Bank News Rules : ఒకటికంటే ఎక్కువ బ్యాంకు ఖాతాలు ఉన్నవారికి కొత్త రూల్స్...కచ్చితంగా తెలుసుకోండి...!
Bank News Rules : ప్రస్తుత కాలంలో చాలా ప్రైవేట్ బ్యాంకులు అనేక రకాల ప్రత్యేక సేవలను కస్టమర్లకు అందిస్తున్నారు. ఇక ఈ సేవలు కస్టమర్లు బహుళ సంఖ్యలో బ్యాంకు ఖాతాలను తెరవడానికి దారితీస్తుందని చెప్పాలి. అయితే ఎక్కువ బ్యాంకు ఖాతాలు కలిగి ఉంటే ఏం జరుగుతుందో మీకు తెలుసా..?ఇక పూర్తి వివరాల్లోకి వెళితే. గతంతో పోల్చి చూసినట్లయితే ఈ రోజుల్లో బ్యాంకు పనులు చాలా సులభంగా చేసుకోవచ్చు. అదేవిధంగా బ్యాంకు ఖాతాను కూడా నిమిషాల్లోనే డిజిటల్ గా తెరవగలుగుతున్నారు. ఎవరైనా సరే ఎక్కడి నుండైనా సరే తక్షణ చెల్లింపులు డిజిటల్ సదుపాయం ఆన్లైన్ కేవైసీ రిజిస్ట్రేషన్ , ఆన్లైన్ బ్యాంకింగ్, ఆ తర్వాత బ్యాంకు ఖాతా తెరిచే ప్రక్రియ ఇలాంటి చాలా పనులు చాలా సులభంగా జరుగుతున్నాయి. తద్వారా వినియోగదారులు సైతం ఆకర్షితులవుతున్నారు. దీంతో చాలామంది అనేక బ్యాంకు ఖాతాలను తెరుస్తున్నారు. అయితే ఒక్కొక్క బ్యాంకు వేరువేరు విధానాలను కలిగి ఉండడం వలన ఒకే సమయంలో ఒకటికంటే ఎక్కువ బ్యాంక్ ఖాతాలను నిర్వహించడం అనేది చాలా కష్టమని చెప్పాలి. అయితే ఒక వ్యక్తి ఎక్కువ బ్యాంకు ఖాతాలను కలిగి ఉండటం వలన కలిగే నష్టాలు ఏంటి వాటిని ఎలా అధిగమించాలో ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..
ఎక్కువ బ్యాంక్ ఖాతాలు కలిగి ఉన్నవారు ఎదుర్కునే మొదటి సమస్య ప్రతి బ్యాంకు ఖాతాలో కనీస నగదు నిల్వ ఉంచటం. అలాగే ప్రస్తుత కాలంలో చాలా బ్యాంకులు వారి సేవింగ్స్ ఖాతాలో ఉంచాల్సిన కనీసం మొత్తాన్ని పెంచడం జరిగింది. కావున అలా చేయడంలో విఫలమైనట్లయితే జరిమానాలు విధిస్తారు. అదేవిధంగా ప్రస్తుతం పెరుగుతున్న డిజిటల్ ప్రపంచంలో ఆన్లైన్ మోసాలు కూడా విపరీతంగా పెరుగుతున్నాయి. అయితే ఎక్కువ బ్యాంక్ ఖాతాలు కలిగి ఉండటం వలన మోసానికి దారి తీసే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయని తెలుస్తోంది. కాబట్టి ఒకటికంటే ఎక్కువ బ్యాంకు ఖాతాలు కలిగి ఉన్నవారు మరింత జాగ్రత్తగా ఉండటం మంచిది.
Bank News Rules : ఒకటికంటే ఎక్కువ బ్యాంకు ఖాతాలు ఉన్నవారికి కొత్త రూల్స్…కచ్చితంగా తెలుసుకోండి…!
ఎక్కువ బ్యాంక్ ఖాతాలు కలిగి ఉన్నవారు ఎదుర్కొనే మరో సమస్య బ్యాంకు చార్జీలు. అయితే చాలామంది ఎక్కువ బ్యాంక్ ఖాతాలు ఉన్నప్పటికీ వాటిలో కొన్నింటిని మాత్రమే ఉపయోగిస్తూ ఉంటారు. ఇక మిగిలిన ఖాతాలను వినియోగించకుండా పక్కన పడేస్తారు. అయితే ఆ విధంగా ఎక్కువ కాలం లావాదేవీలు జరగకుండా ఉండటం వలన మీ ఖాతాను మూసివేసే అవకాశం ఉంటుంది. ఇక ఈ సందర్భంలో ఖాతాను తిరిగి వినియోగించాలంటే కచ్చితంగా అదనపు చార్జీలు చెల్లించాలి. ఇక ఈ సమస్యలు నివారించాలంటే కచ్చితంగా అన్ని బ్యాంకు ఖాతాలో ఎప్పటికప్పుడు చిన్నచిన్న లావాదేవీలు చేస్తూ ఉండాలి.
అయితే చాలా రకాల ప్రైవేట్ బ్యాంకులు తమ కస్టమర్లను ఆకర్షించేందుకు అనేక రకాల ఉచిత ప్లాన్ లను అందుబాటులోకి తీసుకొస్తున్నారు. అయితే వీటిలో కొన్ని సేవలు ఉచితంగా ఉంటే మరికొన్ని సేవలకు మాత్రం తప్పనిసరిగా చార్జీలు విధిస్తారు. అయితే వినియోగదారులకు వాటిపై అవగాహన ఉండదు. ఇక ఇవి మొదట చిన్నవిగా అనిపించినప్పటికీ తర్వాత పెద్ద తలనొప్పిగా మారుతాయి అని చెప్పాలి. కాబట్టి మీకు ఎలాంటి సేవలు అందిస్తున్నారో తెలుసుకోవడం మంచిది.
iPhone 16 : యాపిల్ ఐఫోన్‌కు ప్రపంచవ్యాప్తంగా ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రీమియం స్మార్ట్‌ఫోన్ విభాగంలో…
Tamannaah : స్టార్ హీరోయిన్ తమన్నా ఈ మధ్య తన ప్రత్యేక స్టైల్‌తో తెలుగు సినీ ప్రేక్షకుల మనసులను గెలుచుకుంటోంది.…
Jagadish Reddy : తెలంగాణ రాజకీయాల్లో ఎమ్మెల్సీ కవిత, మాజీ మంత్రి జగదీష్ రెడ్డి మధ్య మాటల యుద్ధం తీవ్రమవుతోంది.…
Devara 2 Movie : యంగ్ టైగర్ జూ ఎన్టీఆర్ నటించిన చిత్రం దేవర ఎంత పెద్ద హిట్ అయిందో…
"90s మిడిల్ క్లాస్ బయోపిక్" ఫేమ్ మౌళి తనుజ్, "అంబాజీపేట మ్యారేజి బ్యాండు" మూవీతో గుర్తింపు తెచ్చుకున్న యంగ్ హీరోయిన్…
Viral Video : ప్రకాశం జిల్లా మార్కాపురం మండలంలోని దరిమడుగు గ్రామంలో ఇటీవల జరిగిన ఒక వివాహం స్థానికులను మాత్రమే…
Satyadev : విజయ్ దేవరకొండ కథానాయకుడిగా నటించిన చిత్రం ‘కింగ్‌డమ్’. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సత్యదేవ్,…
Ponnam Prabhakar : ఏపీ మంత్రి నారా లోకేశ్‌పై తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం…
This website uses cookies.