Godavari : గోదావరిలోకి నెట్టేసిన పెంపుడు తండ్రి.. పైప్ పట్టుకొని ప్రాణాలు కాపాడుకున్న కూతురు..!!
Godavari : ప్రస్తుత సమాజంలో బంధాలు అనుబంధాలకి చోటు లేకుండా పోయింది. టెక్నాలజీ వచ్చాక తీరికగా మనసు వ్యక్తి కుటుంబ సభ్యులతో మాట్లాడుకునే అమృత ఘడియలు అంతరించిపోతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. దీంతో రక్తసంబంధులు మధ్య గొడవలు ప్రాణాలు తీసుకునే పరిస్థితి నెలకొంది. ఇదిలా ఉంటే గుంటూరు జిల్లాలో పెంపుడు తండ్రి.. దారుణానికి వడిగట్టాడు. విషయంలోకి వెళ్తే గుంటూరు జిల్లాకు చెందిన ఉలవ సురేష్ తాను సహజీవనం చేస్తున్న పుప్పాల సుహాసిని (36)నీ ఆమె ఇద్దరి కుమార్తెలు కీర్తన (13), జెర్సీ (1) లను వదిలించుకోవాలని ప్రయత్నంలో ఆదివారం ఉదయం నాలుగు గంటలకు గోదావరిలోకి నెట్టేశాడు.
ఈ దుర్ఘటనలో సుహాసిని అదేవిధంగా జెర్సీ గల్లంతయ్యారు. అయితే 13 ఏళ్ల కీర్తన మాత్రం బ్రిడ్జి పక్కన వేసిన కేబుల్ పైప్ నీ ఒక చేత్తో పట్టుకుని వేలాడి ప్రాణాలు కాపాడుకుంది. అదే సమయంలో తన జేబులో ఫోన్ ఉన్న విషయం గుర్తించి వెంటనే 100కు డయల్ చేయగా పోలీసులు వచ్చి కీర్తన ప్రాణాలు కాపాడారు. అరగంట పాటు పైపుకు వేలాడి ప్రాణాలు కాపాడుకుని.. చాకచక్యంగా కీర్తన ఫోన్ చేయటంతో ఆమె సమయస్ఫూర్తికి ధైర్యాన్ని చూసి పోలీసులు షాక్ అయ్యారు.
అయితే ఈ దుర్ఘటనలో తల్లి మరియు చెల్లి గల్లంత కావడంతో కీర్తన కన్నీరు కారుస్తూ ఉంది. ఇదే సమయంలో కీర్తన ఇచ్చిన సమాచారం ప్రకారం పోలీసులు ఉలవ సురేష్ నీ పట్టుకునే ప్రయత్నాలు ముమ్మరం చేశారు.