపించని ఉమా పేరు
Devineni Uma : ఏపీ ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ రాజకీయం మరింత వేడెక్కిపోతుంది. ఈ సారి అధికార వైఎస్సార్ సీపీ 175 స్థానాలకు గాను 175 స్థానాలు గెలవాలని కసితో ఉంది. ఇందుకు గాను ఇప్పటికే 175 స్థానాల అభ్యర్ధులని ప్రకటించింది.మిగతా పార్టీలు మాత్రం స్లో అండ్ స్టడీగా అభ్యర్ధులని ప్రకటిస్తున్నాయి. తెలుగుదేశం పార్టీ విడతల వారీగా అభ్యర్థులని ప్రకటిస్తుండగా, మూడో జాబితా లో 11మంది అసెంబ్లీ, 13 లోక్‌సభ స్థానాలకు అభ్యర్థుల్ని ప్రకటించారు. రాష్ట్ర ప్రయోజనాలే ఏకైక ఎజెండాగా ఎన్డీయేలో చేరామని చెప్పిన చంద్రబాబు రాష్ట్రం కోసం పోరాడగల నాయకులనే టీడీపీ అభ్యర్థులుగా నిలబెడుతున్నామని చెప్పుకొచ్చారు. పార్లమెంటుకు పోటీ చేసే 13 మంది తెలుగుదేశం ఎంపీ అభ్యర్థులను.. వీరితో పాటు మరో 11 అసెంబ్లీ స్థానాలకు కూడా అభ్యర్థులను ప్రజాభిప్రాయం మేరకు ఎంపిక చేసామని, వారిని ఆశీర్వదించాలని కోరారు.
అయితే టీడీపీ ప్రకటించిన జాబితాలో మైలవరం నుంచి మాజీ మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావును కాదని.. ఇటీవలే తెలుగు దేశం పార్టీలో చేరిన వసంత కృష్ణప్రసాద్‌ను అభ్యర్థిగా ప్రకటించడం చర్చనీయాంశంగా మారింది. రెండో జాబితాలో ఈ స్థానాన్ని పెండింగ్‌లో పెట్టి ఇప్పుడు కృష్ణ ప్రసాద్ పేరు తెరపైకి తెచ్చారు. అయితే మూడో జాబితాలోను దేవినేని ఉమ పేరు లేకపోవడంతో ఈ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం లేనట్టుగానే అర్థమవుతుంది. టిడిపి ఇంకా ఐదు అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది కాబట్టి ఆయన పేరుని ప్రకటించరని అంటున్నారు.
Devineni Uma : దేవినేని ఉమాకి చంద్రబాబు వెన్నుపోటు పొడిచాడా.. థర్డ్ లిస్ట్‌లో కనిపించని ఉమా పేరు
టీడీపీ విడుదల చేసిన మొదటి విడత జాబితాలో 94 ,రెండో విడత జాబితాలో 34 మంది అభ్యర్థులను ప్రకటించగా, మూడో విడత జాబితాలో 11 మందికి అవకాశం కల్పించారు. సొంత పార్టీలో ఉన్న నేతకి కాకుండా వైసిపి నుంచి వచ్చి టిడిపిలో చేరిన సిట్టింగ్ ఎంపీ వసంత కృష్ణ ప్రసాద్ కు చంద్రబాబు కేటాయించడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. దేవినేని ఉమాను పెనుమలూరు నియోజకవర్గం కు పంపిస్తారని అంతా భావించగా, అక్కడ మాజీ ఎమ్మెల్యే బోడె ప్రసాదను అభ్యర్థిగా ప్రకటించడంతో దేవినేని ఉమాకు ఇక సీటు లేనట్టే అనే విషయంపై అందరికి ఓ క్లారిటీ వచ్చింది. మాజీ సీఎం ఎన్టీఆర్ కే వెన్నుపోటు పొడిచిన చంద్రబాబు ఇప్పుడు దేవినేని ఉమకి కూడా వెన్నుపోటు పొడిచాడని చెబుతున్నారు.
కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వివాహం విఫలమై ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న మహిళలకు గొప్ప ఊరటను కలిగించే వార్తను…
BC Youth Employment : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు…
wife Killed Her Husband : నిర్మల్ జిల్లాలో దారుణమైన హత్య కేసు వెలుగులోకి వచ్చింది. 30 ఏళ్ల వివాహ…
డిల్లీ మెట్రోలో (Delhi Metro) తరచుగా జరిగే విచిత్ర సంఘటనల జాబితాలోకి మరో ఘటన చేరింది. ఇద్దరు మహిళలు సీటు…
Lord Vinayaka | తెలుగు రాష్ట్రాల్లో వినాయక చవితి ఉత్సవాలు శోభాయమానంగా కొనసాగుతున్నాయి. వీధి వీధి అంతా వినాయక మండపాలు,…
Vodafone | వోడాఫోన్-ఐడియా (Vi) తమ వినియోగదారుల కోసం అద్భుతమైన గేమ్ బేస్డ్ ప్రమోషనల్ ఆఫర్‌ను తీసుకువచ్చింది. అత్యుత్తమ ప్రయోజనాలతో…
Manchu Manoj | ఇటీవలే భైరవ సినిమాతో గ్రాండ్ రీ ఎంట్రీ ఇచ్చిన హీరో మంచు మనోజ్, సినిమాలతో పాటు…
Lord Ganesh | వినాయక చవితి వేడుకలు ఇంకా ప్రారంభం కాకముందే హైదరాబాద్‌లో అపశృతి చోటుచేసుకుంది. గణేష్ విగ్రహాన్ని మండపానికి తీసుకెళ్తుండగా…
This website uses cookies.