
TDP : టీడీపీలో కూడా అసంతృప్తి ఉందా.. మంత్రి పదవి దక్కకపోవడంతో రగిలిపోతున్న మాజీ మంత్రి..!
TDP : ఈ మధ్య ప్రతి ఒక్కరు కూడా పదవుల కోసం ఆరాటపడుతున్నారు. గెలిచిన వాళ్లు పదవుల కోసం పాకులాడుతుండగా, ఓటమి చెందిన వారు తిరిగి అధికారం ఎలా చేజిక్కించుకోవాలా అని పావులు కదుపుతున్నారు. అయితే ఈ సారి ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. గెలిచిన ఎమ్మెల్యేలు అయిన వారిలో అతి కొద్ది మంది తప్ప దాదాపుగా తొంబై శాతం మందికి మంత్రి పదవుల మీద ఆశలు ఉన్నాయి. కాకపోతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఆచితూచి పదవులు ఇచ్చారు.ఇచ్చాపురం నుంచి అనంతపురం దాకా ఉన్న సీనియర్ నేతలు చాలా మంది అమాత్య కిరీటాలను అందుకోలేకపోయారు.
TDP : టీడీపీలో కూడా అసంతృప్తి ఉందా.. మంత్రి పదవి దక్కకపోవడంతో రగిలిపోతున్న మాజీ మంత్రి..!
ఈ సారి వేరే పార్టీలకి చెందిన వారు కూడా మంత్రి పదవి దక్కించుకున్నారు. అయితే ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఒక సీనియర్ మోస్ట్ నేత పలు పార్టీలు మారి 2024 ఎన్నికలలో టీడీపీలోకి వచ్చి ఎమ్మెల్యే అయ్యాడు. అయితే అతనికి మంత్రి పదవి దక్కలేదని చాలా బాధగా ఉన్నాడట. ఆయన దశాబ్దకాలంగా అనుభవిస్తున్న మంత్రి పదవీ వియోగం కంటిన్యూ అవుతోంది. దీంతో సదరు మాజీ మంత్రి గారు మరింత మండుపడుతున్నట్టు తెలుస్తుంది.. ప్రజలు ఎంతో నమ్మకంగా గెలిపించి ఇచ్చిన ప్రజా ప్రతినిధి అవకాశాన్ని ఆయన పూర్తిగా వాడుకుని తన వంతుగా మంచి పనులు చేస్తే ఆయనకి అవకాశం దక్కిన ఆశ్చర్యపోనక్కర్లేదు అని కొందరి మాట.
ఈసారి టీడీపీ 134 సీట్లలో గెలిచింది. కూటమితో కలసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంతో టీడీపీకి 20 మంది మంత్రులే వచ్చారు. అందులోనూ కొత్తవారికి తొలిసారి గెలిచిన వారికి ఈసారి చాన్స్ ఇచ్చారు. మరి సీనియర్స్ పరిస్థితి ఏంటి.. వారికి రానున్న రోజులలో అయిన మంత్రి పదవి దక్కే అవకాశం ఉందా..కూటమి ప్రభుత్వం ఎవరికి ఎలాంటి సంకేతాలు పంపిస్తుంది అన్నది మాత్రం ఇప్పుడు అంతటా చర్చనీయాంశంగా మారింది. చూస్తుంటే రానున్న రోజులలో రాజకీయాలలో పెను మార్పులు సంభవిస్తాయని కొందరు చెబుతున్నమాట.
Brinjal | వంకాయ... మన వంటింట్లో తరచూ కనిపించే రుచికరమైన కూరగాయ. సాంబార్, కూరలు, వేపుడు ఏ వంటకంలో వేసినా…
Health Tips | చిన్న పిల్లల నుంచి పెద్దవారికి సీతాఫలం అనేది ప్రత్యేకమైనది. ఎండాకాలంలో మామిడి పళ్ల కోసం ప్రజలు…
Peanuts Vs Almonds | బరువు తగ్గాలనే లక్ష్యంతో ఉన్నవారు సాధారణంగా తక్కువ క్యాలరీల ఆహారాన్ని ఎంచుకుంటారు. అయితే, ఆరోగ్యకరమైన…
Palm | గ్రహస్థితుల మాదిరిగానే, హస్తసాముద్రికం (Palmistry) కూడా ప్రపంచవ్యాప్తంగా విశేష ప్రాధాన్యత పొందింది. నిపుణుల అభిప్రాయం ప్రకారం, మన అరచేతిలోని…
Green Chilli | మన భారతీయ వంటల్లో పచ్చి మిరపకాయలు తప్పనిసరి భాగం. ఎర్ర మిరపకాయల కంటే పచ్చి మిరపకాయలలో…
Lemon | మన ఇళ్లలో తరచుగా కనిపించే నిమ్మకాయ వంటింటికి మాత్రమే కాదు, చర్మ సంరక్షణకు కూడా అద్భుతమైన సహజ…
Health Tips | భారతీయ సంప్రదాయంలో తమలపాకు (Betel Leaf) ప్రత్యేక స్థానం కలిగి ఉంది. భోజనం తర్వాత నోటి శుభ్రత…
Dried Chillies | ఎండు మిర్చిని కేవలం వంటకు రుచి, సువాసన మాత్రమే కాకుండా ఆరోగ్యానికి కూడా ఎంతో ఉపయోగకరమని…
This website uses cookies.